వార ఫలం (13 సెప్టెంబర్ - 19 సెప్టెంబర్) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం అనుకూలమైన వాతావరణంలో పనులను చేపడుతారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు. మరొకప్రదేశంలో నివసించ వలసి రావచ్చును. సోమ, మంగళ వారాలలో ప్రయత్నాలలో విజయంను పొందుతారు. ఇష్టమైన పనులను పూర్తిచేయుటలో ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు. బుధ, గురువారాలలో బంధువులతో కలిసి చేపట్టు పనులలో విజయాన్ని పొందుతారు. ఆర్థికపర మైన విషయాలో తప్పక అనుకూలమైన ఫలితాలు కల్గుతాయి. వారంలో మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించుకొనే అవకాశం కలదు. అనుకోని ఖర్చులను పొందుటకు అవకాశం కలదు. అయినను ఉత్సాహంతో పనులను పూర్తిచేయుటకు అవకాశం ఉంది. అనారోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన. వినోదముల యందు ఇష్టంను కలిగి ఉండే అవకాశం ఉంది. చర్చాసంబంధమైన విషయాల్లో మక్కువను కలిగి ఉంటారు. ఉద్యోగంలో మాత్రం అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. కోపంను, అలాగే విచారంను కలిగి ఉండే అవకాశం కలదు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం.       

వృషభ రాశి

ఈవారం మిశ్రమ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నవి కావున కొంత ఆచితూచి వ్యవహరించుట మంచిది. శుక్ర, శని, ఆదివారాల్లో అనారోగ్య సమస్యలు భాదించే అవకాశం కలదు జాగ్రత్త. ఆశించిన ఫలితాలలో కొంత అసంతృప్తిని పొందుటకు అవకాశం కలదు. సోమ, మంగళ వారాలలో కుటుంబంలో నూతన నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తే వాయిదా వేసే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగంలో కూడా నిదానంగా వ్యవహరించుట సూచన. బుధ, గురువారాల్లో ఇష్టమైన పనులలో కొంత ఆసక్తిని కలిగి ఉంటారు. ఆదిశగా అడుగులు ముందుకు వేయుటకు అవకాశం ఉంది. వారంలో ప్రయాణాలలో ఆటంకాలు పొందుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులు అనుకోని ఖర్చులను కలుగ జేసే అవకాశం ఉంది. నిర్ణయాలలో స్వల్ప తడబాటు ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమను కల్గి ఉంటారు. నిదానం అవసరం. మాటను పొదుపుగా వాడుట చేత కొన్ని వివాదములు తగ్గుటకు ఆస్కారం ఉంది. ధర్మసంబంధమైన విషయాల్లో పాల్గొనుట మూలాన తప్పక మేలుజరుగుతుంది. కళత్రం మూలాన ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు జాగ్రత్త. స్త్రీ/పురుష సౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది.  

మిథున రాశి
ఈవారం మీవైన ఆలోచనలు కలిగి ఉంటారు వాటిని సాదించుకొనే దిశగా ముందుకు వెళ్ళు ప్రయత్నం చేస్తారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. తలపెట్టిన పనుల మూలాన అందరిలోను గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. సోమ, మంగళ వారాలలో అనారోగ్యం విషయంలో అశ్రద్దచేయకండి. తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించుట మంచిది. బుధ, గురువారాలలో కుటుంబంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. సభ్యులందరు కలిసి చర్చించుట మూలాన మేలుజరుతుంది. వారంలో బంధువులతో కలిసి నూతన పనులను చేపుడుతారు. వారం చివరలో ప్రయాణాలలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. స్నేహితులతో మాత్రం నిదానంగా ఉండుట మంచిది. పెద్దల సూచనల మేర ఆరంభించిన పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. అధికారులకు మీరు ఆవలంభించిన విధనాలు నచ్చకపోవచ్చును జాగ్రత్త. భోజనం విషయంలో మాత్రం శ్రద్ధను కలిగి ఉంటారు.  సౌఖ్యంను పొందుతారు.
 

కర్కాటక రాశి
ఈవారం మీరు చేయు పనులలో అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది, జాగ్రత్తగా నడుచుకొనుట మూలాన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాలలో ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను కలిగి ఉంటారు. ఇతరులకు సేవచేయాలనే ఆలోచనను కలిగి ఉంటారు. సోమ, మంగళ వారాలలో చేపట్టిన పనులలో గౌరవాభివ్రుద్దిని కలిగి ఉంటారు. చేపట్టిన పనులలో సంతృప్తికరమైన ఫలితాలను పొందుట చేత సంతోషంను పొందుతారు. బుధ, గురువారాల్లో మాత్రం తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకొనుట ఉత్తమం. అనారోగ్యం మూలాన చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును. కష్టాలను కలిగి ఉంటారు. సర్దుబాటు అవసరం. ఆర్థికపరమైన విషయాలలో వారం ఆరంభంలో నిదానం అవసరం రాను రాను బాగుంటుంది. బంధువులతో కలిసి చేయుప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. అధికారులతో మాత్రం వారికీ అనుగుణంగా నడుచుకొనుట సూచన. ప్రయాణాలు అధికంగా చేయుట మూలాన ఖర్చులను కలిగి ఉంటారు.   

సింహ రాశి
ఈవారం మీరు చేయుపనుల పట్ల శ్రద్ధను కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. శుక్ర, శని, ఆదివారాలలో ఒకవార్త మీకు కొంత భాదను కలిగించుటకు అవకాశం ఉంది. అనారోగ్యం విషయంలో తప్పక జాగ్రత్తలు పాటించుట మంచిది. తలపెట్టిన పనులలో ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త అవసరం. సోమ, మంగళ వారాలలో ఇతరులకు సేవచేయుట మూలాన పేరును కలిగి ఉంటారు. అలాగే మీ ఆలోచనలు తోటివారికి ఉపయోగపడేవిగా ఉండుటకు అవకాశం కలదు. బుధ, గురువారాలలో ఆర్థికపరమైన విషయాల్లో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మానసికంగా సంతోషంను కలిగి ఉంటారు. వారంలో సమయానికి భోజనం చేయుట మంచిది అశ్రద్ద కూడదు. బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోకండి. నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. సంచారం చేయవలసి రావచ్చును. వాటిమూలాన శ్రమను పొందుతారు. జాగ్రత్తగా నడుచుకొనుట మూలాన పనులలో విజయంను పొందుతారు. వ్యతిరేకవర్గంను జయించుటకు అవకాశం కలదు. వ్యాపారంలో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది.
 

కన్యా రాశి
ఈవారం మీరు కొంతప్రతికూలమైన వాతవారాణాన్ని కలిగి ఉండుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ముందుకు వెళ్ళుట మంచిది. శుక్ర, శని, ఆదివారాలలో తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుట మూలాన ఆందోళనను కలిగి ఉంటారు. పనులను చేపట్టుముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట ఉత్తమం. సోమ, మంగళ వరాలలో అనుకోని సంఘటనలు జరుగుట వాటిమూలన వ్యతిరేక ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం ఉంది. బుధ, గురు వారాలలో కొంత మేర అనుకూలమైన వాతావరణం ఉండుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కలిసి వచ్చుటకు ఆస్కారం ఉంది. కుటుంబంతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. వారంలో మీ ఆప్తబందువులలో ఒకరి ఆరోగ్యం ఒకింత ఆందోళనను కలిగించే అవకాశం కలదు. తలపెట్టిన పనులలో విజయాన్ని సాదించుటకు అధికమైన శ్రమ అవసరం. సమయానికి భోజనం చేయుట మేలు అశ్రద్ద చేయకండి. అకారణంగా తిరగవలసి రావచ్చును భయంను కలిగి ఉంటారు. కుటుంబంలో కలుగు మార్పులు సంతోషాన్ని కలుగజేయుటకు అవకాశం ఉంది.

తులా రాశి
ఈవారం మీరు ప్రతిపనిని బాగాఆలోచించి ఆరభించుట మంచిది. పెద్దల సూచనలు పాటించే ప్రయత్నం చేయుట మంచి ఫలితాలను కలుగ జేస్తుంది. శుక్ర, శని, ఆదివారాలలో ఇష్టమైన వారిని కలిసే అవకాశం కలదు. నచ్చిన పనులను చేపట్టడానికి ఇష్టంను చూపిస్తారు. ఉల్లాసంను కలిగి ఉండి నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. సోమ, మంగళవారాలలో ఆశించిన ఫలితాలు రాకపోవడం చేత ఒకింత ఆందోళనకు గురయ్యే అవకాశం కలదు. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు ఆస్కారం కలదు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. బుధ, గురువారాల్లో అనారోగ్యం మూలాన ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది. ఆశుభావర్తను వినే అవకాశం ఉంది. దైవసంబంధ కార్యక్రమాలలో పాల్గొనుట మంచిది. వారంలో మధుర పదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొనుటకు అవకాశం ఉంది. సంచారం చేయుట మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఉద్యోగంలో చిక్కులు తప్పక పోవచ్చును నిదానం అవసరం. ఆర్థికంగా బాగానే ఉంటుంది. నూతన అవకాశాలు కలుగుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వాటిమూలన లాభంను పొందుతారు.

వృశ్చిక రాశి
ఈవారం మీరు అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. లేకపోతే స్వల్ప ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాలలో ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట మంచిది. అనుకోని సంఘటనలు జరుగుటకు అవకాశం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట అవసరం. సోమ, మంగళ వారాలలో ఇష్టమైన వారితో కలిసి నచ్చిన పనులను చేపడుతారు. తలపెట్టిన పనులలో లాభంను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. కాకపోతే ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. బుధ, గురువారాల్లో పనులలో వేగం తగ్గుతుంది అనుకోని ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో స్వల్ప మాటపట్టింపులు కలుగుటకు అవకాశం కలదు. వారంలో రాజకీయ వ్యవహరాలలో పాల్గొనే అవకాశం కలదు. అధికారుల మూలాన లాభంను పొందుటకు అవకాశం కలదు. స్థానచలనంకు అవకాశం కలదు. సంచారం చేయుట మూలాన స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనుల మూలాన గౌరవాభివ్రుద్దిని పొందుతారు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండుట సూచన.

ధనస్సు రాశి
ఈవారం మీరు అనుకున్న పనులు నిదానంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. శుక్ర, శని, ఆదివారాలలో భోజనసౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని గడుపుటకు అవకాశం కలదు. సోమ, మంగళ వారాలలో సమయానికి భోజనం చేయట వలన మేలు జరుగుతుంది. పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుట చేత మనోవిచారంను పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులు నిదానంగా వ్యవహరించుట మంచిది. బుధ, గురువారాల్లో నూతన వస్త్రలాభంను పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుటకు అవకాశం కలదు. ఇష్టమైన వారిని కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు . వారంలో అనుకోని ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలలో తగిన జాగ్రతలు పాటించుట మంచిది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తిఅవుటకు అవకాశం కలదు. రాజకీయాలలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు.

మకర రాశి
ఈవారం మీరు మాటలను పొదుపుగా వాడుట మంచిది. పనులలో శ్రద్ధను కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. శుక్ర, శని, ఆదివారాలలో అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాలలో ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. అనవసరపు ఖర్చు కలుగుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో విభేదాలు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. సోమ, మంగళ వారాలలో భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. మృష్టాన్నభోజన ప్రాప్తిని పొందుటకు అవకాశం కలదు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. బుధ, గురువారాలలో మాటలను పొదుపుగా వాడుట మంచిది అకారణంగా వివాదములు కలుగుటకు ఆస్కారం కలదు. అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం ఉంది, జాగ్రతలు పాటించుట మంచిది. కుటుంబంలో స్వల్ప విభేదాలు కలుగుటకు ఆస్కారం కలదు. నూతన నిర్ణయాలు తీసుకోకూడదు. మీ ఆలోచనలను తోటివారు వ్యతిరేకించే అవకాశం కలదు సర్దుకుపొండి. కలహాములకు దూరంగా ఉండుట సూచన. వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు తప్పక పోవచ్చును.

కుంభ రాశి
ఈవారం మీరు సామాన్యమైన ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. నిదానంగా అడుగులు వేయుట మూలాన ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. శుక్ర, శని, ఆదివారాలు బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుటకు అవకాశం ఉంది. నూతన అవకాశాలు కలుగుటకు ఆస్కారం కలదు. సోమ, మంగళవారాలలో చేయుపనుల పట్ల అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను పూర్తిచేయుటకు శ్రమను అధికంగా పొందుటకు ఆస్కారం కలదు. అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉండే అవకాశం ఉంది. మిత్రులతో కలిసే అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. వారంలో కుటుంబంలో నిర్ణయాలు తీసుకొనే ముందు బాగాలోచించుట మంచిది. సేవాగుణాన్ని కలిగి ఉంటారు. మీ పనులు ఇతరులకు ఉపయోగపడే అవకాశం ఉంది. అకారణంగా భయంను పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో మీ ఆలోచనలు అనుకూలమైన ఫలితాలు కలుగజేస్తాయి. గురుభక్తిని కలిగి ఉంటారు వారిమాటలను గౌరవించుట మేలుచేస్తుంది.   

మీన రాశి
ఈవారం మీరు సంతోషంగా గడుపుటకు అవకాశం కలదు.  ప్రణాళికా ప్రకారం వెళితే విజయం మీదే అవుతుంది. శుక్ర, శని, ఆదివారాలలో తలపెట్టిన పనులలో విజయంను పొందుటకు అవకాశం ఉంది. బంధువుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు. అధికారులతో మీరు చేసిన పనులకు గుర్తింపు లభిస్తుంది. ఇష్టమైన పనులను చేపట్టుటకు ఆస్కారం కలదు. సోమ, మంగళ వారాలలో బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుటకు అవకాశం ఉంది. మానసిక సౌఖ్యంను కలిగి ఉంటారు. బుధ, గురువారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులు పొందుటకు అవకాశం ఉంది. కొంత మేర ధననష్టంను పొందుటకు అవకాశం కలదు. వారంలో నూతన ప్రయత్నాలలో విజయంను పొందుటకు అవకాశం కలదు. పెద్దలతో కలిసి కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. ఉత్సాహంతో నూతన పనులు చేపడుతారు. ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట మంచిది. అధికారులతో పనిభారంను పొందుటకు అవకాశం కలదు. స్థానచలనంకు అవకాశం కలదు. విందులలో పాల్గొనే అవకాశం కలదు.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు