స్మార్ట్‌గా నాశనమైపోతున్నారు.! - ..

Smartly ruinous!

టెన్త్‌ క్లాస్‌లో కాలేజ్‌ ఫస్ట్‌. ఇంటర్మీడియట్‌లో కూడా అంతే. ఆ తర్వాతే కాకరకాయ కాస్తా కీకరకాయ అయిపోయింది. ఎందుకిలా? అని తల్లితండ్రులు తమ పిల్లల చదువు గురించి తెగ టెన్షన్‌ పడుతున్నారు. విద్యార్ధుల్లో ఈ దారుణమైన మార్పు ఇంత ఆకస్మికంగా రావడానికి కారణమేంటి? అని ఆరా తీస్తే, ఓ సర్వే దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. టాప్‌ ర్యాంకర్‌ కాస్తా, జీవితం మీద అస్సలేమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడానికి మొబైల్‌ ఫోన్‌ ప్రధాన కారణం అంటే, తర్వాతి స్థానాల్లో చెడు స్నేహాలు, చెడు వ్యసనాలు ఉంటున్నాయి. లవ్‌ ఎఫైర్స్‌ పాత్ర కూడా ఇక్కడ ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిందే. అయితే స్మార్ట్‌ ఫోన్‌ కలిగిస్తున్న నష్టం ముందు మిగతావన్నీ బలాదూర్‌. ఎందుకంటే ఒక్క స్మార్ట్‌ ఫోన్‌ ప్రపంచాన్ని మన చేతుల్లో పెట్టేస్తోంది.

వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు లైఫ్‌లో 12 గంటలకు పైగానే దాంతో మమేకమైపోతున్నారు. అందులో మునిగి తేలుతున్నారు. విదేశాలతో పోలిస్తే దురదృష్టవశాత్తూ స్మార్ట్‌ ఫోన్‌ బాధితులు మనదేశంలోనే ఎక్కువ ఉన్నారు. వీరిని బాధితులు అనాలో, పిచ్చోళ్లు అనాలో, వ్యసనపరులు అనాలో అర్ధం కాని పరిస్థితి. వైవాహిక జీవితం కంటే స్మార్ట్‌ ఫోన్‌ ఎక్కువైపోతోంది కొందరికి. మూడు, నాలుగేళ్ల క్రితం వెలుగు చూసిన ఓ సర్వే భార్యా, భర్తల మధ్య సంబంధాన్ని సెల్‌ఫోన్‌ ఎలా చెడగొడుతుందో సవివరంగా వెల్లడించింది. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పోటీ పరీక్షల్లో టాప్‌ ర్యాంక్‌ వస్తుందనుకున్న యువత స్మార్ట్‌ ఫోన్‌ దెబ్బకి, ఆ ప్రవేశ పరీక్షలో అర్హత కూడా కోల్పోతోంది. తర్వాత తమ చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నామని దిగులు చెందుతున్నారు.

తప్పంతా స్మార్ట్‌ ఫోన్‌దేనా? ఈ ప్రశ్నే తప్పు. స్మార్ట్‌ ఫోన్‌ కూడా ఓ ఉపయోగకరమైన సాధనమే. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం, అన్ని సమస్యలకూ కారణం. స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్‌ ఫిల్‌ చేసే అవకాశమొచ్చింది. ఏ సబ్జెక్ట్‌కి సంబంధించి అయినా లోతైన సమాచారమ్‌ స్మార్ట్‌ ఫోన్‌లో దొరుకుతోంది. అభివృద్ధికి దూరంగా ఉన్న ఓ కుగ్రామంలోని కుర్రాడు, స్మార్ట్‌ ఫోన్‌ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగాడంటే, అతనికి దాన్ని ఎలా వాడాలో బాగా అవగతమయ్యిందన్న మాట. గుర్రం దౌడు తీసేటప్పుడు అటూ ఇటూ చూడకుండా, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటాం. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగంలో కూడా అలాంటి స్వీయ నియంత్రణ అవసరం. ఆ స్వీయ నియంత్రణే మనల్ని స్మార్ట్‌గా మార్చుతోంది. నియంత్రణ కోల్పోతే బురదలోకి నెట్టేస్తుంది. బురదలో పడతామని తెలిసి ఆ మైకంలోనే స్మార్ట్‌గా వెళ్లిపోతున్న యువత ఒక్కసారి భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే అస్సలు సమస్యే ఉత్పన్నం కాదు. 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి