‘ రామసక్కనోడమ్మ చందమామ ’ షార్ట్ ఫిల్మ్ రివ్యూ - -సాయి సోమయాజులు

ramasakkanodamma chandamama short flim review

రక్ష క్రియేషన్స్ బ్యానర్‍పై, విలేజ్ నేటివిటీలో జరిగే ఓ ప్రేమ కథ- ‘రామసక్కనోడమ్మ చందమామ’. మా సంస్థ, గోతెలుగు, పార్టనర్స్ గా బుల్లితెరపైకెక్కిన ఈ లఘుచిత్రం సమీక్ష... మీ కోసం-

కథ:

పల్లెటూరులో పెళ్ళి చూపుల కోసమని వెళుతున్న ఒకతనికి ఆ పెళ్ళి సంబంధం అమ్మాయికి ఇష్టం లేదని తెలిసి, కారును దారి మధ్యలోనే ఆపి, దిగిపోతాడు. అక్కడే పరిచయమవుతుంది ఓ పల్లేటూరమ్మాయి. మెల్లగా మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉండగా, ఆ అబ్బాయికి ఓ నిజం తెలుస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే, ఈ చిత్రాన్ని చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ సంగీతం. బహుశా ఈ ఏడాదిలో వచ్చిన లఘుచిత్రాలలో బెస్ట్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాదేనేమో! ట్రెడీషనల్‍గా సాగే సంగీతం, సినిమా అయిపోయాక కూడా ఇంకా మన మనసులో మెదులుతూనే ఉంటుంది! కథ పల్లెటూరు నేపధ్యంలో సాగుతుంది కాబట్టి, న్యాచురల్ ఔట్‍లుక్‍ని కెమెరాలో బందించడం కష్టమైన పని. కాని, చక్కటి కెమెరా వర్క్, అద్భుతమైన కలర్ గ్రేడింగ్ తో ప్రతి ఫ్రేమ్ కళ్లకింపుగా, ఫ్రెష్‍గా కనిపిస్తుంది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించిన భావ్య త్రిమూర్తులు చాలా బాగా నటించింది. తన పాత్ర, యాస, ఎక్స్ప్రెషన్స్... అచ్చం ఓ పల్లెటూరు అమ్మాయిలానే ఉంటుంది. అమ్మాయి కలల గురించి, పెళ్ళి గురించి, స్వేచ్ఛ గురించి రాసిన కొన్ని డైలాగులు చాలా బాగుండి మనసుకు హత్తుకుంటాయి. ఓపెనింగ్, ఎండింగ్ చాలా అందంగా డిజైన్ చేశారు.

మైనస్ పాయుంట్స్ :

సినిమాలో, చాలా కంటిన్యుటి మిస్టేక్స్ చోటు చేసుకోవడం వల్ల మాటిమాటికి విజువల్ జెర్క్స్ తెరమీద కనిపిస్తూ ఉంటాయి. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్, సీన్లని బట్టి ఒక్కసారిగా మారుతూ ఉండడంతో సీక్వెన్స్ ఫాలో అవుతున్న ప్రేక్షకులకు అయోమయం కలుగుతుంది. హీరో పాత్ర పోషించిన రవితేజ నటన అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పుకోవాలి. అలాగే, అబ్బాయి-అమ్మాయి మొట్ట మొదటి సారి కలుసుకునే సీన్ ర్యాండమ్‍గా, అన్నాచురల్‍గా అనిపిస్తుంది. వాళ్లిద్దరూ మొదటి పరిచయంలోనే అన్నన్ని విషయాలు మాట్లాడేసుకోవడం అదీ ఓ పల్లెటూరిలో నిజంగా విచిత్రమే, రియల్ లైఫ్ లో దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి.

సాంకేతికంగా :

ఎడిటింగ్ నిరాశ పరుస్తుంది. ముఖ్యంగా ఆడియోతో! మాటి-మాటికీ వెంట-వెంటనే మారే బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుణ్ని ఇరిటేట్ చేస్తుంది. కెమెరా వర్క్ చాలా అద్భుతంగా ఉంది. కలర్ గ్రేడింగ్ ప్రొఫెషనల్‍గా కనువిందు చేస్తుంది. డబ్బింగ్ పర్ఫెక్ట్.

మొత్తంగా :

రామచక్కని సినిమా... ఓపాలి సూసేయండి మరి!అంకెలలో:

3.25/5

LINK-

https://www.youtube.com/watch?v=rWA3Kmpegjk&feature=youtu.be

మరిన్ని వ్యాసాలు