సినిమాలతో పోల్చితే, వెబ్ సిరీస్‌కి ఖర్చు, కష్టాలు తక్కువే. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నవి ఈ వెబ్ సిరీసే. డిజిటల్ ప్లాట్‌ఫాంపై సరికొత్త విప్లవంగా వెబ్ సిరీస్‌ని చెప్పుకోవచ్చు. సినిమాలతో పోల్చితే కాన్సెప్ట్, క్రియేటివిటీ, రెండింటికీ సేమ్ టు సేమ్. తక్కువ ఎక్కువ ఏమీ ఉండదు. కాబట్టే స్టార్లు కూడా వెబ్ సిరీస్ వైపు వస్తున్నారు. ఖర్చు విషయానికి వస్తే, సినిమాలతో పోల్చితే చాలా చాలా తక్కువ . అందుకే కొంచెం క్రియేటివ్ థాట్ ఉంటే చాలు, ఈ డిజిటల్ ప్లాట్‌ఫాంపై తమ తమ క్రియేటివిటీకి రెడ్ కార్పెట్ పరిచేయడం నయా ట్రెండ్ అయిపోయింది.
అంతేకాదు, ఎవరెవరిలో ఎంతెంత క్రియేటివిటీ దాగుందో, ఈ వెబ్ సిరీస్ ద్వారా ఈజీగా వెలుగులోకి వచ్చే అవకాశం కలుగుతోంది. క్రియేటివిటీ ఉన్నా, తమ వద్ద ఉన్న కాన్సెప్ట్‌తో ఓ సినిమా తీయాలంటే, అందరికీ సాధ్యపడే అవకాశం కాదు. మరీ ముఖ్యంగా బోలెడంత ఖర్చు పెట్టి ఓ సినిమాని తెరకెక్కించడం ఓ ఎత్తైతే, దాన్ని రిలీజ్ చేయడం మరో ఎత్తు. మళ్లీ కష్టాలు మొదలు. రిలీజ్ కోసం ధియేటర్లు దొరకవు. పెద్ద హీరో సినిమా వస్తుంది కాబట్టి, కమర్షియల్‌గా మన చిన్న సినిమా వర్కవుట్ కాదు.. ఇలాంటి ఇబ్బందులకు అస్సలు ఆస్కారం లేదు ఈ వెబ్ సిరీస్‌లో. అంతా ఆన్‌లైనే. ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ అవుతుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు. అందుకే వెబ్‌సిరీస్ వైపు నేటి యువత ఎక్కువగా మొగ్గు చూపుతోంది. యంగ్‌స్టర్స్‌కి ఇదో అద్భుతమైన వేదిక. ఒకప్పుడు ప్రైవేట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ వస్తే, వెండితెరకు బుల్లితెర ప్రత్యామ్నాయం అని అంతా అనుకున్నారు. కానీ అలా బుల్లితెర, వెండితెరకు ప్రత్యామ్నాయం కాలేకపోయింది. బట్ నౌ పరిస్థితులు మారిపోయాయి. డిజిటల్ ప్లాట్‌ఫాం వెండితెరకు గండి కొట్టేలానే కనిపిస్తోంది.
సినిమాల్లో ఛాన్సుల కోసం క్రియేటివ్ పీపుల్ చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా, తమకు అందుబాటులో ఉన్న వనరులతో లోబడ్జెట్‌తో వెబ్‌సిరీస్ తీసేయడానికి ముందుకొస్తున్నారు. వీటికి సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువే ఉండబట్టి, సినీ జనాలు కూడా వెబ్‌సిరీస్ మీద మోజు పడుతున్నారు. వెబ్ సిరీస్‌కి సెన్సార్‌తో పెద్దగా పని లేదు. అక్కడ ఏమైనా తీసుకోవచ్చు. క్రియేటివ్ పీపుల్‌కి ఇదొక సానుకూలత. అందుకే స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా, వెబ్ సిరీస్‌లో నటించేందుకు నటీనటులు పోటీ పడుతున్నారు. ఆ కారణంగా ప్రస్తుతానికైతే వెబ్‌సిరీస్ నుండి వెండితెరకు చిన్నపాటి పోటీ కనిపిస్తోంది. భవిష్యత్ గురించి ఇప్పుడప్పుడే చెప్పలేం. కానీ వెండితెరకు వెబ్ సిరీస్ ప్రత్యామ్నాయం అవుతుందా? లేదా? అనే విషయం కాలమే నిర్ణయిస్తుంది. ఇకపోతే వెబ్‌సిరీస్ పేరుతో బూతును ఎక్కువగా ఇంజక్ట్ చేయడం కొంత బాధ కలిగించే విషయం. యూత్ ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, వెబ్ సిరీస్ అనే చిన్నతెర ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సమాజానికి ఉపయోగపడే సందేశాల్ని కూడా అందిస్తే మంచిదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.