15-6-2018 నుండి 21-6-2018 వారఫలాలు - - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులకు సమాధానం చెప్పవలసి రావోచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం చేతికి అందుతుంది. తల్లితరుపు బంధువుల నుండి కీలకమైన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. అధికారులతో చర్చలకు అవకాశం ఉంది, ఈ విషయంలో మీకంటూ ఒక స్పష్టమైన విధానం కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. సామాజికపరమైన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. 

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద నచ్చిన పనులకు సమయాన్ని ఇస్తారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వాహనముల వలన ఇబ్బందులు కలుగుతాయి, జాగ్రత్త. ఇష్టమైన వ్యక్తులను కలుసుకునే ఆస్కారం కలదు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది. అధికారులతో కలిసి నూతన పనులను మొదలు పెడతారు . మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, కాకపోతే అనుభవజ్ఞుల సూచన పాటించుట మేలు.

 



మిథున రాశి : ఈ వారం మొత్తం మీద చేపట్టిన పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట సూచన. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు చేయుటకు ఆస్కారము కలదు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం కలదు. మిత్రులను కలుస్తారు. కుటుంబపరమైన విషయాల్లో తల్లితరుపు బంధువుల నుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యమైన విషయాల పట్ల ప్రాముఖ్యత చూపుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఏమాత్రం తొందరపాటు కూడదు , స్పష్టత వలన లబ్దిని పొందుతారు.

 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద సమయాన్ని చర్చా పరమైన విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగంలో ముందుగా చేపట్టు పనుల విషయంలో అధికారుల అనుమతిని తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో అనవసరమైన మధ్యవర్తిత్వం వలన నూతన సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. పూజాదికార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారపరమైన విషయాల్లో మీ భాగస్వాములతో కలిసి చర్చలు చేయుటకు అవకాశం ఉంది, వారితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు . మిత్రులను కలుస్తారు.

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద కొంత పనిఒత్తిడిని కలిగి ఉంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే  అవకాశం ఉంది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి. తండ్రితరుపు బంధువుల తో కలిసి ముఖ్యమైన పనులను చేపట్టుటకు ఆస్కారం కలదు.

 

 

 

 

కన్యా రాశి :ఈవారం మొత్తం మీద ఆలోచనల ద్వారా లేక నిర్ణయాల ద్వారా నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. నూతన ఉద్యోగాల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి, కాస్త మరింతగా స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట, ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. వాహనాల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి. 

 

 

 

తులా రాశి : ఈవారం మొత్తం మీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది, నూతన ప్ర్తయత్నాలు చేస్తారు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపిన సమస్యలు పెరుగుటకు అవకాశం ఉంది, జాగ్రత్త. మీ కోపం మీ శత్రువు అని గుర్తించే సరికి నష్టం జరిగే ఆస్కారం ఉంది , జాగ్రత్త. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. 

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. గతంలో చేపట్టిన పనులకు గాను మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి , నిదానంగా ముందుకు వెళ్ళుట సూచన. మీ నిర్ణయాలను పెద్దలకు తెలియజేస్తారు. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకు సైతం ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. విదేశాల్లో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు వాయిదా పడుతాయి.

 

 

ధనస్సు రాశి :ఈవారం మొత్తం మీద మానసికపరమైన ఒత్తిడిని పొందుతారు. ఉద్యోగంలో సమయపాలన పాటించుట ద్వారా మేలుజరుగుతుంది. అధికారుల సూచనలకు అనుగుణంగా నడుచుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో మీకంటూ ఒకవిధానం ఉండుట చేత నలుగురిలో గుర్తింపును పొందుతారు. నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగ పడుతాయి. ప్రయాణాలు వాయిదా వేయుట సూచన. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయకండి, జాగ్రత్త.
 

మకర రాశి : ఈవారం మొత్తం మీద బంధువులకు లేదా మిత్రులకు మీ ఆలోచనలను తెలియజేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయంలో మీ నిర్ణయాలను అందరు గౌరవిస్తారు, పెట్టుబడులు లభిస్తాయి. కాకపోతే కొని కొన్ని విషయాల్లో సంతృప్తి లేకపోవడం వలన మానసిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కలదు, జాగ్రత్త. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం మంచిది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు.  

 

 

కుంభ రాశి :  ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో కొంత శ్రమకు గురయ్యే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో నాతన పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబపరమైన విషయాల్లో కెలకమైన ఆలోచనలు చేస్తారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయవల్సి రావోచ్చును, వాహనాల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన తప్పక మేలుజరుగుతుంది. చర్చల్లో కాస్త నిదానంగా ఉండుట సూచన. కుటుంబంలో అనుకోకుండా విభేదాలు వచ్చే ఆస్కారం కలదు, కాస్త ఈ విషయంలో సర్దుబాటు విధానం మంచిది.  

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద  చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహనముల వలన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచ్చేస్తాయి. పెద్దలతో మీ ఆలోచనలను తెలియజేయునపుడు వారి సూచనలను అలాగే అభిప్రాయాలను మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళుట సూచన. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి.

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు