కుర్ర'కారు'కు హద్దేది. - ..

no limits for youth

ఆటో మొబైల్‌ రంగంలో అద్భుత ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. 50,000 రూపాయలు ఖరీదు చేసే బైక్‌ పరమ రొటీన్‌. అదే ఐదు లక్షల ఖరీదు చేసే బైక్‌ సూపర్‌ హాట్‌. 10 లక్షల రూపాయల ఖరీదు చేసే కారు పెద్దగా కిక్కివ్వట్లేదు. 20 లక్షలు, ఆ పైన ఖరీదు చేసే హై అండ్‌ కార్లు సూపర్బ్‌ కిక్‌ ఇస్తున్నాయి. ఓ సర్వే ప్రకారం, బైక్స్‌ కావచ్చు, కార్స్‌ కావచ్చు ట్రెండీ కేటగిరికే ఎక్కువ స్పందన లభిస్తుందనీ తెలుస్తోంది. అందుకనే అన్ని కంపెనీలు, స్టైలిష్‌ అప్రోచ్‌ ఉన్న వాహనాలకు మొగ్గు చూపుతున్నాయి. ఖరీదైన వాహనాలే కాదు, వాటిని తలపించేలా అందుబాటు ధరల్లోనూ, వాహన ప్రియులకు లభ్యమవుతున్నాయి. అయితే, ఈ వాహనాలు కుటుంబ అవసరాల కంటే, కుర్రకారును ఎంటర్‌టైన్‌ చేయడానికే ఎక్కువ ఉపయోగపడుతున్నాయట.

టెన్త్‌ క్లాస్‌ కంప్లీట్‌ అయితే చేతిలోకి బైక్‌ వచ్చేయాల్సిందే అనే ఆలోచనతో నేటి యువతరం దూకుడు ప్రదర్శిస్తోంది. లైసెన్సింగ్‌ సమస్యల కారణంగా కొన్నాళ్లు ఆగాల్సి వస్తోంది. దాంతో లైసెన్స్‌ లేకుండానే రోడ్లమీదికి ఎక్కేస్తున్నారు. అది కారైనా, బైకైనా దాని సామర్ధ్యానికి మించిన వేగంతో నడిపేస్తున్నారు. తల్లితండ్రులు పిల్లల్ని అదుపు చేసే పరిస్థితి లేదు. చట్టాల్ని కుర్రకారు పరిగణలోనికి తీసుకోవట్లేదు. దాంతో, ప్రమాదాలు ఎక్కువై, యువతనీ వారి కారణంగా ఇతరుల్నీ బలి తీసుకుంటున్నాయి. పది లక్షల ఖరీదైన బైక్‌ తమ బిడ్డకి కొనిస్తే సమాజంలో తమ స్టేటస్‌ పెంచుకున్నట్లు కొందరు తల్లితండ్రులు భావిస్తున్నారు. ఈ వింత పోకడ సమాజానికి చేటు చేస్తోంది. బాధిత కుటుంబాల ఆవేదన తెలుసుకోగలిగితే, అసలు రోడ్డు ప్రమాదాలే జరగవు. కానీ ఆ ప్రమాదాల్ని కుర్రకారు లెక్క చేయడం లేదు.

క్రికెటర్‌ అజారుద్దీన్‌ కొడుకు కావచ్చు. సినీ నటుడు కోట శ్రీనివాసరావు తనయుడు కావచ్చు ఖరీదైన బైక్స్‌ మీద వెళ్లే ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖరీదైన బైక్‌లు, కార్లు ఇచ్చి వారిని సంతోషపెట్టాలనుకుంటారు, పిల్లలు మాత్రం పట్టలేని ఆనందంతో దూకుడు ప్రదర్శిస్తారు. ఫలితం కుటుంబాల్లో తీవ్రమైన శోకం చోటు చేసుకునే పరిస్థితులు ఎదురవుతాయి. ఏదిఏమైనాసరే, మార్కెట్లోకి బైక్స్‌ రాక తగ్గదు. వాటిపై కుర్రకారు మోజు తగ్గడం లేదు. ఈ విషయంపై తల్లితండ్రుల అదుపు ఉండట్లేదు. కాలేజీల్లో కొత్త తరహా కార్లు, బైక్‌లను తయారు చేసేస్తోంది నేటి యువతరం. కానీ అక్కడ వారికి ప్రమాదాలపై అందాల్సిన స్థాయిలో అవగాహనలతో కూడిన హెచ్చరికలు అందడం లేదు. సమ్మర్‌ వచ్చింది. హాలీడేస్‌ సీజన్‌ తెచ్చిపెట్టింది. సరదా సరదాగా చెలరేగిపోవాలని యూత్‌ అనుకోవడం మామూలే. కానీ, ప్రమాదాలు పొంచి వుంటాయని మాత్రం మర్చిపోవద్దు. సో వాయు వేగంతో దూసుకెళ్లాలనుకునే యంగ్‌స్టర్స్‌ బీ కేర్‌ఫుల్‌.! 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు