16-3-2018 నుండి22-3-2018 వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన పనులను మిత్రులతో కలిసి ఆరంభిస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల కోసం ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. సంతానపరమైన విషయాల్లో పెద్దల సహకారం తీసుకుంటారు, వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. విదేశాల్లో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. గతంలో మీకు రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా నైనా చేతికి అందుతాయి. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద నిర్ణయాలు తీసుకోవడంలో ఆరంభంలో తడబాటు పొందిన, చివరకు విజయం పొందుతారు. విలువైన వస్తువులను పెద్దలనుండి పొందుతారు. పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో చేపట్టిన పనులకు గాను పెద్దలనుండి ప్రశంశలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఒక అడుగు ముందుకు వేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. సంతానపరమైన విషయాల్లో ఒకింత ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. మిత్రుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొండి.

 


మిథున రాశి : ఈవారం మొత్తం మీద బంధువులతో లేక మిత్రులతో సమయం గడుపుతారు. అధికభాగం సమయం సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. విలువైన వస్తువులను ఆత్మీయులకు అంద జేసే ఆస్కారం ఉంది. జీవితభాగస్వామి నుండి నూతన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. వాహనాల విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.

 

కర్కాటక రాశి :  ఈవారం మొత్తం మీద ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. చేపట్టిన పనుల విషయంలో కాస్త పట్టుదల అలాగే శ్రద్ద అవసరం. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. శక్తికి మించిన వాగ్దానాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. రుణపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. సంతానం విషయంలో సంతృప్తిని పొందుతారు. పెద్దలతో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం కలదు.

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను మొదలు పెడతారు, పనిభారం తప్పక పోవచ్చును. వారాం చివరలో కొంత ఊరట పొందుతారు. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది , జాగ్రత్త. కుటుంబంలో చిన్న చిన్న విషయాలను పెద్దగా పరిగణలోకి తీసుకోక సర్దుకుపోవడం మంచిది. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. మిత్రులతో అనుకోకుండా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది, కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన.

 

కన్యా రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. అధికారుల నుండి ప్రశంశలు పొందుటకు ఆస్కారం కలదు. చేపట్టిన పనులను కొంత ఆలస్యం అయిన విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనుల విషయంలో మరింత స్పష్టత పెంచుకొనే ప్రయత్నం ఉత్తమం . జీవితభాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి, పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వారంచివరలో కాస్త ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు.

 

 

తులా రాశి :  ఈవారం మొత్తం మీద పెద్దలతో సమయం గడుపుతారు . చేపట్టిన పనులను సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది , నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులకు గనుఁ సమాధానం చెప్పవలసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చును. దైవపరమైన పూజలలో పాల్గొనే ప్రయత్నం మేలుచేస్తుంది.

 

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడేలా ప్రయత్నం చేయుట మంచిది. ముఖ్యమైన వ్యాపారపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట మంచిది. సాధ్యమైనంత మేర చర్చలకు అవకాశం ఇవ్వకండి. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది, తోటివారి సహాయంతో పూర్తిచేసే అవకాశం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం కలదు. తల్లి తరుపు బంధువులను కలుస్తారు, వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. సమయం విలువైంది గుర్తుపెట్టుకోండి. 

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద పెద్దలతో కలిసి సమయాన్ని గడుపుతారు,ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ముందు వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకోకుండా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. సాధ్యమైనంత మేర కుటుంబసభ్యులకు సమయం ఇవ్వడం సూచన. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో మీకు రావాల్సిన ధనం వారించివరలో చేతికి అందుటకు అవకాశం ఉంది. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మిత్రులను కలుస్తారు.

 

 

మకర రాశి : ఈవారం మొత్తం మీద సమయాన్ని సరదాగా గడుపుతారు. మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది . వ్యాపారపరమైన విషయాల్లో అనుకూలమైన సమయం , కొద్దిగా శ్రమించుట ద్వారా ఉన్నతమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి సహకారం లభిస్తుంది. వారామ్ చివరలో స్వల్ప ఆనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సోదరులతో గతంలో చేపట్టిన చర్చలు ఒక కోలిక్కి వస్తాయి. విలువైన వస్తువుల వైపు మీ మనస్సు వెళుతుంది , అవసరాన్ని బట్టి ఆలోచన చేయుట మంచిది.

 

కుంభ రాశి : ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయాలకు సమయం ఇస్తారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. మీ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు పడుతాయి. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు లభ్సితాయి, అదే స్థాయిలో ఖర్చులు కూడా ఉంటాయి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. వాహనాల కోసం ధనం ఖర్చు పెడతారు. విదేశాల్లో ఉన్న ఆత్మీయుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. మీ మాటతీరు మిమ్మల్ని ప్రతి బించేలా ఉంటుంది, కాస్త ఈ విషయాల్లో దూరదృష్టి అవసరం, ఆ దిశలో అడుగులు వేయండి.

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. పనులు నిదానంగా ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు నలుగురి సహాయం అవసరం. పెద్దలతో చర్చలకు అవకాశం ఉంది. సంతనం వలన నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా వరం చివరలో కొంత కుదుట పడుతుంది. తల్లి లేకా అత్త తరుపు బంధువుల నుండి సహకారం లభిస్తుంది. చిన్న చిన్న విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో ఆలోచనలను అదుపులో ఉంచుకోవడం సూచన. మౌనం అన్నివేళలా సహయకారి.
 

మరిన్ని వ్యాసాలు