నా గురించి ఏమనుకుంటున్నారో ..?? - ...

what-people-think-about-me

ప్రతి ఒక్కరూ నిరంతరం మీ గురించి ఆలోచించేటంత ఆసక్తికరమైన వారు మీరని అనుకుంటున్నారా? మీ గురించి ఎవరూ ఏమీ ఆలోచించకపోతే అంతకంటే స్వాతంత్ర్యమేముంటుంది. వాళ్లేం ఆలోచిస్తున్నారో, అనుకుంటున్నారోనని మీకెందుకాలోచన? అది మీకవసరమే లేదు. మీరేం చేయదలచుకున్నారో దానిపై మీ దృష్టిని కేంద్రీకరించండి. ఇతరుల్ని వాళ్లిష్టం వచ్చినట్లు ఆలోచించుకోనివ్వండి. వాళ్లకు మరో ముఖ్యమైన పని ఏమీ ఉండి ఉండకపోవచ్చు. అందుకే మీ గురించి ఆలోచిస్తున్నారన్న మాట. ఎవరో ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తున్నారనుకోవడం అన్నది చాలా వరకు మీ ఊహ మాత్రమే.

చాలా మంది తమ సొంత సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారు. వాళ్లు మీ గురించి ఆలోచించ లేరు, ఇది మంచిదే. ఎవరో మన గురించి ఆలోచించడం వల్ల మనకేమీ నష్టం లేదు. ఇతరుల గురించి బాధ పడకండి. వాళ్ల ఆలోచనలను మీరు మార్చలేరు. అటువంటప్పుడు వాటి గురించి ఎందుకు పట్టించుకుంటారు.

మీరు చేయదలచుకున్న పనికి ప్రతి ఒక్కరి ఆమోదం మీకెన్నటికీ లభించదు. అందువల్ల దాన్ని పట్టించుకోవద్దు.

వాళ్ల మానసిక సమస్యల్ని వాళ్లకే వదిలేయండి. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయకండి. వాళ్లు ఏ చెత్త అయినా ఆలోచించవచ్చు. మీ స్వభావంపై దాని  ప్రభావం ఎందుకు పడాలి? మీరు బాగున్నారని మీరనుకుంటే అది చాలు. మీరలా లేరని వాళ్లనుకుంటే అది వాళ్ల సమస్య మాత్రమే.

ఎవరో మీ గురించి ఏదో అనుకుంటున్నారన్న ఆలోచన మీకుంటే మీరిక జీవితంలో ఏమీ చేయలేరు. మీరు చేయదలచుకున్న పనికి ప్రతి ఒక్కరి ఆమోదం మీకెన్నటికీ లభించదు. అందువల్ల దాన్ని పట్టించుకోవద్దు. మీరేం చేయదలచుకున్నారో దానిపై మీ దృష్టిని కేంద్రీకరించండి.

(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో...)

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం