వెజ్‌ ఆర్‌ నాన్‌వెజ్‌ ఏంటి యూత్‌ ఛాయిస్‌.? - ..

veg or non veg

నాన్‌వెజ్‌ వినియోగం ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయిందంటే, కొన్నాళ్లు పోతే నాన్‌వెజ్‌ తినడానికి జంతువులు కావచ్చు. జలచరాలు కావచ్చు, పక్షులు కావచ్చు. అందుబాటులో లేకపోవచ్చు. ఏం చేయాలి.? ఈ ప్రశ్నలకు సమాధానం శాస్త్రవేత్తలకు ఎప్పుడో దొరికేసింది. ప్రయోగశాలలో మీట్‌ తయారు చేస్తున్నారు. అంటే సహజ సిద్ధంగా దొరికే నాన్‌వెజ్‌ కాకుండా సాంకేతికంగా అభివృద్ధి చేసిన నాన్‌వెజ్‌ తినబోతున్నామన్న మాట. అది మన ఆరోగ్యానికి మంచిదేనా? కాదా ? అనే దానిపై మళ్లీ చర్చ జరుగుతోంది. సహజసిద్దంగా కాకుండా ప్రయోగశాలలో అభివృద్ది చేసిన మాంసకృత్తుల ద్వారా లభించాల్సిన విటమిన్లు, శరీరానికి దక్కుతాయా? లేదా?

మంచి చెడుల సంగతి పక్కన పెడితే, ఇప్పుడు యూత్‌ ఏమనుకుంటోంది? నాన్‌వెజ్‌ అనగానే చవులూరిపోయే పరిస్థితి యువతరంలో కాస్త ఎక్కువే. అదే సమయంలో ఈ మధ్య యువత ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద పెంచుకుంటోంది. ఫిట్‌నెస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉంటున్నారు. మీట్‌ జోలికి వెళ్లకపోవడమే బెటర్‌ అన్న అభిప్రాయం చాలా మంది యువతలో పెరిగిపోయింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. అసలు యువత ఆలోచనలు ఇలా ఎందుకు మారుతున్నాయి. ఎదిగే వయసులో యువతకు నాన్‌వెజ్‌ మంచిదా? వెజ్‌ మంచిదా? ఈ ప్రశ్నకు అంతర్జాతీయ స్థాయిలో వైద్య నిపుణులు చెప్పే మాట ఒక్కటే. నాన్‌వెజ్‌ మితంగా తీసుకోవాలని. వెజిటబుల్స్‌ వీలైనంత ఎక్కువగా తీసుకోవాలని. అయితే ఇక్కడ ఇంకో చిక్కు కూడా ఉంది. వెజిటబుల్స్‌లో కెమికల్స్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆ లెక్కన కూరగాయలతో పోల్చితే, నాన్‌వెజ్‌ బెస్ట్‌ అని కూడా అనుకోవాలేమో. కానీ నాన్‌వెజ్‌పై మందులు, రసాయనాల ప్రభావం తక్కువేమీ కాదు. కోళ్లు, మేకల్ని పెంచే క్రమంలో వాటికి చేసే ఇంజక్షన్లు, అవి తినే మానవాళి ఆరోగ్యానికి ప్రమాదరకంగా మారుతున్నాయి.

ఇప్పుడెలా? ఈ ప్రశ్నకు న్యూట్రీషియన్లు సులభమైన సూచనల్ని మార్గాలుగా చూపిస్తున్నారు. ఇంట్లో కుండీల్లో కూరగాయల్ని పెంచుకోవడం, వీలైనంత వరకూ ఆ కూరగాయలతోనే కాలక్షేపం చేసి, వారంలో ఒకటి రెండు రోజులు నాన్‌వెజ్‌ తీసుకోవడం మంచిదని వారు చెబుతున్నారు. బరువు పెరగడానికి నాన్‌వెజ్‌ ఒక్కటే కారణం కాదు. ఇంకా చాలా కారణాలుంటాయి. అతి తెచ్చే అనర్థాలకు దూరంగా ఉంటే, చాలా హ్యాపీ. ఇదే మంత్రాన్ని యువతరం ఇప్పుడిప్పుడే జపిస్తోంది. ఆహ్వానించదగ్గ మార్పే కదా ఇది. ఎంత పెద్ద మార్పైనా నెమ్మదిగానే మొదలవుతుంది. ఇప్పుడిప్పుడే ఆ మార్పు మొదలైంది. కొంత టైం పడుతుంది కానీ, ఖచ్చితంగా ఆ మార్పు వస్తుందని ఆశిద్దాం.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి