‘ అనుకోకుండా’షార్ట్ ఫిల్మ్ రివ్యూ - సాయి సోమయాజులు

anukokunda short flim review

48 హవర్ ఫిల్మ్ ప్రాజెక్ట్ కోసమై 48 గంటల్లో తీసి, ‘బెస్ట్ ఫిల్మ్’, ‘బెస్ట్ మ్యూజిక్’ మరియూ ‘బెస్ట్ యాక్ట్రస్’ అవార్డ్స్ ని సొంతం చేసుకోవడమే కాకుండ, ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ కి షార్ట్ లిస్ట్ కూడా అయిన లఘుచిత్రం- ‘అనుకోకుండా’.  ‘పెళ్లిచూపులు’ సినిమాతో తన ట్యాలెంట్ నిరూపించుకున్న తరుణ్ భాస్కర్, దానికి ముందే ఈ లఘు చిత్రంతో పలువురి ప్రశంసలు పొందారు. ఈ సినిమా సమీక్ష, మీ కోసం-

 

కథ:

రీతు అనే అమ్మయి తన పెళ్లిచూపులకి వారం రోజులు ముందు తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడానికి వెళుతుంది. అక్కడ తను ఆడే ‘ట్రూత్ ఆర్ డేర్’ గేమ్ లో భాగంగా, ఆమె ఆ బార్ లో ఉన్న ఓ జంటని విడకొట్టాలని ఛాలెంజ్ చేస్తారు ఆమె ఫ్రెండ్స్. అలా చేసిన రీతూ మూలంగా ప్లాన్ అప్సెట్ అయ్యిందని, రీతునే తన డేట్‍గా ఉండమని బలవంతం చేస్తాడు ఆదిల్. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ కథ!

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ రీతు వర్మ అనే చెప్పుకోవాలి. తన నటన, గ్లామర్.. కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్ సంగీతం. ముఖ్యంగా ‘ఓ ప్రేమ’ అన్న పాట, సినిమా అయ్యక కూడా మన నాలుక మీద మెదులుతూ ఉంటుంది. 48 గంటల్లో తీసిన ఆ మొత్తం ప్రొడక్షన్ టీంని అభినందించకుండా ఉండలేము. తరుణ్ భాస్కర్‍కి స్పెషల్ మెన్షన్. మంచి స్పాంసర్స్ దొరికినందుకు గాను ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‍గా కనపడతాయి.

 

మైనస్ పాయుంట్స్ :

48 గంటల్లోనే మొత్తం సినిమాను తీసినందుకుగాను, నెగటివ్ పాయింట్స్ ని పెద్దగా లెక్కలోకి తీసుకోలేము. అయినా, సమీక్షిస్తే, కెమెరా వర్క్ ఇంకొంచెం బాగుండవచ్చనిపిస్తుంది. డైలాగ్స్ చాలా ప్లెయిన్‍గా, వీక్‍గా ఉంటాయి. రీతు వర్మ కాకుండ మిగతా అందరూ యావరేజ్‍గా కనిపిస్తారు. సపోర్టింగ్ కాస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బలహీనంగా కనిపిస్తుంది.

 

సాంకేతికంగా :

48 హవర్ ఫిల్మ్ ప్రాజెక్ట్ టీమ్‍కి ఇచ్చిన జాన్రా- రొమాన్స్. క్యారెక్టర్- ఆదిల్ రవిందర్. ప్రాప్- తాళంచెవి, డైలాగ్- ‘AND THAT'S HOW IT ALL STARTED'. రెండు రోజుల్లో ఇవన్నీ ఇన్క్లూడ్ చేసి కథ రాసిన రైటింగ్ డిపార్ట్మెంట్‍ని పొగడకుండా ఉండలేము. కార్తీక్ మ్యూజిక్ ప్లస్ పాయింట్. ఎడిటింగ్ ఓ.కె. కెమెరా వర్క్ ఇంకొంచెం బాగుండొచ్చు.

 

మొత్తంగా :

అనుకున్నంత కాకపోయినా, ‘అనుకోకుండా’ చూడదగ్గ ఓ మంచి చిత్రం.

 

అంకెలలో:

3.25 / 5

 

LINK-
https://www.youtube.com/watch?v=pCbz7QYqflc

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు