నవ్వుల జల్లు - జయదేవ్

వంగ వర్మ: పాపి చిరాయువంటారు గదా?
చెంగ శర్మ: పాప పుణ్య ప్రస్తావన ఇప్పుడెందుకూ?
వంగ వర్మ: నీకు తొంభై ఐదేళ్ళు నిండాయి గదా... అందుకనడిగా!!
 

కవిపుంగవుడు: మహారాజా, నీవు ధీరుడివి, వీరుడివి, బలశాలివి, అజేయుడివి....
మహారాణి: (కొర కొర చూస్తూ, రాజుగారి చెవి వైపు వంగి) మహారాజా, ఇలాంటి అబద్ధాలు పలికే కవులని పోషించకండి, ఈ కవి నాకు జుగుప్స కలిగిస్తున్నాడు.

కిన్నెరుడు: ఆకాశం లోని తారలేమయ్యాయి? ఒక్కటీ కనిపించడం లేదే?
కింపురుషుడు: ఈ రోజు చంద్రుడి గారింట్లో పూజ! పురోహితులు నక్షత్ర హారతి జరిపిస్తున్నారు.

సూరప్ప రెడ్డి: 'ఏడు కొండల సామి.. ఎక్కడున్నావయ్యా' అంటూ ఘంటసాల వారు పాడుతున్నారే?
వీరప్ప నాయుడు: దళారులు ఆయన్ని మోసగించి వుంటారు...  దేవుడితో మొర పెట్టుకుంటున్నారు పాపం!!!

సంగకారి: సీత మహాసాధ్వి అని తెలిసీ, ఆమెను అగ్నిప్రవేశం చేయించారే రాముల వారు?
డిస్య నాయక: అది వాళ్ళూరు ఆచారం!
సంగకారి: సరే గాని, నన్ను మా ఇంట్లో దిగబెట్టు ప్రియతమా, మా ఆయనొచ్చే వేళయింది!!

కాశి బడి గురువు: గంగను భగీరథుడు భూమికెందుకు తెచ్చాడు?
కాశి బడి విద్యార్థి: కలుషితం చెయ్యడానికి, గురువు గారూ!!


యమలోకంలో, పాపి నంబర్ 314: గురూ... నీకో శుభవార్త. ఈరోజు పవర్ కట్! కరెంట్ షాక్ శిక్ష రద్దు చేసారు!!
పాపి నంబర్ 318: యమలోకంలో జనరేటర్లు లేవా?
పాపి నంబర్ 314: ఉన్నాయ్ గానీ, వాటిని నడిపే డీజిల్ని చుక్క మిగల్చకుండా, మందు గొట్టేశారు, యమ కింకర్లు!!


తానా శర్మ: దుర్యోధన చక్రవర్తి, మాటి మాటికి, పాండవుల్ని పాతేస్తాను, దున్నేస్తాను, పొడి చేస్తాను అంటారే?
తందానా శాస్త్రి: దుర్యోధనులు, బలరాముల వారి శిష్యుడు గదా! బలరాముల వారి ఆయుధం నాగలి కదా!! అక్కడ్నుంచి వచ్చాయి, ఆ మాటలు!!!


పార్వతి: కేదరనాథ్ లో వరదల వల్ల అంత మంది మరణించారే?
పరమేశ్వరుడు: వారందరికీ కైవల్యం సిద్ధించిదిలే!
పార్వతి: బాగానే వుంది కానీ, వరదలు తగ్గగానే మళ్ళీ వర్షం కురిపించారే?
పరమేశ్వరుడు: వరద బాధితులకు తగిన సహాయ చర్యలందక, అక్కడి భక్తులు, తిండి నీరు లేక తల్లడిల్లి పోతుంటే , కనీసం వాళ్లకి తాగునీరైనా అందించడానికి వర్షం కురిపించానంతే!!


దుకుటాసురుడు: ఇది వాస్తు దోషాల పుట్ట! ఇదేమి పెళ్లి విడిదండీ బాబూ??
నాసికాసురుడు: ఇది ఘటోత్కచులవారు, కౌరవులకోసం నిర్మించిన పెళ్లి విడిది!! కౌరవులు తన్నులు తినబోతున్నారు.. చూస్తూ వుండు!!!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు