స్మార్ట్‌ అండ్‌ హెల్దీ గాడ్జెట్స్‌ గురూ.! - ..

smart and healthy gadgets

ఒకప్పుడు మన నడక, నడత ఎలా ఉండలో పెద్దలు చెప్పేవారు. ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చోకూడదు, ఇలా తింటే మంచిది. ఇలా పడుకోవడం అనర్థాలకు దారి తీస్తుంది అంటూ పెద్దలు వారించడం సూచించడం ఈ తరం వారికి తెలియకపోవచ్చు. పెద్దల మాట చద్ది మూట అనే నానుడి ఉండనే ఉంది. కానీ పెద్దలెవరైనా ఇప్పుడు చెబుదామనుకున్నా వినే పరిస్థితిలో మనం లేం. ఎందుకంటే వి ఆర్‌ టూ.. స్మార్ట్‌. ఏంటి నువ్వు చెప్పేది అని అమ్మమ్మల్ని, తాతయల్ని గదమాయించేస్తున్నాం. ఆ అమ్మమ్మల, తాతయ్యల ప్లేస్‌లోకి స్టార్ట్‌ గ్యాడ్జిట్స్‌ వచ్చేశాయి. వర్క్‌ ప్లేస్‌లో ఎలా కూర్చోవాలో ఓ గ్యాడ్జిట్‌ మీకు సలహా ఇస్తుంది.

మార్నింగ్‌ వాక్‌ ఎంత వేగంతో ఎంత సేపు చేయాలో ఇంకో గ్యాడ్జెట్‌ సూచిస్తుంది. ఖాళీగా కూర్చున్నప్పుడు మీ మెడ ఏ డైరెక్షన్‌లో ఉంటే మంచిదో మీకు తెలియచేస్తుందో గ్యాడ్జెట్‌. చెప్పుకుంటూ పోతే నిద్ర లేచింది మొదలు నిద్రపోయేదాకా, ఆ నిద్రలో కూడా మనల్ని నడిపించడానికి లెక్కలేనన్ని గ్యాడ్జెట్స్‌ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.

ఉదాహరణకు మనకు కీళ్ల నొప్పులున్నాయనుకోండి. ఓ గ్యాడ్జెట్‌ ధరిస్తే చాలు మనం నడిచేటప్పుడు మోకాలిపై ఎంత ఒత్తిడి పడుతుందో కౌంట్‌ చేసి, భరించలేని ఒత్తిడి వస్తుందనీ ముందే గ్రహించి, ఆ గ్యాడ్జెట్‌ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. ఎక్కువ సేపు టీవీ చూస్తున్న అదే గ్యాడ్జెట్‌ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు స్ట్రెయిన్‌ తగ్గించుకోమని సూచించే గ్యాడ్జెట్స్‌ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. డయాబెటిక్‌ పేషెంట్స్‌కి శరీరంలో డయాబెటిక్‌ లెవల్స్‌పై అప్రమత్తం చేయడమే కాదు, హార్ట్‌ పేషెంట్స్‌కి గుండె స్పందనల గురించి ఎప్పటికప్పుడు సమాచారమిచ్చేస్తున్నాయి ఈ నయా గ్యాడ్జెట్స్‌. ఏ అవసరానికి ఏ గ్యాడ్జెట్‌ కావాలో ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తే సరిపోతుంది. కానీ ఉపయోగించేటప్పుడు మాత్రం వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.

దురదృష్టవశాత్తూ, అనారోగ్యం బారిన పడ్డాక ఎక్కువ మందిని వీటిని ఆశ్రయిస్తున్నారు. ఆహ్వానించదగ్గ విషయం ఏంటంటే, యంగ్‌స్టర్స్‌ కూడా వీటిపట్ల ముందే అప్రమత్తమై ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం యంగ్‌స్టర్స్‌కి ముఖ్యంగా అవసరమైన విషయం ఫిట్‌నెస్‌. తమ ఫిట్‌నెస్‌ లెవల్స్‌ ఏ రేంజ్‌లో ఉన్నాయి. ఏం చేస్తే ఫిట్‌నెస్‌ని కరెక్ట్‌గా కాపాడుకోవాలి అనే అంశాలపై పలు గ్యాడ్జెట్స్‌ సూచనలు, సలహాలు ఇచ్చేస్తున్నాయి. మరికొన్ని గ్యాడ్జెట్స్‌ అయితే, జిమ్‌లో మనమెంత సేపు కష్టపడ్డాం. ఎన్ని క్యాలరీస్‌ బర్న్‌ అయ్యాయి, ఇంకా ఎంతసేపు వర్కవుట్స్‌ చేయాలి., తదితర అంశాలపై అవగాహన పెంచడంతో, అప్రమత్తం చేయడంలో కూడా దోహదం చేస్తున్నాఇయ. మరింకేముంది. భవిష్యత్తులో ఈ గ్యాడ్జెట్స్‌ మానవాళికి ఎంత దోహదపడతాయో కదా. అయితే ఏ ఇన్వెన్షన్‌ అయినా సక్రమంగా వాడితేనే, మంచిది. దుర్వినియోగం చేస్తే, వచ్చే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. సో యూత్‌ తస్మాత్‌ జాగ్రత్త.! 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు