25-5-2018 నుండి 31-5-2018 వారఫలాలు` - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు సమయం ఇస్తారు అలాగే వారితో కలిసి కొత్త కొత్త పనులను ఆరంభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ శక్తిని మనసులో పెట్టుకొని వాటికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయండి లేకపోతే పనిభారం తప్పకపోవచ్చును. కుటుంభంలో తండ్రిసంభందమైన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు ఆలాగే వారి తరుపు బంధువులతో కలిసి సమయాన్ని గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిమూలన లబ్దిని పొందుతారు. స్త్రీ సంభందమైన విషయాల్లో మార్పులకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో బాగుంటుంది నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. మిత్రుల ద్వార సమాచారం తెలుసుకొనే అవకాశం కలదు.     

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద నూతన చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు. తలపెట్టిన పనులను ఒక క్రమపద్దతిలో పూర్తిచేసే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట మూలన అనుకున్న సమయానికి పనులను పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. బంధుమిత్రులతో చేపట్టిన పనులలో అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం కలదు ఈ విషయంలో కొంత నిరాశను పొందుతారు. మాటలు పొదుపుగా వాడుట సూచన ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం సూచన. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును దూరప్రదేశం నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం కలదు. కుటుంభంలో మీయొక్క ఆలోచనలను వ్యతిరేకించే అవకాశం కలదు కావున బాగాఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. 

 

 



మిథున రాశి : ఈవారం మొత్తంమీద చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు. మిత్రుల సహాకారంతో చాలావరకు పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన నిర్ణయాల విషయంలో మాత్రం నిదానం అసవరం అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. అధికారుల నుండి చక్కటి గుర్తింపును పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి తల్లితరుపు బంధువుల నుండి సంతోషించే వార్తను వింటారు, బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కలదు. దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. ఇష్టమైన పనులకు సమయం కేటాయిస్తారు నచ్చిన వారినుండి ప్రశంశలు పొందుతారు. వారం చివరలో మాత్రం కొంత ఒత్తిడి పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త.  

 

 

కర్కాటక రాశి :ఈవారం మొత్తంమీద మీయొక్క మాటతీరు మూలాన నష్టపోయే అవకాశం ఉంది కావున తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నూతన ఆలోచనలను కలిగి ఉంటారు వాటికి సరైన సమయం ఇవ్వడం ద్వార ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో లేక వృత్తిప్రదేశంలో సమయపాలన అవసరం అలాగే నలుగురీని కలుపుకొని వెళ్ళుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో చేసిన ప్రయత్నాలు మిశ్రమఫలితాలను కలుగజేస్తాయి. చేపట్టిన పనులలో శ్రమను పొందుతారు వాటిని మధ్యలో వదిలేసే అవకాశం కలదు భాద్యత కలిగి ఉండుట మంచిది. కుటుంభంలో మీకంటూ ఒక విధానాన్ని కోరుకుంటారు మీ ఆలోచనలను తెలియజేసే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో బాగుంటుంది కొంత నిదానంగా వ్యవహరించుట,ఒపికను కలిగి ఉండుట వలన లబ్దిని పొందుతారు. 

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో నలుగురిలో చక్కటి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. మీయొక్క ఆలోచనలు నలుగురికి సహాయం చేయాలనే తలంపును కలిగి ఉంటారు. ఆర్థికపరమైన నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగంలో అధికారులతో కలిసి చర్చాసంభందమైన విషయాల్లో పాల్గొనే అవకాశం కలదు. పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడుట సూచన. తలపెట్టిన పనులను వారం చివరలో పూర్తిచేసే అవకాశం కలదు , నూతన పనులను చేపట్టుటలో ఆసక్తిని కలిగి ఉంటారు. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది అవసరమైన ప్రయాణాలు చేయుట వలన లబ్దిని పొందుతారు అలాగే మిమ్మల్ని మీరు తరచి చూసుకోవడం మంచిది. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి మేలుజరుగుతుంది.   

 

 

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో ఆలోచనలతో సతమత మయ్యే అవకాశం కలదు.  ఒకవార్త మూలాన కొంత నిరాశను పొందుటకు అవకాశం కలదు. అనవసరమైన చర్చలకు అవకాశం ఇవ్వకండి. మిత్రులతో అభిప్రాయభేదాలు రావడానికి ఆస్కారం కలదు కావున ఆవేశానికి లోనవకుండా సర్దుబాటువిధానం ఆవలంభించుట వలన మేలుజరుగుతుంది. కుటుంభంలో తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది.విందులలో పాల్గొంటారు, భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను చూపించే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట అలాగే నూతన ప్రయత్నాలు వాయిదా వేయుట సూచన. ప్రయాణాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి,ప్రయాణాల్లో నూతన పరిచయాలు అయ్యేఅవకాశం కలదు.  

 

 

 

తులా రాశి : ఈవారం మొత్తంమీద అధికారులతో నిదానంగా వ్యవహరించుట వారికి అనుగుణంగా నడుచుకొనుట సూచన. తలపెట్టిన పనులకు సంభందించి కొన్ని కొన్ని విషయాల్లో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. ప్రయాణాలు చేయునపుడు స్వల్ప సమస్యలు ఎదుర్కొంటారు వీలయితే వాయిదా వేయుట సూచన. దైవసంభందమైన పూజలకు సమయం ఇవ్వడం సూచన. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి అలాగే ఆశించిన లబ్దిని పొందుతారు. కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు వీటి విషయంలో నూతన ప్రయత్నాలు ఆరంభించి మనోదైర్యంతో ముందుకు వెళ్ళడం వలన మేలుజరుగుతుంది. దగ్గరిబంధువుల నుండి నూతన సమాచరం సేకరిస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు.      

 

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు,నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. సామాజికకార్యక్రమాలకు సమయం ఇవ్వడం ద్వార నలుగురిలో చక్కటి గుర్తింపును పొందుతారు. ఆర్థికపరమైన విషయల్లో ఆశించిన విధంగా మంచి ఫలితాలు పొందుటకు ఆస్కారం ఉంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. వ్యాపారంలో నూతన ఆలోచనలు కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. కుటుంబంలో నూతన చర్చలకు అవకాశం కలదు పెద్దల సూచనల మేర నడుచుకోండి మంచిది. మిత్రులతో కలిసి సమయాన్ని మీకు నచ్చిన విధంగా గడుపుతారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు వాటికి నూతన ప్రయత్నం చేయుటకు అవకాశం కలదు. మీయొక్క మాటతీరు నలుగురిని ఆకట్టుకొనే విధంగా ఉంటుంది.

 

ధనస్సు రాశి ఈవారం మొత్తంమీద బంధుమిత్రుల నుండి ఆశిచిన సహకారం రావడం మూలన సంతోషాన్ని కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాల పట్ల స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వీటి విషయంలో మాత్రం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట మేలు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి లేకపోతే ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. విదీశీప్రయాణాలు కలిసి వస్తాయి వాటికోసం చేయు ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. తండ్రి తరుపు వారితో విబేదాలు రాకుండా చూసుకోండి సర్దుబాటు అవసరం. ఉన్నతవిద్యాఅవకాశాలు కలిసి వస్తాయి. కుటుంభంలో సభ్యులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం సంప్రదాయ విధానం మేలుచేస్తుంది.

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద స్త్రీ సంభందమైన విషయాలలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. కుటుంబంలో సభ్యుల నుండి ఊహించని విధంగా సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు వాటికి సమయం ఇస్తారు. దూరప్రదేశం నుండి సంతోషించే వార్తలను వినే అవకాశం కలదు.  ఆర్థికపరమైన విషయంలో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు నిదానం అవసరం. వ్యాపారం బాగానే ఉంటుంది. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారితో సమయం గడుపుటకు అవకాశం కలదు. అనారోగ్యం వలన సమస్యలు తప్పక పోవచ్చును సరైన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. అనుకోని ఖర్చులు కలుగుటకు ఆస్కారం కలదు వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. 

 

 

కుంభ రాశి :  ఈవారం మొత్తంమీద ఆరంభంలో కొంత ఒత్తడిని పొందుతారు. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ధనమునకు సంభందించిన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా లేకపోతే ఖర్చులు చేయుదాటుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ప్రణాళికను కలిగి ఉన్నచో చేపట్టిన పనులను ముందుకు తీసుకువెల్లడంలో విజయం సాధిస్తారు. కుటుంభంలో స్వల్ప మార్పులు అవకాశం ఉంది సభ్యుల నుండి నూతన విన్నపాలు వచ్చే అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారులతో గుర్తింపును పొందుతారు వారికి అనుగుణంగా నడుచుకొండి. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చిననాటి మిత్రులను లేదా గతంలో మీతో కలిసి పనిచేసిన వారిని కలిసే అవకాశం ఉంది. వ్యాపారసంభందమైన విషయాల్లో నూతన పెట్టుబడులను కోరుకొనే అవకాశం ఉంది ఎ విషయంలో అనుభవం ఉపయోగపడుతుంది.   

 

మీన రాశి : ఈవారం మొత్తంమీద నచ్చిన పనులకు సమయం ఇస్తారు అలాగే తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిలో స్వల్ప ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు. వాహనముల మూలాన ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది కావున వాటిని సాధ్యమైనంత వరకు తక్కువగా వాడుట సూచన. వ్యాపారంలో వారం చివరలో కొంత ఆశించిన విధంగా ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో తోటివారిమూలాన చిన్న చిన్న సమస్యలను పొందుతారు,పనిభారం పెరుగుతుంది అధికారుల నుండి పనిఒత్తిడి తప్పక పోవచ్చును. వ్యతిరేక వర్గం నుండి వచ్చు ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం కలదు. సోదరసంభందమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. దూరప్రదేశం నుండి వార్తలు వింటారు.   

 

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి