ఇంటర్నెట్‌లో బూతులే భవిష్యత్తు - ..

Internet is the future

4జి నెట్‌వర్క్‌.. హై స్పీడ్‌ నెట్‌వర్క్‌..అన్‌ లిమిటెడ్‌ డేటా..స్మార్ట్‌ ఫోన్స్‌.. ఇంకేముంది ప్రపంచాన్ని చుట్టేద్దాం. యువతే కాదు, ప్రతీ ఒక్కరూ ఇలా ఆలోచించడం మామూలే. హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ అదీ స్మార్ట్‌ ఫోన్‌తో సాధ్యపడడం విప్లవాత్మకమైన సాంకేతిక అద్భుతమే. ఇందులో విబేధించాల్సిందేమీ లేదు. ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్‌ పెడుతున్నాం. సమాచారమ్‌ ఒక చోట నుండి ఇంకో చోటికి అత్యంత వేగంగా పరుగులు తీస్తోంది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంది. అడవుల్లో ఉన్నా సరే, ఇంటర్నెట్‌ కనెక్ట్‌ అయితే చాలు, నగరాలతో సంబంధం లేదు. హాయిగా అడవుల్లో కూర్చొని, లక్షలు సంపాదించొచ్చు. అదీ ఇదీ అని కాదు, ఈ సాంకేతిక విప్లవం అన్ని రంగాల్లోనూ పెనుమార్పులు తీసుకొచ్చింది.

అయితే ఇందులో అంతా అద్భుతమే చీకటి కోణాలు లేవు అని అనుకుంటే పొరపాటే, అద్భుతం అనే మాట ఓ ఎత్తైతే, సిగ్గు పడాల్సిన విషయం ఇంకో ఎత్తు. లేకపోలేదు. సిగ్గు పడాల్సిన విషయం ఏంటనుకుంటున్నారా? జస్ట్‌ చెక్‌ ఇట్‌ అవుట్‌. ఓ సర్వే ప్రకారం మన ఇండియాలో మొబైల్‌ డేటా వినియోగానికి సంబంధించి ఆశక్తికరమైన విస్తుగొలిపే కఠోర వాస్తవాలు వెలుగు చూశాయి. అవేంటంటే, అత్యధిక డేటా వినియోగం పోర్న్‌ వీడియోల కోసమే జరుగుతోంది. ప్రధానంగా పోర్న్‌ వీడియోలు డౌన్‌ లోడ్‌ చేస్తున్న వారిలో 12 నుండి 25 ఏళ్ల లోపు వయసు వారే. 25 ఏళ్లు పైబడిన వారు చూడడం లేదని కాదు, వీళ్ల శాతం పైన చెప్పుకున్న గ్రూప్‌తో పోలిస్తే చాలా తక్కువే. ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు కొంత మేర సెన్సార్‌ చేయగలుగుతున్నా, ఇది చాలా చాలా చాలా చాలా తక్కువ.

ఒకప్పుడు వీడియో క్యాసెట్ల రూపంలో ఈ తరహా పోర్న్‌ వీడియోలు వినియోగంలో ఉండేవి. అవి కూడా చాలా తక్కువగా ఉండేవి. తర్వాత సీడీల వినియోగం వచ్చాక కాస్త పెరిగింది. పెన్‌ డ్రైవ్‌లు వచ్చాక ఇంకాస్త పెరిగింది. ఇప్పుడు స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్‌ చేతికి వచ్చాక, అదుపు చేయలేనంత దారుణమైన మహమ్మారిలా మారిపోయింది. తల్లితండ్రులు పిల్లల్ని కంట్రోల్‌ చేయడానికి కూడా వీలు లేనంత పరిస్థితి. కంట్రోల్‌ చేస్తే ఓ సమస్య. కంట్రోల్‌ చేయకుంటే మరో సమస్య అన్న చందంగా తయారైందీ పరిస్థితి. దాంతో ప్రభుత్వాలు కల్పించుకుంటే తప్ప ఈ మహమ్మారిని తరిమి కొట్టలేని దుస్థితికి వచ్చేశాం. కానీ మొబైల్‌ నెట్‌వర్క్స్‌ మధ్య నెలకొన్న తీవ్రమైన పోటీ ఈ భూతాన్ని పెంచి పోషిస్తోంది. ఆ సంస్థలకు ప్రభుత్వాలు సలాం కొట్టక తప్పడం లేదు. సమాజంలో జరుగుతున్న చాలా అకృత్యాలకు ఈ పోర్న్‌ వీడియోలు ముఖ్య కారణం అని చెప్పక తప్పదు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు