నిండా పాతికేళ్లు లేని కుర్రాడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. మాజీ కేంద్రమంత్రి కుమారుడు హఠాన్మరణంతో ఒక్కసారిగా అందరూ షాక్‌కి గురయ్యారు. ప్రముఖుడి తనయుడు కాబట్టి ఈ వార్తకు ప్రాధాన్యత దక్కింది. కొన్ని నెలల క్రితం ఓ పందొమ్మిదేళ్ల కుర్రాడు క్రికెట్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు. 19 కావచ్చు. 21 కావచ్చు. 24 కావచ్చు. 18 నుండి 25 ఏళ్ల లోపు యువత గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వార్తలు ఈ మధ్య తరచూ వింటున్నాం. అమ్మాయి ప్రేమను పొందడానికి కుర్రకారు సర్కస్ ఫీట్లు చేసే వయసిది. ఆ అమ్మాయి హృదయంలో చోటు సంపాదించుకోవడం సంగతి పక్కన పెడితే, ముందు తమ హృదయం పరస్థితేంటని యువత తమని తాము ప్రశ్నించుకోవాలి. అసలీ వయసులో గుండెపోటేంటి.?
ఇది అంతు చిక్కని విషయమేమీ కాదు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం దాదాపుగా మానేశాం. స్కూల్ స్థాయి నుండీ, పిల్లలు జంక్ ఫుడ్స్ మీద మోజు పెంచుకుంటున్నారు. పిజ్జాలు, బర్గర్స్ తప్ప ఇంట్లో తిండి రుచించడం లేదు. సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఫిట్‌గా ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. గుండె, కిడ్నీ, లివర్ వంటి ప్రధాన అవయవాల పని తీరుపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిందే. పసి వయసు నుండే బీపీ, డయాబెటిస్ వంటి వ్యాధులు వెంటాడుతున్నాయి. ఇవేమీ లేకపోయినా, గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. తగినంత వ్యాయామం, సరైన పోషకాహారం, ఎప్పుడూ సరదాగా ఉంటూ ఒత్తిడిని దూరం చేసుకోవడం మన గుండెకి మేలు చేస్తాయి.

ముఖ్యంగా ఆహారం విషయంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు వీలైనంత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్, సలాడ్స్ సరిపడినన్ని తీసుకోవాలి. స్మోకింగ్, మద్యపానం వంటి చెడు అలవాట్లకు, దూరంగా ఉండాలి. పోటీ పరీక్షల ఒత్తిడి ద్వారా గుండెకు ఎక్కువగా చేట జరుగుతోందని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని సర్వేల్లో 18 నుండి 25 ఏళ్ల లోపు యువతీ యువకులు అత్యంత తీవ్రమైన మానసిక ఒత్తిడిని భరించాల్సి వస్తుందని తేలింది. ఏ దేశానికైనా యువతరమే వెల కట్టలేని సంపద. దురదృష్టవశాత్తూ, ఆ యువత నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. బీ అలర్ట్.!