‘ అభి తో అను’ షార్ట్ ఫిల్మ్ రివ్యూ - -సాయి సోమయాజులు

abhito anu shortflim review

ఈ సంవత్సరం విడుదలైన షార్ట్ ఫిల్మ్స్ లో 70MM STREET బ్యానర్‍లో రిలీజ్ అయిన చిత్రం- ‘అభి తో అను’ సమీక్ష , మీ కోసం-

 

కథ :
మూడు సంవత్సరాలుగా రిలేషన్‍లో ఉన్న అను, తన బాయ్‍ఫ్రెండ్ అభీకి బ్రేకప్ చెప్పడానికి ఓ కాఫీ షాపుకు పిలుస్తుంది. ’అసలు అను ఎందుకని బ్రేకప్ అవ్వాలనుకుంటుంది? అభీ, అనుని నమ్మించి, ఆమె ప్రేమను తిరిగి పొందగలడా?’ అన్నదే ఈ కథ!

 

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమా కథకు ప్రేమలో ఉన్న ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ‘కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, కూర్చుని మాట్లాడుకుని సరి చేసుకోవచ్చు’ అన్న సందేశం యువతకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్. డైలాగ్స్ చాలా సింపుల్ గా, నీట్ గా ఉన్నాయి. అను పాత్ర పోషించిన భావన చౌదరి నటన ఓ కే అనిపిస్తుంది. ఈ లఘు చిత్రం లో యదార్ధం దాగి వుంది.

 

మైనస్ పాయుంట్స్ :
ఈ సినిమా ఓపెనింగ్ తొందర-తొందరగా చూపించడం వలన సెటప్ వీక్‍గా అనిపిస్తుంది. ఒకే లొకేషన్‍లో కథ నడిచేటప్పుడు కెమెరా వర్క్ అందంగా ఉండడం చాలా అవసరం, లేకపోతే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశం ఉంటుంది. సీన్‍కి తగ్గ యాంగిల్స్ లేకపోవడం, కొన్ని షాట్స్ లో ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం, అనవసరంగా ఫోకస్ షిప్ట్ అవుతూ ఉండడం ప్రేక్షకులని డిస్టర్బ్ చేస్తుంది. డబ్బింగ్ బాగున్నప్పటికీ, యాంబియన్స్ సౌండ్ యాడ్ చెయ్యనందువల్ల ఆర్టిఫిషియల్‍గా అనిపించే అవకాశం ఉంది. కంటిన్యుటీ ఎర్రర్స్ ఉన్నాయి.

 

సాంకేతికంగా :
చంద్ర ప్రకాశ్ అందించిన సంగీతం ఈ లఘుచిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్. చాలా వరకు తప్పులు ఎడిట్ టేబుల్‍లో సరి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్లెయిన్‍గా ఎడిట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓ.కె. ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన భాను ప్రకాశ్ మంచి అంశం ఎంచుకున్నాడు.

 

మొత్తంగా :
అనూ ఫీలింగ్స్ కోసం.. అభి మాటల కోసం.. చూడచ్చు!

 

అంకెలలో :

3.25/5

 

LINK :
https://www.youtube.com/watch?v=ucD_7iHFSYw&feature=youtu.be

మరిన్ని వ్యాసాలు