నేర భారతం తప్పు తల్లితండ్రులదేనా - ..

Is crime a wrong parent

దేశంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయ్‌. అత్యంత దారుణంగా పసిపిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి. అన్నా చెల్లెలు, తండ్రీ కూతురు, తల్లీ కూతురు ఇలాంటి బంధాలేమీ ఆయా ఘటనల్లో కనిపించడం లేదు. సమాజమంతా, ఇలాగే ఉందనుకుంటే పొరపాటే. ఓ ఘటన జరగ్గానే, సమాజంలో అలజడి రేగడం, జనం పానిక్‌ అవ్వడం సహజమే. ఇంటి నుండే పిల్లల్ని సంస్కరించడం ప్రారంభం అవ్వాలి అనే మాట పాతదే. తల్లితండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించి తీరాల్సిందే అన్నది పాత విషయమే. తల్లితండ్రులు పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటారా? ఉండగలరా? అనే ప్రశ్నలు ఎవరికి వారు వేసుకుంటే, వాస్తవం అర్ధమవుతుంది. 

నూటికో కోటికో ఒకరిద్దరు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండకపోవడం మామూలే. కానీ అందరూ అలాగే ఉండరు. ఇంట్లో పిల్లలు ఎంత సంస్కారవంతంగా పెరిగినా, బయటికి వెళ్లాక వాళ్లు ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవడం తల్లితండ్రులకు చాలా కష్టం. ఒకప్పుడు పరిస్థితులు వేరు. సమాజంలో జవాబుదారీతనం ఉండేది. పరస్పర అవగాహన ఉండేది. పిల్లలు బయటికి వెళితే, మీ అబ్బాయి అక్కడ కనిపించాడు. ఈ అమ్మాయి ఇక్కడ కనిపించింది అనే కమ్యూనికేషన్‌ అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడది లేదు. విద్యాసంస్థల్లో మార్కులు తప్ప నైతిక విలువల గురించిన బోధన కనిపించడం లేదు. మీడియాలో నేర సంబంధిత సమాచారానికి ఉన్నంత ప్రాముఖ్యత మంచి విషయాలకు ఉండడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలున్నాయి. యువత పెడదోవ పట్టడానికి సవాలక్ష మార్గాలున్నాయి. కొత్త కొత్త మార్గాలు పుట్టుకొస్తున్నాయి. ఆ వైపరీత్యమే ప్రస్తుత పోకడలకు గల కారణం.

రాజకీయ నాయకులు ఎప్పుడూ నీతులే చెబుతూ ఉంటారు. కొడుకుల్ని తల్లితండ్రులు జాగ్రత్తగా పెంచాలని చెప్పడం ఓ ప్యాషన్‌గా మారిపోయింది. ఆడపిల్లలు రోడ్డు మీదికి వస్తే ఏమైనా జరుగుతాయి అనడం అలవాటైపోయింది. ఇక్కడ నేరమూ - శిక్ష ప్రధానాంశాలు. నేరం జరిగితే శిక్ష పడుతుంది అని పాలకులు ప్రజలకు భరోసా ఇవ్వాలి. ఆ భరోసా లేక సమాజం తల్లడిల్లిపోతోంది. నేరస్థులు చెలరేగిపోతున్నారు. నేరానికి శిక్ష పడితే భయం ఉంటుంది. నేరం చేసినా శిక్ష పడకపోతే, సమాజం నుండి కొత్తగా నేరుస్థులు పుట్టకొస్తూనే ఉంటారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు అనే విషయమే కాదు, ఏ నేరంలోనైనా ప్రాధమిక లోపం ఇదే. సమస్యకు కారణం వెతికి, పరిష్కారమార్గం చూపకుండా తల్లిదండ్రులదే తప్పని నిందలేసేయడం ఎంతవరకు సబబు? పిల్లలు చేసిన తప్పులకు తల్లిదండ్రులు నిందలు భరించాల్సి రావడం చాలా చాలా బాధాకరం. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు