ప్రతాప భావాలు! - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapa bhavalu

మలేషియాకి మా అబ్బాయి..

ఒక్కోసారి కొన్ని సాహసాలు చేస్తాం. తర్వాత తల్చుకుంటే గుండె గుభేలుమంటుంది, వెంట్రుకలు నిలబడతాయి. మా అబ్బాయి సాయి టెంత్ ఎగ్జామ్స్ రాశాక వాడి ఫ్రెండ్ అనురాగ్, మా అబ్బాయిని మలేషియాకి రమ్మని ఇన్వైట్ చేశాడు. ఆ అబ్బాయి తండ్రి అక్కడి హె ఎస్ బి సి బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాట్ట! మావాడు వెళతానని ఉత్సాహపడ్దాడు. అబ్రాడ్ వెళితే కొత్త వ్యక్తులు, పరిసరాల పరిచయాలతో ఆలోచనా పరిథి మరింత విస్తృతం అవుతుందని నేనూ ‘సరె’ అన్నాను. వాడు మొట్టమొదటి సారి. మనరాష్ట్రం విడిచి వెళ్లబోతున్నాడు. ఫ్లైట్ ఇంతవరకూ ఎక్కలేదు. కనీసం ఇండియాలోని మరో రాష్ట్రంలోకి కూడా అడుగుపెట్టలేదు. ‘టు అండ్ ఫ్రో టిక్కెట్స్ కి నేను ఫండింగ్ చేస్తాను గాని పాస్ పోర్ట్, విసా ఇతర విషయాలు నన్ను డిస్ట్రబ్ చేయకుండా వాడే చూసుకోవలసి ఉంటుందని’ నిర్ద్వందంగా చెప్పాను.

వాడు అన్నీ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నాడు. వెళ్లే రోజు రానే వచ్చింది. మనకీ మలేషియాకి సమయంలో సుమారు నాలుగు గంటల తేడా! దర్జాగా రాత్రి ఫ్లైట్ ఎక్కించేశాము. రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాం. ఎందుకో సరిగ్గా రాత్రి పన్నెండుకు మెలకువ వచ్చింది. బయట జోరున వర్షం. ’అదేమన్నా సికింద్రాబాదా? అమీర్పేటా? వాడు అడగంగానే అలా పంపించేశానేమిటి? కనీసం వాడి ఫ్రెండ్ తో, పేరెంట్స్ తోనూ మాట్లాడలేదు. వాడూ చిన్నపిల్లాడే! ఫ్లైట్ లో నిద్దరోతే, అక్కడ జనం లో తప్పిపోతే ఏం చేయాలి? వాడు సరిగ్గా అక్కడికి రీచ్ అవకపోతే? ఎవరిని కాంటాక్ట్ చేయాలి? వాడికి ఇంగ్లీష్ బాగా వచ్చు, క్రైసిస్ సిచ్యూయేషన్స్ బాగా హాండిల్ చేస్తాడు. బట్ ఈవెన్ దో’ ఆలోచనలు నా మనసుకు కుదురులేకుండా చేస్తున్నాయి. వెళ్లేప్పుడు అనురాగ్ ఫాదర్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. మావాడిక్కడ ఉన్నప్పుడు కనీసం ఆయనతో ఒక్కసారైనా మాట్లాడలేదు. అప్పటిదాకా, ఇంటర్నేషనల్ కాల్స్ నేనూ చేయలేదు.

ఆయనకి కాల్ చేశాను. వెళ్లలేదు. నేను ఎయిర్ టెల్ కాల్ సెంటర్ కి ఫోన్ చేసి ‘ఇంటర్ నేషనల్ కాల్స్ ఎందుకు వెళ్లడం లేదని’ అడిగాను.
‘దగ్గర్లో ఉన్న ఎయిర్ టెల్ ఆఫీసుకెళ్లి వెయ్యిరూపాయల డిపాజిట్ కట్టాలని, అప్పుడే కాల్స్ చేయగలుగుతానని’ తాపీగా చెప్పాడు.
‘రాత్రిపూట ఏ ఆఫీసు తెరచి ఉండదు, నాది పోస్ట్ పెయిడ్ కాబట్టి అది నెక్స్ట్ మంత్ బిల్ లో ఇన్ క్లూడ్ చేస్తే కట్టేస్తానని’ రిక్వెస్ట్ చేశాను.
అతను ‘ససెమిరా’ అన్నాడు.

చేసేదేం లేక మా అబ్బాయి తెల్లవారు జామున నాలుగ్గంటలకు (అంటే అక్కడ ఉదయం ఆరున్నర) దిగంగానే ఫోన్ చేస్తానన్నాడు కాబట్టి టెన్షన్ గా ఎదురుచూస్తూ కూర్చున్నాను. మనకీ మలేషియాకి సమయంలో రెండున్నరగ్గంటల వ్యత్యాసం.

నాలుగయింది, ఐదయింది ఫోన్ లేదు. నాకేం చేయాలో పాలుపోలేదు.

మొత్తానికి ఎనిమిదింటికి ఫోన్ చేశాడు. విషయం ఏవిట్రా? అంటే. వీడి ఫోన్ డిస్చార్జ్ అయిపోయిందట. వాడి ఫ్రెండ్ రిసీవ్ చేసుకోడానికి వచ్చాక, అతనితో కారులో వాళ్లింటికి వెళుతూ నాకు ఫోన్ చేశాడు. నాకు పోయిన ప్రాణాలు తిరిగొచ్చాయి.

టెన్ డేస్ అక్కడ హాయిగా గడిపి మనదేశానికి వచ్చాడు మా సాయి.

ఈ సంఘటన తరువాత చాలా డీప్ గా ప్రోస్ అండ్ కాన్స్ ఎస్టిమేట్ చేసిన తర్వాతే ప్రొసీడింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మొదలెడుతున్నాను.

*****

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు