ప్లాస్టిక్ రాక్షసుడు - డా. ఎస్. జయదేవ్ బాబు

చైనాలో జనం మరీ ఎక్కువ తిని బలిసిపోతున్నారని, అక్కడి శాస్త్రజ్ఞులు ప్లాస్టిక్ బియ్యం కనిపెట్టారట. ఆ బియ్యంలో పిండి పదార్థం సగానికి సగం బాగా తగ్గి వుండి, దాన్ని తినే వాడికి, ఆ మేరకే రక్తంలో ప్రవేశిస్తుందని పరిశోధనలు చేసి తెల్సుకున్నారు.. బియ్యంతో కలిపిన ప్లాస్టిక్, అన్నవాహికలో ఏ మార్పులూ చెందకుండా వెలికి వచ్చేస్తుందని , దాని వల్ల శరీరానికి ఏమాత్రం హాని వుండదని తేల్చి చెప్పారు. ఇంత వరకూ బాగుంది గానీ, శరీరం నుంచి బహిష్కరించ బడిన ప్లాస్టిక్ పర్యావరణాన్ని ప్లాస్టిక్ మయం చేయదా అని అడిగితే, ఇప్పటి వరకూ భూమి మీద కొన్ని మిలియన్ టన్నుల (సముద్రాలలో మాత్రం దాదాపు ఎనిమిది మిలియన్ టన్నుల ప్లాస్టిక్) ప్లాస్టిక్ పేరుకు పోలేదా....ఏం పాపం అని చైనా శాస్త్రజ్ఞులు తప్పుకున్నారట.

చైనా ప్లాస్టిక్ బియ్యం, ఇతర దేశాలకి ఎగుమతి కాబడింది. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల వాళ్ళు ఈ బియ్యం తిన్నారు. న్యూస్ పేపర్లూ, టీవీ, ప్లాస్టిక్ బియ్యం గురించిన కథలు, కాలం లూ ఎపిసోడ్లుగా వివరించి చెప్పాయి. జనాన్ని భయ పెట్టి, తమ వంతు సాయం చేసి, ప్లాస్టిక్ రాక్షసుడి భయానక దృశ్యాన్ని తెర ముందు కదిలించి చూపించాయి.

ప్లాస్టిక్ మనం వాడే సెల్ ఫోనులో కూడా వుంది. ఈ వ్యాసం రాస్తున్న నా పెన్నులో వుంది. అది ఎక్కడ లేదు గనక? ప్లాస్టిక్ ఆవశ్యకత, మానవ వినాశనానికి దారి తీస్తుంది అని శాస్త్రజ్ఞులు చెబుతూనే ఉన్నారు. మనం అర్థం చేసుకుంటూనే ఉన్నాం. ఐనా ఏమీ చేయము. చేయ లేని స్థితిలో వున్నామా అంటే ఎంత మాత్రమూ కాదు. మనకి " ఎవేర్ నెస్ " ఇంకా రాలేదు. అందుకే కార్టూనిస్టులు నడుం కట్టి ఈ కార్టూనులు గీశారు. " సందేశం " అంది, మన వంతు కృషి చేసి ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుందాం. మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. మన భూమిని మనమే రక్షించుకోవాలి. ఇంకొక్క సారి శ్రీమన్నారాయణుడు వరాహావతారమెత్తి వస్తాడని ఆశ పెట్టుకుంటే అది వమ్మే ఔతుంది.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి