యూత్‌ ఎందుకు చెడిపోతుంది? - ..

youth

'మందు కొట్టడం, సిగరెట్లు తాగడం, అమ్మాయిలతో తిరగడం వల్ల యూత్‌ చెడిపోతుంది..' అని 'దిల్‌' సినిమాలో హీరోయిన్‌ చెప్పిన డైలాగ్‌ గుర్తొచ్చి ఉంటుంది. అది రీల్‌ ప్రశ్న. కానీ ఇది రియల్‌ ప్రశ్న. ఇప్పుడు యూత్‌ ఎందుకు చెడిపోతోంది అంటే, సినిమాలు, ఇంటర్నెట్‌లు, వెస్ట్రన్‌ కల్చర్‌ అనీ రకరకాల సమాధానాలు చెప్పుకొస్తుంటాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చెడును మనం ఎక్కువగా చూస్తున్నామంతే. అయితే 'యువత అంతా చెడిపోతుంది' అనడం తప్పు. దేశం దాటి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ తమ సత్తా చాటుతున్న యువత గురించి ఆ స్థాయిలో మనం చర్చించుకోవడం లేదు. అమెరికా సహా ఏ దేశానికి వెళ్లినా, టాలెంట్‌ పరంగా చూస్తే, మన భారతీయ యువతలో ఆగ్రస్థానం గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మన దేశంలోనూ ఇదే పరిస్థితి. ఉన్నత విద్యను అభ్యసించేవారి సంఖ్య పెరుగుతోంది. కాంపిటేటివ్‌ పరీక్షల్లో తమ సత్తా చాటుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలోనూ తమ అపారమైన టాలెంట్‌ చూపిస్తున్నారు.

ఎక్కడో చోట ఒక దుర్ఘటన జరగగానే మొత్తం యూత్‌ని అవమానించడం, నిందించడం కరెక్ట్‌ కాదు. ప్రసార మాధ్యమాలు సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాయి. ఆ కారణంగానే వాస్తవాలు మరుగున పడుతున్నాయి. వివాదాలు ఎక్కువ ఫోకస్‌ అవుతున్నాయ్‌. అన్ని రంగాల్లోనూ యువత రాణిస్తోంది. కానీ ఆయా విషయాలపై ఫోకస్‌ కన్నా, చెడు విషయాలపై ఫోకస్‌ ఎక్కువగా జరుగుతోంది. ఓ అమ్మాయి మీద రేప్‌ జరిగిందంటే యూత్‌దే తప్పు. ఇలాంటి ఘటనల్ని పదే పదే ప్రొజెక్ట్‌ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం సున్న. ప్రపంచం గుర్తించేలా యూత్‌ సాధిస్తున్న ఘటనలు చాలా చాలా జరుగుతున్నాయి. వీటిని ఎక్కువగా ప్రోజెక్ట్‌ చేస్తే చాలా మందికి అవి ఆదర్శంగా నిలుస్తాయి. మరిన్ని అద్భుతాలు సాధించి పెట్టేందుకు అంకురార్పణ అవుతాయి.

130 కోట్ల ప్రజలున్న భారతదేశంలో ఒకటీ అరా దురదృష్టకర సంఘటనలు జరిగితే, అలాంటి ఘటన ఇంకోసారి పునరావృతం కాకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవల్సిన బాధ్యత పాలకులదే. అంతే కానీ, ఆ ఘటనను ఆసరాగానూ, సాకుగానూ తీసుకుని మొత్తం యువతను తప్పు పట్టడం సబబు కాదు. ఒక విజయ గాధ వంద మందికి కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఒక వివాదం చాలా మందిని బాధపెడుతుంది. నైరాస్యంలోకి నెట్టేస్తుంది. తప్పు చేయకుండా తప్పుపడుతున్న యూత్‌ని మరిన్ని తప్పులు చేసేందుకు ప్రోత్సహించినట్లవుతుందిది. సో సమాజంలో యువత తప్పు దారి పడుతుందనడానికి పరోక్షంగా ప్రసార మాధ్యమాలు పోషించే పాత్ర ఎక్కువే అని చెప్పక తప్పడం లేదు. అందుకే ఈ విషయాన్ని గమనించి, యువత ఆదర్శంగా తీసుకునే అంశాలపై మన ప్రసార మాధ్యమాలు కాస్త ఎక్కువ దృష్టి పెట్టి అనవసర విషయాలను పక్కన పెడితే మంచిది.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి