వీకెండ్స్‌లో యూత్‌ నయా ట్రెండ్‌.! - ..

youth new trend in weekends

నగరంలో కుర్రకారుకు వీకెండ్‌ వస్తోందంటే చాలు పండగే పండగ. వీకెండ్‌లో పబ్‌కి వెళ్లాలా? పార్టీకి వెళ్లాలా? ఎలా ఎంజాయ్‌ చేయాలి అంటూ ముందు నుండే ప్లాన్‌ చేసేసుకుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. వీకెండ్‌ ఎంజాయ్‌మెంట్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. డిఫరెంట్‌గా ఆలోచిస్తోంది యువత. ఎప్పుడూ పబ్బుల్లోనో, పార్టీల్లోనో ఎంజాయ్‌ చేస్తే ఏముంటుంది కొంచెం కొత్తగా ఆలోచిస్తేనే కదా అసలు కిక్కు అని భావిస్తున్నారు. అందులో భాగంగానే, పరుగులు తీసే తమ మెదడుకు పదును పెడుతున్నారు. పల్లెల వైపు తన మనసును మళ్లిస్తున్నారు. కొందరు ఆహ్లాదం కోసం పల్లెటూళ్లను పలకరిస్తుంటే, మరికొందరు ఆ పల్లెటూళ్లకు తమ వంతు ఏదో చేయాలనే కొత్త ఆలోచనలు చేస్తున్నారు. 
అందులో భాగంగానే వారం మొత్తం చదువులు, ఉద్యోగాలు అంటూ బిజీ లైఫ్‌లో తలమునకలవుతున్న యువత, వారాంతంలో పల్లెటూళ్లకు పరుగులు పెడుతున్నారు. అక్కడి ఆహ్లాదమైన వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు కొంతమంది. మరికొంతమంది కొన్ని గ్రూపులుగా ఏర్పడి, పల్లెటూరి పిల్లలకు చదువులు చెప్పడం, కంప్యూటర్‌ మీద బేసిక్స్‌ నేర్పించడం ద్వారా, వారికి దానిపై కాస్త అవగాహన కల్గించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాదు, వంటా వార్పు కూడా చేస్తున్నారు తెలుసా?

తమ కోసం ఎప్పుడూ వంట చేసుకోని యువత వీకెండ్స్‌లో పల్లెల్లో సరదాగా వంటా వార్పూ చేస్తున్నారు. తమ కోసమే కాదండోయ్‌. సరదాగా స్నేహితులతో కలిసి చేసే వంటా వార్పుతో తమ మెదడుకు రీఫ్రెష్‌మెంట్‌ వస్తుందని భావిస్తున్నారు. దాంతో పాటు పల్లెటూళ్లకు పట్నం రుచులు పరిచయం చేసే అవకాశం కూడా కలుగుతోంది. అలాగే పల్లెటూళ్లలో చిన్న చిన్న చేయూత కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. తాము పుట్టి, పెరిగిన ఊరికి తమ వంతు ఏదో చిన్న సాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. తాము చదువుకున్న బడికి కనీస సదుపాయాలు కల్పించడానికి చేయి చేయి కలుపుతున్నారు.

ఊరిలోని పేద ప్రజలకు మెడికల్‌ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైతే ఉచితంగా కొన్ని వైద్య సేవలు కూడా చేయిస్తున్నారు. చదువుకోలేని పేద విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు, వారి ఉన్నత చదువులకు చిరు సాయంతో పాటు, తగిన తర్ఫీదునిందిస్తున్నారు. ఈ రకంగా ఒక్కటేమిటి, విద్య, వైద్యంలో సహాయ సదుపాయాలే కాదు, ఆటా పాటా, ఆహ్లాదం, ఆనందం అన్నింటినీ పల్లెటూరి ప్రజలతో పంచుకుంటున్నారు. తమ క్రియేటివిటీని చాటుకుంటున్నారు. యువత తలిస్తే ఏదైనా సాధించగలదు అంతే. యువతలో వచ్చిన ఈ కొత్తరకం ఆలోచన పట్టణాలతో పాటు, పల్లెల్లోనూ ఎంతో కొంత అభివృద్ది కనబరిచేందుకు తోడ్పడుతుంది. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు