మరణాన్ని గెలిచేద్దామా.. మళ్లీ బతికేద్దామా..! - ..

Let's win the death .. again again ..!

కన్ను మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం. చాలా తరచుగా మాట్లాడుకునే మాటలివి. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో ఊహించలేం. ఎన్నాళ్లు ఈ భూమ్మీద మనకు నూకలున్నాయో అన్నాళ్లూ మనిషిలా బతకడమే ముఖ్యం. కానీ ఆ విషయాన్ని మనం ఎప్పుడో మర్చిపోయాం. అగాధాల లోతుల్ని, ఆకాశం అంచుల్నీ చూసేయాలని తహతహలాడుతున్నాడు మనిషి. సాధిస్తున్నాడు కూడా. కానీ మరణం మాటేంటీ? ప్చ్‌..ఆ ఒక్కదానికి సమాధానం కనుగొనలేకపోతున్నాడు. చనిపోయాక మనిషి ఏమవుతాడు.? అనే ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు చాలా ప్రయత్నాలు, ప్రయోగాలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ప్రాణాపాయం నుండి కాపాడగల్గుతున్నాం. కానీ చనిపోయిన మనిషిని బతికించలేకపోతున్నాం. ఇప్పటికైతే, పరిస్థితి ఇంతే. సమీప భవిష్యత్తులో చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికేందుకు అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆశావాదులు. అందుకు వందల కోట్లు వ్యత్యించి, తమ శరీరాన్ని చనిపోయాక భద్రపరుచుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపు మూడొందల మంది వరకూ ఇలా చనిపోయిన తర్వాత తమ శరీరాల్ని భద్రపరచుకున్నారు. వేలాది మంది రిజర్వేషన్లు చేయించుకున్నారు. వైద్యరంగంలో వినూత్య ఆవిష్కరణలు మనిషి జీవిత కాలాన్ని పొడిగిస్తున్నాయి. పాడైపోయిన కిడ్నీల స్థానంలో, వేరొకరి నుండి సేకరించిన కిడ్నీలను అమర్చుతున్నారు. లివర్‌, లంక్స్‌, హార్ట్‌.. ఇలా ప్రధానావయాల్ని పాడైపోయిన పక్షంలో రీ ప్లేస్‌ చేసుకునే అవకావం దొరికింది. మరి జీవం కూడా అలా రీ ప్లేస్‌ అవుతుందా? మనిషిలోంచి ప్రాణం అనే జీవం అంతమైపోగానే దాన్ని రీప్లేస్‌ చేసే సాంకేతిక పరిజ్ఞానం ఎందుకు మనం సాధించలేం.? ఈ ప్రశ్న చుట్టూనే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఏమో ఏదో ఒక రోజు అందులోనూ విజయం సాధించేస్తాడేమో మానవుడు. 
చనిపోయిన మనిషిని మళ్లీ బతికి రావడం గురించి మాట్లాడుకున్నాం. కానీ బతికినంత కాలం ఏ అనారోగ్యం రాకుండా జీవించడం చాలా ముఖ్యం. అది మన చేతిలో పనే. లుషిత నీరు, ఆహారం కారణంగా అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయంటే నమ్మగలమా? జీవన శైలిలో మార్పుల కారణంగా క్యాన్సర్‌, హృద్రోగాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలు మనుషిని కబలించేస్తున్నాయి. వాస్తవాన్ని ఎలా విస్మరించగలం? గతంతో పోల్చితే చావును కొంత పోస్ట్‌పోన్‌ చేయగలుగుతున్నాం. కానీ నిత్యం మందులు, శరీరం నిండా అనారోగ్యాలతో జీవించడం దుర్భరంగా మారిపోతోంది. చచ్చి బతకడం గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందైతే, మన తప్పిదాల కారణంగా పాడైపోతున్న మన ఆరోగ్యం గురించి ఆలోచిద్దాం.

మరిన్ని వ్యాసాలు