జోకులు - డా. ఎస్. జయదేవ్ బాబు

 

శకుని మామ: దుర్యోధనా... ప్రపంచం లో నీకు మంచి వాళ్ళూ, ధర్మరాజుకి చెడ్డవాళ్ళూ కనిపించరటగా?

దుర్యోధనుడు: ఔనూ, తెలిసిందేగా? ఆ మాటెందుకిప్పుడూ?
శకుని మామ: నా గురించి నువ్వేమంటావో తెలుసుకుందామనీ..
దుర్యోధనుడు: అది , నువ్వేచెప్పావ్ గా!!

 

శకుని మామ: వరసకి, ఈ రేఖ నీకు కోడలే! ఐతే నీ కొడుక్కి చేసుకుంటే  తిరుగులేని కోడలైపోతుంది గా! సంకోచం దేనికీ?
దుర్యోధనుడు: ఘటోత్కచుడి చేతిలో దెబ్బలు తినాల్సొస్తుందని భయంగా వుంది!!


 

 

"నీ చేతుల్లో నలిగిపోతాము, ఐనా, నువ్వొకటంటే ఒకటి, రెండంటే రెండు, సున్నా అంటే సున్నా... ఎదురు చెప్పకుండా విని, నీకూ, నిన్నంటిన వాళ్ళకీ, రాజ్యాలూ, రాసులూ, రాణులూ గెలిపించి యిస్తాం! మమ్మల్నెప్పుడూ చీకటి కొట్లో బంధించి పెడతావే?"
ఒక పిచిక: ఆ మాటలు మాట్లాడేదెవరూ?
రెండో పిచిక: పాచికలు! శకునితో మాట్లాడుతున్నాయి!!



భటులు: దుశ్శాసన మహారాజా..! చీరలు నేసేవాళ్ళు తమ కొలువు కోరి వచ్చారు!
దుశ్శాసనుడు: లోపలికి రమ్మను, (నేత కార్మికులు చీరల మూటలతో ప్రవేశిస్తారు)    
నేతకార్మికులు: మహా ప్రభూ, ఈ చీరలను కొలత కొలిచి, పొడవులు నిర్ణయించండి. మీరు చీరల కొలతెరిగిన ప్రావీణ్యులు కదా!
దుశ్శాసనుడు: ఖర్మ రా బాబూ.. నా బతుకు బండపాలైనా బాగుండేది.. కేవలం చీరల పాలయిందే...!!

సైనిక శిబిరం నుండి, దుశ్శాసనుడు: దండనాయకా, గోగ్రహణం సజావుగా సాగుతోందా?
దండనాయకుడు: మన సేవలను అదుపులో పెట్టలేకపొతున్నాం ప్రభూ!
దుశ్శాసనుడు: ఏం? ఎందుచేత?
దండనాయకుడు: మన సేనలు, విల్లు బాణాలూ, ఈటెలూ, కర్రలు పక్కన పెట్టి , చెంబులు చేత పట్టి ఆవులను తరుముతున్నారు ప్రభూ!
దుశ్శాసనుడు: చెంబులతోనా?
దండనాయకుడు: ఔను ప్రభూ.. పాలు పితికి తాగడం కోసం!!

ఒక బ్రాహ్మణుడు:  దాన కర్ణా నాకు జీడిపప్పు కావాలి!
కర్ణుడు: మణుగులు మణుగులు ఇచ్చాం... తీసుకో...!
భ్రాహ్మణుడు: ఉత్త జీడిపప్పు కాదు, దానితో వండిన పాయసం తాగాలి!
కర్ణుడు: నీ అభీష్టం నెరవేరుగాక!
భ్రాహ్మణుడు: పాయసం తాగించడానికి, అందమైన పరిచారికలు కావాలి!
కర్ణుడు: ఇచ్చాం పో!
బ్రాహ్మణుడు: ఆ పరిచారికల పోషణార్ధం, ధనం కావాలి.
కర్ణుడు: ధనమే కాదు, నీకొక గ్రామమే ఇచ్చాం పో!!
బ్రాహ్మణుడు: ఆ గ్రామం భూముల్లో, జీడి పంట పండించుకునేలా వుండాలి!
కర్ణుడు: అలాగే... అలాంటి గ్రామమే నీకు దానం ఇచ్చాం పో!!
బ్రాహ్మణుడు సంతోషంగా బయటికొస్తాడు. ఇదంతా గమనించిన సేవకుడు బ్రాహ్మణుడితో...
"ఏమయ్యా... నీ కోరిక జీడిపప్పుతో ప్రారంభించక, ఏకంగా గ్రామమే కావాలని, కర్ణుల వారి నడకపోయావా?"

బ్రాహ్మణుడు: భలేవాడివే... అలా అడిగితే, ధనమూ, పరిచారికలూ, జీడిపంట పండించే నేలలూ వస్తాయని ఏం నమ్మకం??

దుర్యోధనుడు: మామా, కండరాలు, ఎముకలు, మృదులాస్థి, స్నాయువులు, కీళ్ళు, నరాలు గురించీ, కండర - అస్థిపంజర రుగ్మతల గురించి క్షుణ్ణం గా తెలుసుకోవాలనుంది.
శకుని: ఎందుకు నాయనా?
దుర్యోధనుడు: భీముడు, నా తొడలు విరుస్తాడని శపథం పూనాడు గదా?

దృతరాష్ట్రుడు: రోజూ మనం పాచికలాడుతాం! ప్రతిరోజూ, ప్రతి ఆటా, నువ్వే గెలుస్తావే? ఎలా గాంధారీ?
గాంధారి: నేను శకుని అక్కను! మీకు తెలియనిదేముంది నాధా?

 

 

కర్ణుడు: మతిమరుపుకి విరుగుడు, జ్ఞాపక శక్తి పెంపుదలకి  మందులున్నాయా?
రాజవైద్యుడు: అద్భుతమైన మందులూ, కషాయాలూ వున్నాయి ప్రభో! ఐతే అవి అస్త్రప్రయోగ మంత్రాలకి పనిచేయవు అంగరాజా! క్షమించండి..శెలవు!!  
ఇది గమనిస్తున్న

గంధర్వుడు-1: ఆ రాజవైద్యుడి సమాధానం గమనించావా? ఎంత నేర్పుగా తప్పించుకున్నాడో?
గంధర్వుడు-2: ఆ రాజవైద్యుడ్ని అలా పలకించిందెవరనుకున్నావూ...
గంధర్వుడు-1: ఎవరేం?
గంధర్వుడు-2: ఇంద్రుడు!!


యుద్ధ భూమిలో ఒక సైనికుడు, శకుని తో: నకుల సహదేవులు తమరి మీద పన్నాగం పన్నుతున్నారు ప్రభో!
శకుని: చవటలు! వాళ్ళేమీ చేయలేరు.
సైనికుడు: వాళ్ళిద్దరి చేతుల్లోనే మీ చావు మూడుతుందని అశరీరవాణి పలికిందట! ( ఈ లోగా ఆ సైనికుడు పరుగు తీసి తప్పించుకుపోతాడు)
శకుని: ఒరేయ్ ఎవడ్రా వాడు?
సేవకుడు: వాడు మన కౌరవసేన సైనికుడు కాదు ప్రభో! పాండవ సేన సైనికుడు!! 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు