పొగ-మందు - దొందూ దొందే ! - - డా. ఎస్. జయదేవ్ బాబు

పొగ ఊపిరితిత్తుల్ని పిండి పిప్పి చేస్తే , మందు కాలేయాన్ని కాల్చి మసి చేస్తుంది. పొగాకు పొగలో , నికోటిన్ తో పాటు, దాదాపు నాలుగు వందల రసాయన పదార్థాలున్నాయట. అన్నీ హానికరమైనవే. క్యాన్సర్ కు దోహదం చేస్తాయని శాస్త్రజ్ఞులు నొక్కి చెప్పేశారు. పొగ ప్రాణానికే ముప్పు.

మందు తక్కువ తిన్నది కాదు. తక్కువ మోతాదుల్లో ప్రమాదకరం కాదంటారు కానీ, మెదడు కణాలు తీవ్రంగా దెబ్బ తింటాయట. మితిమీరి తాగితే, కాలేయం చెడిపోతుంది. " లివర్ సిర్రోసిస్ " కు దారి తీసి , దానితో పాటు, గుండె, మూత్రపిండాలు కూడా నశిస్తాయి.
పొగ త్రాగరాదు, మద్యం సేవించరాదు - అని ఎంత చెప్పినా జనం వినరు. కార్టూన్ల ద్వారా చెబుదామని, మన కార్టూనిస్టులు ఈ ప్రయత్నం చేసి ఇంత చక్కటి కార్టూన్లు సృష్టించారు. ఈ కార్టూన్లు చూస్తే, సందేశం సులభగ్రాహ్యం అవుతుందనే నమ్మకం కలుగుతోంది.
పొగలో ఉత్సాహం లేదు. మందులో ఆనందం లేదు. రెండూ మెడకు ఉచ్చు బిగిస్తాయి. !

 

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం