బేతాళప్రశ్న - ..

betalaprasna
1) నీట్ పరీక్షలో ఒక్క సెకను కూడా పరిగణనలోకి తీసుకునే కచ్చితమైన సమయపాలన పాటించడం, ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతించకపోవడం, పొడుగు చేతుల చొక్కాలను కత్తిరించడం, మహిళల ఆభరణాలు తొలగించడం...అణువణువు పరీక్షిన తర్వాతే లోపలికి అనుమతించడం అవసరమే....పోటీ పరీక్షలన్నాక ఇంత సీరియస్ ఫీలింగ్ అభ్యర్థుల్లో తీసుకురావడం కోసం, ఎక్కడా ఎలాంటి పొరబాట్లకూ తావివ్వకుండా పరీక్షలను జరిపించడం కోసమే ఇదంతా..ప్రభుత్వం, అధికారుల తీరు సరైనదే..

2) ప్రమాణాలను పాటించడం, పొరబాట్లు జరగకుండా పరీక్షలను నిర్వహించడం ముమ్మాటికీ ప్రభుత్వ బాధ్యతే. కచ్చితమైన నియమాలు ఉండడం మంచిదే. కానీ ఆ పేరుతో ఒక్క సెకను ఆలస్యాన్ని కూడా అనుమతించకుండా అభ్యర్థులను మానసిక ఒత్తిడికి గురిచేయడం, మంగళసూత్రాలతో సహా మహిళల ఆభరణాలను బలవంతాన తీయించడం లాంటి వాటి ద్వారా అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీయడం సమంజసం, సమర్ధనీయం కాదు...

పై రెండింట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు