జోకులు - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

ఒక శాల్తీ:  ఏమిటీ, నీ మిత్రుడొకడు బల్లి పడి , చచ్చాడా? శిరస్సు ఉచ్చి మీద పడి వుంటుంది పాపం!
మరోశాల్తీ: మొత్తం శరీరం మీద పడింది!
ఒక శాల్తీ: అర్ధం కాలేదే?
మరోశాల్తీ: పడింది రాక్షస బల్లి, నలిగి పచ్చడైపోయాడు!!

 

ఒక పండితోత్తముడు మరో పండితోత్తముడితో: మిత్రమా, మనము సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు అభ్యసించడానికి వచ్చాము కదా.. .. మన గురువు గారు, పలకా బలపం తీసుకువచ్చారా అని అడుగుతున్నారే?
మరో పండితోత్తముడు: మనం ముందుగా ఓనమాలు నేర్చుకోవాలంటున్నారులే!!

 

 

 

ఒక ప్రయాణికుడు: మిత్రమా, మనం వెళ్ళేది ఏ నగరానికీ?
రెండో ప్రయాణికుడు: సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణగా చెప్పుకుంటారే, ద్వారక అను పేరు గల నగరానికి!
ఒక ప్రయాణికుడు: ఓహో... అక్కడ ఎవర్ని కలవడానికి వెళుతున్నట్ట్లు?
రెండో ప్రయాణికుడు: విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణగా చెప్పుకుంటామే, చిన్నదైన నవ్వు, అనగా చిరునవ్వు కలవాడు, పురుషోత్తముడు, ఆయన్ని కలవడానికి వెళ్తున్నాం! ఇంకా వేరేదైనా అడగాలంటే.. అడుగూ?
ఒక ప్రయాణికుడు: ఒద్దు.. నువ్వు వ్యాకరణ పండితుడివని అర్ధమైపోయిందిలే!


కిన్నెరుడు: మహేంద్రుల వారు, తమ వజ్రాయుధానికి తైల మర్ధనం చేయిస్తున్నారే?
కింపురుషుడు: వెన్నెముక వైకల్యం రాకుండా వుండటానికి
కిన్నెరుడు: వజ్రాయుధానికి వెన్నెముక వైకల్యమా?
కింపురుషుడు: వజ్రాయుధం, దధీచి మహర్షి వెన్నెముకతో రూపొందించిందని నీవెరుగవా?


శాస్త్రి: నీ భార్య, గరుడ ముక్కు  ఔషధం మొక్క విత్తనాల నుంచి తీసిన నూనెను నీ తెల్లజుట్టుకు వాడిందటగా?
రెడ్డి: ఔను, ఆ నూనె వాడి, నా జుట్టు నల్లబడింది.
శాస్త్రి: మరింకేం! అదృష్టవంతుడివి.
రెడ్డి: ఏం అదృష్టవంతుడినిలే... నా చేత విపరీతంగా, తన విలాసాలకీ, వినోదాలకీ, విందులకీ  బోల్డు డబ్బు ఖర్చు చేయిస్తున్నది!
శాస్త్రి: ఎందుకూ... అంత డబ్బు ఇవ్వలేనని ఖచ్చితంగా చెప్పక పోయావా?
రెడ్డి: కుదర్దు! గరుడముక్కు ఔషదం మొక్కకి వశీకరణ శక్తి వుందని ఒక గిరిజన మిత్రుడు నాతో చెప్పాడు!


సేనాధిపతి: మన సైనికులు ఆరోగ్యంగా వుండాలని , క్రిమి సం హారిక దుస్తులు యిచ్చాము ప్రభూ! అవి చాలవట!
మహారాజు: మరింకేం కావాలటా?
సేనాధిపతి: శతృ సం హారిక దుస్తులు కావాలట!!

 

 

రాజు: మహాకవీ... మీ కవిత్వం లో అస్పష్టత, పాండిత్య లోపం కనిపిస్తున్నవి. మీ రూపం ఘోరంగా వున్నది!!
మహాకవి: రాజా.. మీరు నా కోసం ఏర్పాటు చేసిన విడిదిలో నీళ్ళు లేవు. అందుచేత నేను నా కాలకృత్యములు నెరవేర్చుకోలేదు. నేను ధరించిన ఈ బట్టలు, మాసిన బట్టలు. ఇవి పూర్వం మీరు నాకు దానంగా ఇచ్చినవే...! పైగా ప్రాత: కాల భోజనం నేనింకా చేయనందున, నా నోరెండిపోయి, కళ్ళు గుంతలు పడ్డాయి. కడుపు వెన్నంటి...
రాజు: ఆపు... ఆపు... చాలు చాలు అర్ధమైంది!
   

శ్రీకృష్ణుడు: కుచేలా, నా కన్ని వేల మంది భార్యామణులున్ననూ సంతాన భాగ్యము కలుగలేదు! నీకో , ఒకే ఒక భార్యామణి ! అంతమంది సంతానము ఎట్లు కలిగెను?
కుచేలుడు: కృష్ణా , నీ కడుపునిండి, రేయింబగళ్ళు ఆటపాటలతోనే గడిపితివాయె! సంతానము కలుగునెట్లు?

 

 


చెలికాడు: రాణిగారు, శోకాగృహం లో వున్నారా?
రాజు: ఔను!
చెలికాడు: రాణిగారిని కలిసొచ్చారా?
రాజు: నా నెత్తి చూస్తే తెలియలేదా? ఆమె తన్నిన తన్నుకి
ఎంత పెద్ద గాయమో చూడు... హు!

 


కొత్తగా పెళ్ళైన రాణి తో రాజు: రాణి తమరు శోభనానికి సుముఖంగా లేరా? కారణం?
రాణి: నేను అరణంగా తెచ్చిన, నా తమ్మునికి మంత్రి పదవి ఇస్తేనే, నేను శోభనానికి ఒప్పుకుంటాను రాజా
రాజు: ఐతే, యిప్పటి మంత్రిని నేనేం చేయను?
రాణి: అతడ్ని, అతడి అక్కగారికి అరణం గా వెళ్ళిపొమ్మనండి రాజా!! 

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు