'వర్క్‌ ఎట్‌ హోమ్‌' జై కొడుతోన్న మహిళా లోకమ్.! - ..

work at home

'ఆడపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా' కాదేదీ కవితకనర్హం' అన్న రీతిగా 'వర్క్‌ ఎట్‌ హోమ్‌' కాదేదీ జాబ్‌కనర్హం అన్నట్లుగా మారిపోయింది. మహిళల విషయంలో ఉద్యోగం చేయాలంటే ఖచ్చితంగా బయటికి వెళ్లాలి. బయటికి వెళితే, వర్కింగ్‌ ప్లేసెస్‌లో రకరకాల ఒడుదుడుకులు ఎదుర్కోవాలి. అందులో కొన్ని అడ్జస్ట్‌ చేసుకునేవి ఉంటాయి. మరికొన్ని అడ్జస్ట్‌ చేసుకోలేనివి ఉంటాయి. ఇలా రకరకాల తలనొప్పులతో మహిళలు తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి.

అయితే ఇప్పుడా పరిస్థితికి తెర పడిందనే చెప్పాలి. 'వర్క్‌ ఎట్‌ హోమ్‌' అనే పద్ధతి, చాలా మంది మహిళల నెత్తి మీద పాలు పోసినట్లయింది. సాఫ్ట్‌వేర్‌ రంగం నుండి మరే ఇతర రంగమైనా సరే ఇంటి వద్ద నుండే మహిళలు సమర్ధవంతంగా నెరవేరుస్తున్నారు ఇప్పుడు. దీని కారణంగా ముఖ్యంగా మహిళలు సేప్‌ అవుతున్న ఇష్యూస్‌లో వర్కింగ్‌ ప్లేస్‌ వద్ద లైంగిక వేధింపుల బారి నుండి తప్పించుకునే అవకాశం కలుగుతోంది. అలాగే ఇంటి నుండి ఆఫీస్‌కి వెళ్లే టైమ్‌ సేవ్‌ అవుతోంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల బెనిఫిట్స్‌ ఈ వర్క్‌ ఎట్‌ హోమ్‌ ద్వారా యుటిలైజ్‌ అవుతున్నాయి.

సాఫ్టవేర్‌ ఫీల్డ్‌లో ఉద్యోగాలు తగ్గిపోవడంతో ఈ తరహా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. కేవలం మహిళలే కాదు, రీసెంట్‌గా స్టడీస్‌ కంప్లీట్‌ చేసి, బయట ఉద్యోగాలు దొరక్క బాధపడుతున్న నిరుద్యోగ యువత కూడా ఈ తరహా మార్గాలను ఎక్కువగా అన్వేషిస్తోంది. ఇంటి వద్దనే ఉద్యోగం చేసుకొనే అవకాశం కలగడంతో, ఫస్ట్‌ ఎక్కువ టైం సేవ్‌ అవుతోంది. ఆ సేవ్‌ అయిన టైమ్‌ని యూత్‌ మరో క్రియేటివ్‌ థాట్‌పై పెట్టేందుకు ఉపయోగపడుతోంది. ఇదేదో కేవలం బిజినెస్‌ పర్సప్‌ పరంగానే కాకుండా, లెర్నింగ్‌ పర్పస్‌కి కూడా యూజ్‌ అవుతోంది.

కొన్ని కొన్ని టెక్నికల్‌ కోర్సెస్‌ కూడా ఇంటి వద్ద నుండే నేర్చుకోవడం జరుగుతోంది. ఇంటి వద్ద ల్యాప్‌ ట్యాప్‌ ముందు కూర్చొని, స్కైప్‌ ద్వారా మన దేశంలోనే కాదు, వివిధ దేశాల విద్యార్థులకు క్లాసెస్‌ కూడా చెప్పేస్తున్నారంటే, ఈ వర్క్‌ ఎట్‌ హోమ్‌ విధానం ఎంతగా ఉపయోగంలోకి వచ్చేసిందో అర్ధం చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఉపయోగం. ఒకేసారి దేశ దేశాల విద్యార్ధులకు విద్యనందించే అవకాశం. అలాగే బిజినెస్‌ అయినా, ఇప్పుడంతా ఆన్‌లైనే. బయ్యింగ్‌ అయినా, సెల్లింగ్‌ అయినా షాపింగ్‌ అంతా ఇంటి వద్ద నుండే. కొంచెం క్రియేటివ్‌గా ఆలోచిస్తే సరిపోతుంది. ఇంటి వద్ద కూర్చొనే అద్భుతాలు సృష్టించొచ్చు. లక్షల్లో, కోట్లలో ఆదాయం కూడా పొందొచ్చు. మనతో పాటు, పది మందికి ఉపాధిని అందించొచ్చు. అందుకే ఒక్క మహిళా లోకానికే పరిమితం కాదీ వర్క్‌ ఎట్‌ హోమ్‌. ఇప్పుడు యూత్‌ కూడా దీనికే జై కొడుతున్నారు. 
మొదట్లో మహిళల వరకే అన్నట్లుగా మొదలైన ఈ వర్క్‌ ఎట్‌ హోమ్‌ పద్ధతి ఇప్పుడు మగవారినీ ముఖ్యంగా యూత్‌ని ఎట్రాక్ట్‌ చేస్తోంది. ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఎదుర్కొని, టైమ్‌ వేస్ట్‌ చేసుకొని, ఆఫీసులకు పోయి, ఒళ్లంతా హూనం చేసుకొని ఉద్యోగం చేసేందుకు ఎవ్వరూ ఇష్టపడడం లేదిప్పుడు. అందుకే ఛాన్స్‌ దొరకాలే కానీ, వర్క్‌ ఎట్‌ హోమ్‌ ఈజ్‌ ద బెస్ట్‌ జాబ్‌. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు