30-3-2018 నుండి 5-4 -2018 వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఆశించిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. నూతన పనులను చేపట్టు విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం అనేది సూచన.నలుగురిలో కలిసి పనిచేసే సమయంలో కలుపుకొని వెళ్ళు స్వబావం వలన మేలుజరుగుతుంది ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన ఉద్యోగంలో బాగానే ఉంటుంది.  కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉండి వాటికి సమయాన్ని ఇచ్చే అవకాశం ఉంది కాస్త జీవితభాగస్వామి ఆలోచనలు వినడం మేలు. అర్థికంకు సంభందించిన విషయాల్లో ఫలితాలు అనుకూలంగానే వచ్చుటకు ఆస్కారం ఉంది అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన.

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలతో గుర్తింపును పొందుతారు అలాగే వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది.  ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులను తగ్గించుకోవడం వలన ఉద్యోగంలో అధికారులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు అలాగే నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. సేవాసంభందమైన పనులను మొదలుపెడతారు నలుగురికి ఉపయోగపడే పనులను చేపట్టుట మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి వివాదములకు దూరంగా ఉండుట సూచన. మిత్రులను కలిసే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి నూతన వ్యపారపరమైన విషయాలను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది ఈ విషయంలో సంత్రుప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు.      


మిథున రాశి : ఈవారంలో సాధ్యమైనంత వరకు చర్చలకు అవకాశం ఇవ్వండి. పెద్దలతో చేపట్టిన పనులు ఒక కొలిక్కి వస్తాయి. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదావేయకపోవడం మంచిది. సంతానపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి.అధికమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. స్త్రీ / పురుష సంభందమైన విషయాల వలన మాటపడవలసి రావోచ్చును కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. పెద్దలతో అనుభందాలు పెంపొండుచుకొనే ప్రయత్నం చేయుట అనేది అవసరం లేకపోతే మీ మధ్య దూరాలు పెరుగుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చేపట్టిన పనుల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు.   

 

కర్కాటక రాశి :  ఈవారం మొత్తంమీద చేపట్టిన అనవసరమైన విషయాలకు సమయాన్ని వృధాచేసే  అవకాశం కలదు ఈ విషయంలో స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండుట సూచన. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి వాటికి సమయం ఇస్తారు. బంధువులతో లేక మిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది కాకపోతే మీ ఆలోచనల స్థాయిమార్పు అవసరం. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. పెద్దలనుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది.

 

 సింహ రాశి : ఈవారం మొత్తంమీద ప్రయాణాల మూలాన స్వల్ప ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది కావున వాటిని వాయిదా వేయుట ఉత్తమం. సంతానపరమైన విషయల్లో కొంత ఒత్తిడి పొందుతారు బాగా ఆలొచించి నిర్ణయం తీసుకోవడం సూచన. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న తడబాటులు ఉన్న సర్డుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపును పొందుతారు. నలుగురికి ఉపయోగపడే పనులను మొదలు పెడతారు అందరిలో గుర్తింపు లభిస్తుంది. అమ్మతరుపు వారి నుండి చిన్న చిన్న సమస్యలు తప్పక పోవచును సర్దుబాటు అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో మార్పులు నిదానంగా కలుగుటకు అవకాశం ఉంది ఓపిక అవసరం.

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది,నూతన  పరిచయాలు అవుతాయి.  మీయొక్క వ్యవహారశైలి మూలాన నూతన సమస్యలు పొందుతారు కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన నిదానంగా వ్యవహరించుట సూచన. ధనమునకు సంభంధించిన విషయాల్లో నూతన ఆలోచనలు పక్కనపెట్టి సంప్రదాయ విధానాలు పాటించుట ఉత్తమం. ఉద్యోగంలో అధికారుల మూలాన పనిఒత్తిడి ఉన్నను ఆశించిన స్థాయిలో నలుగురి నుండి సహకారం లభిస్తుంది.  విందులలో పాల్గొంటారు వాటి విషయంలో ప్రత్యేకమైన అభిరుచిని చూపిస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దల నుండి సలహాలను పొందుతారు వాటిని ఆచరించుట వలన లబ్దిని పొందుటకు అవకాశం కలదు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు.

 

తులా రాశి :  ఈవారం మొత్తంమీద అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండుట సూచన. మిత్రులతో కలిసి చేయుఆలోచనల విషయంలో స్పష్టమైన అవగాహన అవసరం. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. చేపట్టు పనుల విషయంలో పూర్తిస్థాయి అవగాహనతో ముందుకు వెళ్ళడం మూలాన మేలుజరుగుతుంది.  సంతానవిషయంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది, ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది ఈవిషయంలో బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని ఇస్తారు చిన్న చిన్న జాగ్రత్తల పట్ల శ్రద్ద అవసరం. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం వలన నూతన అవకాశాలు పొందుతారు. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారినుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది.  

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద నలుగురిలో గుర్తిపు పొందే ఆలోచనలు చేస్తారు అలాగే సామాజిక సేవకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను కాస్త ఇబ్బందులు పొందినను వాటిని విజయవంతనగా పూర్తిచేసే అవకాశం ఉంది. విదేశీప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది ప్రయత్నం పెంచుట సూచన. స్వల్పఆరోగ్యసమస్యలు తప్పకపోవచ్చును సమయానికి భోజనం చేయుట మంచిది.  బంధువులతో కలిసి చేపట్టిన పనుల్లో అనుకోని ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నంలో విఫలం అవుతారు. దిద్దుబాటు చర్యలు పెద్దల సూచనల మేర చేయుట వలన నష్టంకొంత తగ్గుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిలో ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకొనేఅవకాశం ఉంది.  

ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి చాలాకాలంగా ఎదురుచూస్తున్న విషయంలో సంతృప్తినిచ్చే ఫలితాలు పొందుతారు. బంధువులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. మాటను పొదుపుగా  వాడుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన సమాచరం సేకరిస్తారు వారికి అనుగుణంగా ఆలోచనలు చేయుట మంచిది. దూరప్రదేశం నుండి ఒక సంతోషకరమైన వార్తను వింటారు. కొన్ని కొన్ని విషయాల్లో అనవసరంగా ఆందోళన చెందుటకు అవకాశం ఉంది కావున ఈ విషయంలో మానసికంగా దృడంగా ఉండుట సూచన. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు.

 

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద చేసే పనులలో ఒత్తిడి ఉంటుంది అలాగే ఇబ్బందులు పొందుతారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో సరైన శ్రద్ధను కలిగి ఉండుట మంచిది.  ఆర్థికపరమైన విషయాల్లో తోడ్పాటు లభిస్తుంది కుటుంబసభ్యుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయలలో నూతన పెట్టుబడులకు ఇది సమయం కాదు వేచిచూసే దొరని మంచిది.ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట కాస్త ఊరటను కలిగించే విషయం. దూరప్రదేశం నుండి మీరు తెలుసుకొనే సమాచరం మిమ్మల్ని ఆత్మరక్షణ దొరనిలోకి పంపెదిగా ఉండే అవకాశం ఉంది జాగ్రత్త. శుభకార్యాక్రమాలలో పాల్గొంటారు వాటికి సమయాన్ని ఇస్తారు. మిత్రులనుండి వచ్చే అలాగే తెలుస్కోనే విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద పనిఒత్తిడి ఉంటుంది తోటివారి నుండి సహకారం కోరుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నూతన ఆలోచనలు కలిగి ఉండే అవకాశం ఉంది. అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. ఉద్యోగంలో కొంత సర్దుకుపోవడం వలన మరింత మేలుజరుగుతుంది అలాగే సమయపాలన పాటించుట ఉత్తమం. కుటుంబంలో సభ్యులమధ్య సాన్నిహిత్యం పెంచుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది వారి ఆలోచనలను పాటించే ప్రయత్నం చేయుట ఉత్తమం. మిత్రులతో కలిసి దూరప్రదేశాలు ప్రయాణం చేయుటకు అవకాశం ఉంది విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

 

మీన రాశి : ఈవారం మొత్తంమీద చేసే ప్రతి ఆలోచన మిమ్మల్ని నిర్దేశించే అవకాశం ఉంది కావున అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోవడం ఉత్తమం. తలపెట్టిన పనులలో ఆశించిన ఫలితాలు వస్తాయి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. కుటుంబంలో సభ్యుల ద్వార నూతన ఆలోచనలు వింటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానేఉన్న దానికితగ్గట్టుగా ఖర్చులు పెరుగుటకు ఆస్కారం కలదు. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. మీయొక్క మాటతీరు మూలాన కొంతమంది భాధకు లోనయ్యే అవకాశం కలదు. సోదరాసంభ్నదమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది వారి సూచనలు పరిగణలోకి తీసుకోండి.     
 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు