మండు వేసవి వచ్చేసింది. తీవ్రమైన ఎండ తాపం తెచ్చేసింది. ఈ తాపాన్ని తట్టుకొనేదెలా? గత ఏడాది కంటే ఈసారి ఎండలు ఎక్కువేనని చెప్పుకోవడం అలవాటైపోయింది. పిల్లలైనా, పెద్దలైనా ఈ ఎండ తాపం భరించాల్సిందే తప్పదు. బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోలేం కదా. బయటకు వెళ్ళాలి, ఎండ తాపం నుచి తప్పించుకోవాలి. మరీ మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్ళకపోవడమే మంచిది. ఉన్నంతలో కాసింతైనా ఉపశమనం పొందడానికే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఉపశమన చర్యల సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో ముఖ్యంగా చెమట రూపంలో శరీరం నుండి వాటర్ కంటెన్ట్ ఎక్కువగా బయటికి పోతుంది. తద్వారా డీ హైడ్రేషన్ ఏర్పడి, వడదెబ్బ తగులుతుంది. దీన్ని తట్టుకోవాలంటే, ప్లెంటీ ఆఫ్ వాటర్ మన బాడీకి అందించాలి. రెగ్యులర్‌గా లిక్విడ్స్ తీసుకోవాలి. తాపాన్ని తట్టుకునేందుకు కూల్ డ్రింక్స్, కూల్ వాటర్స్‌ని ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది.
కానీ అవి తాత్కాలికంగా బాడీని కూల్ చేసినా, తర్వాత తాపాన్ని మరింత పెంచుతాయి. సో ఆ టైప్ లిక్విడ్స్ జోలికి పోకుండా ఉండడం మంచిది. వాటి ప్లేస్‌లో కూల్ వాటర్ కోసం మన నేచురల్ ఫ్రిజ్ అంటే మట్టి కుండలోని నీళ్లను ఉపయోగించడం శ్రేయస్కరం. అన్ని వేళలా ఇది కుదరకపోయినా, కుదిరిన కొన్ని సమయాల్లోనైనా వీటిని ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. అలాగే బార్లీ, సబ్జా గింజలు, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ రసం వంటి లిక్విడ్స్ తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా వాటర్ కంటెన్ట్ అంది, వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. చాదస్తం అనుకోకుండా, మార్కెట్‌లో లభించే ఇతర శీతల పానీయాలను తక్కువ ఉపయోగించి, ఇంటి శీతల పానీయాలను ఎక్కువ ఉపయోగిస్తే తక్కువ ఖర్చు, ఎక్కువ ఆరోగ్యం.
అలాగే వాటర్ కంటెన్ట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి. పుచ్చకాయలు, గ్రేప్స్. మస్క్ మిలాన్ తదితర ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్‌లో వచ్చే ప్రతీ పండును టేస్ట్ చేయడం మర్చిపోకూడని అంశం. ఎండలోకి వెళ్లేటప్పుడు వెంట గొడుగు కానీ, టోపీలు కానీ ఉపయోగించడం తప్పనిసరి. వెంట ఓ వాటర్ బాటిల్ తీసుకెళ్తే ఇంకా మంచిది. ఎండలోకి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్‌ని కూడా వాడడం గుర్తుంచుకోవల్సిన మరో ముఖ్య విషయం. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోని వాతావరణం ఎప్పటికప్పుడు చల్లగా ఉంచేందుకు వీలుగా వట్టివేలుతో చేసిన పరదాలు వాడడం మంచిది. వాటిపై ఎప్పటికప్పుడు కాస్త వాటర్ చల్లుతుంటే, ఇళ్లు చల్లబడుతుంది. అలాగే ఈ వేసవిలో ఇళ్లు వీలైనంత ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లోని అనవసర వస్తువుల్ని పక్క పడేసి, వీలైనంత ఖాళీ ప్లేస్ ఉంచుకోవడం వల్ల గాలి ప్రసారం బాగా జరుగుతుంది. వీలైతే, ఇంట్లో ఇంటీరియర్ ప్లేంట్స్ పెంచుకోవడం ఇంకా ఉత్తమం. ఇవి ఇంట్లోని కార్భన్‌డైఆక్సైడ్‌ని పీల్చుకుని ఆక్సిజన్‌ని రిలీజ్ చేయడంలో తోడ్పడటంతో పాటు, ఇంట్లోని వాతావరణం కూల్‌గా ఆహ్లాదంగా ఉంచేందుకు ఉపకరిస్తాయి.