పండ్ల ఆహారం - ...

pandla aaharam teesukovadam valla labhalu

పండ్ల ఆహారం

అతితేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం పండ్లు. జీర్ణమవ్వడం అంటే -జఠరాగ్ని బాగా ఉండడం. ఈ మంటలు బాగా మండాడానికి పండ్లు సహకరిస్తాయి. దురదృష్టవశాత్తూ చాలా మంది బద్దకాన్ని ఆస్వాదిస్తారు. జీవితం వారిని తాకలేదు గనకే వారు తమలో కొంత భాగం నిస్సత్తువగా ఉంచడాన్ని ఆస్వాదిస్తారు. నిద్ర, మత్తులో ఉండడం, ఊరకే పడుకుని ఉండడం లాంటివి వారికి ఉత్సాహంగా ఉండడం, చైతన్యవంతంగా జీవించడం కన్నా బాగుంటుంది. మరి పండ్లు వారికి నచ్చవేమో ఎందుకంటే అవి వారిని ఉత్సాహంగా, మెలకువగా ఉంచుతాయి. అవి పులిస్తే తప్ప మిమ్మల్ని మత్తుగా ఉంచవు. కాని ఎరుక అత్యన్నత స్థాయిలో ఉన్నా కూడా పరమానందం, మత్తు, ఘాటైన సుఖాలను మనం అనుభవించవచ్చు. ప్రస్తుతం మీ ప్రశ్న ఏమిటంటే, నేను పండ్లుతిని కూడా మామూలుగా ఉండవచ్చా అని.

ప్రకృతి సలహా కూడా ఫలాహారమే

మీరు జీవితంలో చేస్తున్న మామూలు విషయాలను గమనిస్తే కూడా దీనికి సమాధానం దొరుకుతుంది. మీరు హాస్పటల్లో ఉంటే మిమ్మల్ని చూడ్డానికి వచ్చేవారెవరూ చికెన్ బిర్యానీ తీసుకురారు. వాళ్ళు పళ్ళు తీసుకు వస్తారు “ఎందుకంటే పనికిరానివి తిన్నందుకే మీకు ఆరోగ్య చెడింది, ఇప్పుడైనా సజావుగా ఆహారం తీసుకో”మని. మీకు తెలుసు ఆడమ్ కూడా పండ్లతోటే మొదలెట్టాడని. ప్రకృతికూడా ఆహారంగా పండ్లనే అందించింది. మామిడి పండ్లలో టెంకే మఖ్యం కాని జంతువులనూ, పక్షులనూ ఆకర్షించి తమ విత్తనాలను దూరంగా తీసుకు వెళ్లటానికి గుజ్జు ఒక ఆకర్షణ.

ఋతువులను బట్టి ఎన్నోరకాల పళ్ళు లభిస్తాయి. ఆయా సమయాల్లో, ఆప్రాంతాల్లో లభించే పళ్ళు శరీరానికి ఎంతో మేలైనవి. దీనిగురించి చాలా పరిశోధనలు జరిగాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, లేక ఎండగా ఉన్నప్పుడు, తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఆ వాతావరణానికి అనుకూలమైన పళ్ళు మీరు తినడానికి అక్కడ భూమి ఉత్పత్తి చేస్తుంది. కాని మీరిప్పుడు ఎక్కడో న్యూజిలాండు నుంచి వచ్చే పళ్లు తింటున్నారు. అది మరో వ్యవహారం. మీరు మీ చుట్టూ పండే పండ్లు తినాలనుంటే,  సరైన సమయానికి సరైన రకం పళ్ళు రావడం మీరు గమనిస్తారు. వాటిని ఆయా సమయాల్లో తినడం ఉత్తమం.

ఫలాహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

పళ్ళు మీ శరీరానికి అద్భుతమైనవి. మీ జీవనరీతి ఏదైనా మీరు ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండవచ్చు. కాని మీ జీవితం శారీరకంగా శ్రమతో కూడుకున్నదైతే ఉదాహరణకు మీరు ఏదో తవ్వకాలు లాంటి కఠినమైనపని  చేస్తున్నట్టయితే అప్పుడు మీకు ప్రతి రెండు గంటలకూ ఆకలి వేయవచ్చు. మీరు తినేదానికి పరిమితి ఉంటుంది, మీరు ఇన్ని పళ్ళే తినగలరు, కాని అవి త్వరగా అరిగిపోతాయి, అందువల్ల మీ కడుపు త్వరగా ఖాళీ అయిపోతుంది. మీరు ఫలాహారానికి బద్ధులైతే మీరు భోజనానికి ఎక్కువ సమయం వెచ్చించాలి, ఎందుకంటే కావలసినన్ని పళ్ళు తినడానికి మీకు మరి కాస్త ఎక్కువ సమయం కావాలి.

అవి తియ్యగా ఉండడం వల్ల మీరు త్వరగా తృప్తి చెందుతారు, అందువల్ల మీరు మెల్లగా తినాలి. మనలో ఒక బయో క్లాక్ ఉంటుంది. ఉదాహరణకు మనం మామూలు భోజనం చేయడానికి పది పన్నెండు నిముషాలు తీసుకుంటామనుకుంటే, ఫలాహారంతో కూడా పది పన్నెండు నిముషాలు తరువాత మీ శరీరం ఇకచాలు లే లే అంటుంది. అందుకే మీరు స్పృహతో ఎక్కువ తినాలి. ఎందువల్లనంటే శరీరం కడుపు నిండిందా అని కాకుండా, టైం అవ్వడం వలన మిమ్మల్ని తినడం చాలించమంటుంది.

మీరు మీ మానసిక శక్తిని ఉపయోగించే వారైనా, శారీరక శ్రమ చేసేవారైనా, పండ్లు మంచిదే.

మీది శారీరిక శ్రమ ఐతే మీరు మూడు సార్లు భోజనం చేయాలి. మీరు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయినా మీరు తినేది ఫలాహారమైనా మూడుసార్లు చాలు. కాని రెండు గంటల్లో కడుపు ఖాళీ అవుతుంది, మీరు ఖాళీ కడుపుతో, సత్తువగా ఉండడానికి అలవాటు పడాలి. అటువంటి సమయంలోనే మీ బుర్ర అత్యుత్తమంగా పనిచేస్తుంది, మనిషి అత్యుత్తమంగా పనిచేస్తాడు.

మీరు మీ మానసిక శక్తిని ఉపయోగించే వారైనా, శారీరక శ్రమ చేసేవారైనా, పండ్లు మంచిదే. కాని ఈనాడు మార్కెట్ లో లభించే పళ్ళనిండా ఏమున్నదో తెలియదు. అది సమస్యే. మా చిన్నప్పుడు తిన్న దేశవాళీ పళ్ళరకాలు ఇప్పుడు లభించటం లేదు, పళ్ళతోటల్లో పండించే పళ్ళు ఆ రకంగా ఉండవు. అవి మరింత పెద్దవిగా, గుండ్రంగా, చూడ్డానికి అందంగా ఉంటాయి, అంతే. వాటిలో ఆ రుచి, బలం ఉండవు అది నేను గమనించాను. ఈ పళ్ళు మార్కెట్ కోసం పండించినవి, మనిషి కోసం కాదు. అవి పూర్తిగా వ్యర్ధం అనట్లేదు కాని వాటిలో అంత బలం ఉండదు, అందువల్ల మనం మరో ఆహారంతో మన ఆహారాన్ని పుష్ఠి చేసుకోవాలి.

ఫలాహారం మన భూమికి కూడా మంచిది

అన్నింటికీ మించి పర్యావరణ పరంగా అది చాలా మంచిది. అందరూ తమ భోజనంలో30 శాతం అయినా ఫలాహారం తీసుకోవాలి, అంటే మీ ఆహారంలో 30 శాతం పళ్ళు ఉండాలి. 30 శాతం ఆహారం దున్నిన భూమినుంచి కాక చెట్లనుంచి వస్తే, పర్యావరణ పరంగా అది ఎంతో మేలైంది. అది ప్రపంచానికి ఎంతో మేలుచేస్తుంది.

మీరు మాంసాహారం లాంటి వాటినుంచి ఫలాహారానికి మారితే మీకు తిన్నట్లే అనిపించదు. మీరు ఆహారం భూమి ఆకర్షించేదిగా ఉంది. మీరేలాగో చనిపోయే సమయంలో భూమిలో కలిసిపోవాల్సిందే. కాని ఇప్పుడు పుట్టగానే జీవం అటాం, అదేదో అసలు మీరు ఈ భూమికి సంబంధించిన వారు కానట్టు. పైకి ఎగరే పక్షి కూడా భూమిమీద పుట్టిందే, కాని అంత ఎత్తుడా ఎగరడం వల్ల అది ఈ భూమికి సంబంధించిందే అని అనిపించదు. అందువల్ల మీరు చురుగ్గా ఎగరాలంటే మీరు తీసుకునే ఇంధనం త్వరగా మండేదై ఉండాలి. అదే ఉత్తమమైన ఆహారం. మన పొట్టలో పండు త్వరగా కరిగిపోతుంది. అంటే దాని మూలంగా అతి తక్కువ వ్యర్ధం వస్తుంది, శరీరం అతి తక్కువ ఒత్తిడికి లోనవుతుంది.

 

(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో...)

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు