చదివిస్తున్నామా? చంపేస్తున్నామా? - ..

Cadivistunnama? Campestunnama?

కష్టపడి చదవాలి. మంచి మార్కులు సంపాదించుకోవాలి. జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలి. ఇది మంచి మాట. ఫస్ట్‌ ర్యాంక్‌ ఖచ్చితంగా వచ్చి తీరాలి. ర్యాంకులు కొట్టకపోతే, జీవితం లేదు. ఇది చెడ్డ మాట. ఒకప్పుడు పదో తరగతి ఫెయిలైతే, ఇందులో బాధపడ్డానికి ఏముంది..? ఐటీలో జాయిన్‌ అవ్వు అని సలహా ఇచ్చేవారు. ఫెయిలయ్యాడన్న బాధ ఉన్నా తల్లితండ్రులు తమ బిడ్డల్ని నైరాస్యంలోకి వెళ్లిపోకుండా చూడడానికి అలా ధైర్యం చెప్పేవారు. ఇప్పుడు పరిస్థితులు అవి కావు. మెడిసన్‌లో ర్యాంకు రాకపోతే, వేస్ట్‌. అనేస్తున్నారు చాలా మంది. అందుకే విద్యార్ధుల్లో ఒత్తిడి చాలా తీవ్రతరమవుతోంది. టెన్త్‌ క్లాస్‌లో గ్రేడ్‌ రాలేదనీ, నీట్‌కి అర్హత సాధించలేదనీ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు విద్యార్ధులు. ఒక విద్యార్థి బలవరన్మరాణానికి పాల్పడ్డాడంటే, సమాజానికి అది చాలా పెద్ద నష్టం. ఎందుకంటే, నేటి యువతే రేపటి భవిష్యత్తు.

ఇంజనీరింగ్‌, మెడిసన్స్‌లో సీటు రాకపోతే, ఇంకో ఏడాది ప్రయత్నించొచ్చు. కానీ ప్రాణం పోతే, తిరిగి రాదు. అందరూ ఇంజనీరింగ్‌ మెడిసన్‌ అని పట్టుకు వ్రేలాడితే ఎలా? లక్ష్యం పెట్టుకోవడం తప్పు కాదు. ఆ లక్ష్యం చేధించడం కోసం కష్టపడడమూ తప్పు కాదు. కానీ, లక్ష్యాన్ని చేరలేనప్పుడు కొత్త లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలి. ఆ దిశగా తల్లితండ్రులు పిల్లల్లో ధైర్యాన్ని నింపగలగాలి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధుల బలవన్మరణాలు చాలా ఎక్కువైపోయాయి. స్కూలు స్థాయిలో, ఇంటర్మీడియట్‌ స్థాయిలో అత్యధికంగా ఈ బలవన్మరణాలు సంభవిస్తున్నాయి వాటిన్నింటికీ ప్రధాన కారణం ఒత్తిడి. చదువును నాలెడ్జ్‌ కోసం కాకుండా, ఓ శిక్షగా భావించాల్సి వస్తోంది. అక్కడి నుండే ఒత్తిడి స్టార్ట్‌ అవుతోంది.

చదువులో విజయం సాధించాలి అంటే, మంచి ర్యాంకులు సాధించాలి. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే, ర్యాంకులు సాధించడమే విజయం కాదు, జీవితాన్ని గెలవడం అసలు సిసలు విజయం. అలా జీవితాన్ని గెలవడానికి సవాలక్ష మార్గాలున్నాయి. ప్రపంచం ఓ అవకాశాల గది. వెతుక్కున్నోడికి వెతుక్కున్నంత. గెలిస్తే ఏముంది కిక్కు. ఓడి చూడు అసలు సిసలు కిక్కేంటో తెలుస్తుంది అంటాడో మహానుభావుడు. 'ఓటమి విజయానికి తొలి మెట్టు'. ఇది పెద్దలు ఎప్పుడో చెప్పిన మాట. గెలుపు నుండి తెలసుకోవడానికి ఏముంటుంది.? ఓటమి నుండే తెలియని ఎన్నో గుణపాఠాలు నేర్చుకోగలం. అందుకే ఓటమిని ఓటమిగా భావించకుండా, జీవితంలో గెలవడానికి పైకి నడిపే మెట్లలా భావించి చూడండి. జీవితం ఎంతందంగా కనిపిస్తుందో. అప్పుడు సాధించిన గెలుపు విలువ ఏ స్థాయిలో ఉంటుందో, ఎంతటి తృప్తినిస్తుందో.!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు