‘మంచి నీళ్ళ బావి...’ లఘుచిత్రసమీక్ష - -సాయి సోమయాజులు

her short flim

పది నిమిషాల నిడివి గలిగే లఘుచిత్రాలనే చూడలేని ఈ రోజుల్లో దాదాపు గంట నిడివి గల లఘుచిత్రాన్ని తియ్యడం సాహసమనే చెప్పాలి. ఎప్పుడో ఫణీంద్ర తీసిన ‘మధురం’ ఆకట్టుకున్నట్టే, ఇప్పుడిప్పుడే విడుదలైన ‘మంచి నీళ్ళ బావి...’  అందరినీ ఆకట్టుకుంటుంది. పాపులర్ యూట్యూబ్ ఛానల్ అయిన ‘ఐక్లిక్’ ద్వారా విడుదలైన ఈ చిత్ర సమీక్ష, మీకోసం...

కథ:
ఓ చిన్నపాటి గ్రామంలోని శివుడు అనే ఒకతను పట్నానికెళ్ళి తన మరదలైన గంగను పెళ్ళి చేసుకొస్తాడు. రాక్షసుడిలాంటి ఆ ఊరి దొర కన్ను గంగ మీద పడి, తనని ఎలాగైన లగ్గం చేసుకోవాలని నిశ్నయించుకుంటాడు. ఆ దొర గంగను వశపరుచుకుంటాడా? శివుడు ఏం చేస్తాడు? గంగ వాళ్ళ నుంచి తప్పించుకుంటుందా.. లేక పగ తీర్చుకుంటుందా? వీటన్నిటికీ జవాబు మీరు తెలుసుకోవాలంటే, మీరు ‘మంచి నీళ్ళ బావి’ ని తప్పక చూడాలి.

ప్లస్ పాయింట్స్ :
యాభై నిమిషాల పాటు ప్రేక్షకుణ్ని స్క్రీన్స్ కు కట్టి పడేయడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ యూట్యూబ్‍ కి! కానీ ‘మంచి నీళ్ళ బావి’ ఈ విషయంలో నూటికి నూరుపాళ్లు విజయవంతం అయిందంటే ఈ చిత్రం టీంని అభినందించక తప్పదు. ముఖ్యంగా, ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్స్ రెండు- కెమెరావర్క్, ఎడిటింగ్. మాస్టర్ క్లాస్ కెమెరావర్క్, ఏ-వన్ ఎడిటింగ్ ఈ సినిమాను మళ్ళీ-ళ్ళీ చూసేలా చేస్తుంది. తెలంగాణ యాసలో పాత్రలు మాట్లాడడం వలన ఈ సినిమాకి ఓ డిఫరెంట్ లుక్ వచ్చింది. ఆర్.పి. పట్నాయిక్ గారు పాడిన ‘యేలాలో...’, మరియూ టైటిల్ సాంగ్ చాలా బాగా కంపోజ్ చేసారు, అద్భుతంగా చిత్రీకరించారు కూడా! చివరిగా వచ్చే టైటిల్ సాంగ్ చాలా పవర్ ఫుల్ గా... ఇంటెన్స్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌంటడ్ మ్యూజిక్ చాలా ఒరిజినల్ గా ఉండడమే కాకుండా, సినిమాను మరో మెట్టు పైకెక్కిస్తుంది. కథ మాత్రమే కాదు, కథనం కూడా చక్కగా అమరింది.

కొన్ని సీన్స్ అయితే సినిమా అయిపోయాక కూడా కళ్ళలో మెదులుతూ ఉంటాయి. డైలాగ్స్ చాలా బాగా రాశారు... ముఖ్యంగా శివుడు, మరియు అతని భార్య- గంగ మధ్య జరిగే సంభాషణలు హార్ట్ టచ్చింగ్గాగ ఉంటాయి. సినిమాలోని హిజ్రా పాత్ర బాగా ఆకట్టుకుంటుంది, ఆ పాత్ర అన్నింటిలోకీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నటీనటులందరూ చాలా బాగా నటించారు. ముఖ్యంగా ఓ పిచ్చిదాని కొడుకు పాత్ర ధరించిన బాలుడి నటన చాలా బాగుంటుంది. విలేజ్ సెటప్ను  చక్కగా చిత్రీకరించారు... మూఢనమ్మకాలతో గ్రామవాసులు ఎలా మోసపోతారో.. జోగిని విధానం అమాయకపు జనాలను ఎలా బుట్టలో వేసుకుంటుందో.. వాస్తవికంగా చూపించారు.

సాంకేతికంగా :
అనిల్ జల్లు గారి ఎడిటింగ్ అద్భుతమని చెప్పుకోవచ్చు. కలర్ గ్రేడింగ్, కలర్ కరెక్షన్తోప మూవీకి తెచ్చిన లుక్ ఈ కథను ఓ దృశ్య కావ్యంగా మారుస్తుంది. ఆర్ట్ డైరెక్షన్ పర్ఫెక్ట్! విలేజ్ నేటివిటీ, కాస్ట్యూమ్స్, సెట్టింగ్స్... అన్నీ చాలా బాగా సమకూర్చారు. సాయి సంతోష్ గారి సినిమాటోగ్రఫి ఈ సంవత్సరంలో ఇప్పటివరకు విడుదలైన తెలుగు లఘుచిత్రాలన్నిటిలోకీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లైటింగ్ సెట్ అప్ కూడా సరితూగింది! షార్ట్ ఫిల్మ్ అయినప్పటికీ, ఓ ఫీచర్ ఫిల్మ్ స్టైల్లోు ప్రెజెంట్ చేసినందుకుగాను ‘హెమాంజనీదేవి అడపా ప్రొడక్షన్’ని అభినందించాలి. సౌండ్ చాలా ప్రొఫెషనల్గాస రికార్డ్ చేశారు. శ్రీ వెంకట్ గారు దర్శకత్వం వహించిన సంగీతం చాలా పెద్ద ప్లస్ అయ్యింది. అందరికంటే మించి అభినందించాల్సింది ఈ చిత్ర దర్శకులైన శ్రీ గంగాధర్ అద్వైత గారిని. 

మొత్తంగా :
మంచి నీళ్ళ బావి, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఓ రివెంజ్ డ్రామా!

అంకెలలో:

4.5 / 5

మరిన్ని వ్యాసాలు