మీరే కల్పవృక్షంగా మారండి - ..

mere-kalpavrukshamga-marandi

సృష్టిలో అద్భుతమైన వస్తువు ఏదంటే, అది మీ కంప్యూటరూ కాదు, కారూ కాదు, అంతరిక్షనౌకా కాదు - చైతన్యంతో వాడగలిగితే మీ మనసే. సఫలత అనేది కొందరికి అలవోకగా సిద్ధించి, కొందరికి ఎంతో శ్రమపడితేనేగాని లభ్యం కాకపోవడానికి ముఖ్యకారణం, మొదటి రకం వారు మనసుని తమ చెప్పు చేతల్లో ఉంచుకోగలిగితే, రెండవ రకం వారు తమ శ్రేయస్సుకి వ్యతిరేకంగా ఆలోచించడమే. బాగా స్థిరంగా ఆలోచించగలిగిన మనసుని అన్ని కోరికలూ తీర్చే "కల్పవృక్షం" అంటారు. అటువంటి మనసుతో మీరేది కోరుకుంటే అది జరుగుతుంది. మీరు చెయ్యవలసిందల్లా మనసుని ఓ కల్పవృక్షంగా ఎదగగల ఉన్నత స్థాయికి అభివృద్ధి చేయడం, అంతే కానీ అది అశాంతికి పుట్టిల్లు కాకూడదు. ఏది కోరుకుంటే దాన్ని అభివ్యక్తం చేయగల మానసిక స్థితిని యోగ పరిభాషలో "సంయుక్తి" అంటారు.

ఈ నైపుణ్యం సమదృష్టి నుండి ఉద్భవిస్తుంది. ఒకసారి మీ ఆలోచనల్లోకి ఓ క్రమం వస్తే, మీ భావావేశాలు వాటంతటవి క్రమపద్ధతిలోకొస్తాయి. క్రమంగా మీ అంతశ్శక్తులూ, శరీరమూ కూడా అదే దిశలోకి కేంద్రీకృతమవుతాయి. కాకపోతే, మీరు ఈ ప్రమాణాలను అందుకోవడానికి చేసే ప్రయత్నంలో, దేనికి సిద్ధంగా ఉన్నారన్నదానిని బట్టి, వాటి క్రమం మారవచ్చు. ఈ రోజు ఉన్న వాస్తవ పరిస్థితి గమనిస్తే,  మనుషులు వారికి హేతుబద్ధంగా కనిపిస్తేనే తప్ప, ఏ పద్ధతినీ అంగీకరించడానికి సిద్ధంగా లేరు. క్రమేపీ, మీ ఆలోచనలూ, భావాలూ, శరీరమూ, అంతర్గత శక్తులూ- అన్నిటినీ ఒక మార్గంలోకి తీసుకురాగలిగితే, మీరు కోరుకున్నది సృష్టించి చూపగల శక్తి, మీరు నమ్మలేనంతగా పెరుగుతుంది.

 

(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో...)

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం