రయ్‌ రయ్‌ మైనర్‌ బాబులూ.. జర జాగ్రత్త - ..

be carefull

మా అబ్బాయికి పదేళ్లు. కానీ బైక్‌ డ్రైవ్‌ చేసేస్తాడు తెలుసా? మా వాడు కారు డ్రైవింగ్‌ కూడా నేర్చేసుకుంటున్నాడు.. ఇవన్నీ మాట్లాడుకునేందుకు చాలా బాగుంటాయి. కానీ సరదాకే. ఆచరణకు పనికి రావు. అయినా ఆచరణకు అవకాశమివ్వకపోవడం అత్యుత్తమం. ఈ మధ్య తల్లి తండ్రుల తమ పిల్లల విషయంలో చూపిస్తున్న అత్యుత్సాహమిది. చిన్న వయసుల్లోనే తమ పిల్లలు ఏదో సాధించేయాలని యోచించడం, గర్వంగా ఫీలవడం తప్పు కాదు. కానీ ఆ అత్యుత్సాహం అనేది పది మందికి ఉపయోగపడేలా, సమాజా శ్రేయస్సుకు సహకరించేలా ఉండాలి కానీ, సమాజానికి కీడు చేసేలా ఉండకూడదు. మనం చర్చించుకునే అంశమేంటంటే, చిన్న వయసులోనే పిల్లలకు డ్రైవింగ్‌ పట్ల ఆతి ఆశక్తి కల్పించడం మంచిది కాదు. అలా మైనర్స్‌కు డ్రైవింగ్‌ను అప్పగిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటున్నాయో ఈ మధ్య చాలా సందర్భాలు చూస్తున్నాం.

ఒక్క క్షణం సరదా కాస్తా, నిండు జీవితాన్ని బలి తీసుకుంటోంది. అందుకే ప్రియమైన తల్లితండ్రులారా తమ పిల్లలకు సరైన వయసు, అవగాహన వచ్చేంతవరకూ సొంతంగా డ్రైవ్‌ చేసేందుకు అనుమతినివ్వకండి అని నిపుణులు, రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. రవాణా శాఖలో ప్రస్తుతం జరుగుతున్న దళారీ అవినీతి కార్యకలాపాల కారణంగా వయసు, అవగాహనతో పని లేకుండా, ఇబ్బడి ముబ్బడిగా డ్రైవింగ్‌ లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. లైసెన్స్‌ ఉంది కదా అని తల్లితండ్రులు తమ పిల్లలకు ఫ్రీగా వాహనాలను అందిస్తున్నారు. అలా డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన లేకుండానే రోడ్డపైకొచ్చి, ప్రమాదాలకు గురవుతున్నారు.

వారితో పాటు, ఇతరుల ప్రాణాలను కూడా హరిస్తోంది ఈ అత్యుత్సాహమే. నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణం నూటికి నూరు శాతం మానవ తప్పిదాలే. ఏటా 70 నుండి 80 శాతం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ఎక్కువ శాతం యువతే కావడం గమనార్హం. అందుకు కారణం తల్లితండ్రులు. ఓ ప్రణాళికా,  పర్యవేక్షణా లేకుండా డ్రైవింగ్‌ లైసెన్సులు అందుబాటులోకి తీసుకొచ్చిన దళారీ వ్యవస్థ.  డ్రైవింగ్‌ అంటే ఆషామాషీ విషయం కాదు. మన కళ్ళు, మన చెవులు, మన మెదడు.. ఇలా చాలా భాగాలు పూర్తిగా మన ఆధీనంలో ఉండాలి. కానీ నేటి యువత ఎంతవరకూ తమ ఇంద్రియాలను తమ ఆధీనంలో ఉంచుకోగల్గుతోంది.! ఓ పక్క ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తూ ఊహించని అద్భుతాలు సృష్టిస్తూ, అదరహో అనిపిస్తోన్న యువతే, మరో పక్క విచక్షణ కోల్పోయి, అతి చిన్న కారణాలకే ఆత్మహత్యలు, హత్యలు చేసేలా, అక్రమాలకు పాల్పడేలా - విపరీత చర్యలకు దిగేలా తమ మైండ్‌ సెట్‌ని మలచుకుంటోంది. అలాంటప్పుడు డ్రైవింగ్‌పై యువత కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తోంది. అలా అని యూత్‌కి డ్రైవ్‌ చేసే అర్హత లేదా? అని కాదు. అవగాహనా రాహిత్యంతో కూడిన రద్దీ రోడ్లపై డ్రైవింగ్‌ చేయొద్దు. అలాగే సరైన శిక్షణ లేకుండా అడ్డగోలుగా డ్రైవింగ్‌ లైసెన్సులు పొందొద్దు. గుర్తింపు లేని డ్రైవింగ్‌ స్కూల్స్‌ వద్ద అరకొర శిక్షణ తీసుకోవద్దు, అనవసరంగా మీ ప్రాణాలు బలిచేసుకోవద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నారు. దయచేసి తల్లితండ్రులు ఈ విషయంలో కాస్త అప్రమత్తత పాఠించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి