ప్రతి పనికి వెనుక కారణం మన ఆనందం. - ..

The reason behind every work is our happiness.
మన జీవితంలో చేసే ప్రతి పనికి వెనుక కారణం మన ఆనందం. ఒక్కొక్కరు ఒక్కో విధంలో చేస్తారు, కొందరు దాతృత్వం ప్రదర్శిస్తే, ఇంకొందరు బయటి సౌకర్యాలను ఏర్పరచుకుంటారు. ఏమి చేసినా కూడా అది మన ఆనందం కోసమే, అసలైన ఆనందం కలగాలంటే అది అంతర్ముఖంలో సద్గురు మనకి గుర్తుచేస్తున్నారు. వారు చేసిన పాపాన్ని కడిగేసుకోవడానికి కొందరు దాతృత్వాన్ని చూపిస్తూ ఉంటారు. మరొకరు, ఎవరో ఒకతనికి మీరు ఇంత ఇస్తే, మీకు పదింతలు తిరిగి వస్తుంది - అని చెప్పారు కాబట్టి దాతృత్వం చూపించాలనుకుంటారు. ఇంకొకరు పుణ్యంతో స్వర్గానికి టికెట్ కొనుక్కుంటూ ఉంటారు.

కేవలం ఆనందంగా ఉండడం కోసం కొందరు చేస్తూ ఉంటారు.  ఒకరు అన్నిటినీ లాక్కొని సంతోషంగా ఉండడం నేర్చుకుంటే, మరొకరు అందరికీ దానం చేసి సంతోషంగా ఉండడం నేర్చుకుంటారు. ఏవిధంగా చూసినా మీరు కోరుకుంటున్నది సంతోషాన్నే. మీలో మీరు ఎటువంటి అనుభవాన్ని పొందుతున్నారు అన్నది ప్రధానం అందుకని  మీరు ఈ ప్రపంచంలో ఎలాంటి పనులు చేస్తున్నారూ అన్నది, మీలో మీరు ఏ విధంగా ఉన్నారూ అన్నదానికి ఎటువంటి సంబంధమూ లేదు. క్రమబద్ధంగా నేరాలనేవి ఇటువంటి వారివల్లే, ఇలాంటి దాతృత్వాన్ని చూపించడం వల్లే జరుగుతాయి. నేను మీకది ఇస్తాను. దానికై.. రేపు పొద్దున మీరు నాకు మరో విధంగా సహాయ పడాల్సి ఉంటుంది. ఇలా, ప్రతీదీ కూడా ఇటువంటి దాతృత్వం మీదే నడుస్తోంది.

మీలో మీరు ఎలా ఉన్నారు, అన్నది మీరు చేస్తున్న పనులకి సంబంధించినది కాదు. మీరు ఎటువంటి పనులు చేశారు అన్నది.. మీ చుట్టూరా ఉన్న పరిస్థితులను బట్టే ఉంటుంది. అంతేకానీ అది మీలో మీరు ఎలా ఉన్నారూ అన్న దానిని బట్టి కాదు..! మీరు మీ జీవితంలో మీకు ఏది కావాలంటే అది చేసుకోండి. కానీ ఇప్పుడు, మనం మీలో మీరు ఎలా ఉండాలనుకున్నారో చూద్దాం. మనలో అందరూ కూడా సంతోషంగానే ఉండాలనుకున్నాం.

కానీ అంతర్ముఖానికి వచ్చేసరికి.. మనందరికీ కూడా సమానమైన సామర్థ్యం ఉంది.  ఈ ప్రపంచంలో ఏమి చెయ్యాలనుకున్నా, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తాము. కానీ మన అంతర్ముఖంలోకి వచ్చేసరికి అందరమూ కూడా ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. కదా..? అది, ఒక నేరస్తుడైనా సరే..! ఒక పోలీసు అయినా సరే..!!  ఇద్దరూ కూడా సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు. నేను మాట్లాడుతున్నది అంతర్ముఖం గురించి. అంతర్ముఖానికి వచ్చేసరికి అందరికీ కావలసినది ఒక్కటే, అంతర్ముఖంగా మనందరికీ కూడా సమాన సామర్ధ్యాలు ఉన్నాయి.

ఈ బాహ్యప్రపంచంలో ఏ ఇద్దరూ కూడా ఒకే విధమైన సామర్థ్యాలను కలిగి ఉండరు. మీరు చేయగలిగింది, నేను చేయలేను. నేనేం చెయ్యగలనో మీరు అది చేయలేక పోవచ్చు..!!  ఏ ఇద్దరు మనుషులూ కూడా ఒకే విధంగా ఉండరు. కానీ అంతర్ముఖానికి వచ్చేసరికి.. మనందరికీ కూడా సమానమైన సామర్థ్యం ఉంది. వారు ఎల్లప్పుడూ పరవశంలో ఉండడానికి నాకెంత సామర్థ్యం ఉందో, అంత సామర్ద్యం మీకు కూడా ఉంది. కానీ అటువంటి విషయం ఎందుకు జరగడం లేదంటే, మీరు దానిపైన ఎప్పుడూ అటువంటి దృష్టి పెట్టలేదు. నిజానికి మీ జీవిత స్వభావం అనేది మీలో మీరు ఎలా ఉన్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

బయటి పరిస్తుతులను చక్కబెట్టడం ద్వారా సంతోషం కలగదు ఇప్పుడు, మీరు ఎటువంటి బట్టలు ధరించారు లేదా ఎటువంటి కార్ కలిగి ఉన్నారు, ఎటువంటి ఇంట్లో జీవిస్తూ ఉన్నారు -  అన్న దానిమీద మీ జీవన స్వభావం ఆధారపడి ఉండదు. మీ జీవితం మీరిప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు -  అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ప్రయత్నిస్తున్నది కూడా దానికోసమే. కానీ  మీరు ఎప్పుడూ దాని పట్ల తగినంత దృష్టిని పెట్టలేదు.

మీరెప్పుడూ కూడా బాహ్యమైనవాటినన్నింటినీ సరి చేసుకుంటూ రావాలనే అనుకుంటున్నారు. ఎక్కడో మీలో మీరు, బయటి పరిస్థితులన్నీ చక్కబడితే అన్నీ చక్కబడతాయి, అని నమ్ముతున్నారు. ఇది పని చేయదు అని చెప్పడానికి పాశ్చాత్య దేశాలనే ఉదాహరణగా తీసుకోండి. వారు బయటి ప్రపంచాన్ని ఎంత మెరుగ్గా చెయ్యగలరో అంత మెరుగ్గానూ చేశారు. కానీ ప్రజలు సంతోషంగా లేరు. ప్రజలు
పిచ్చి వారైపోతున్నారు.  మీరు బయట ఏమి చేసుకోవాలనుకుంటున్నారో అది మీ ఎంపిక. కానీ మీరు అంతర్ముఖంలో ఎలా ఉండాలనుకుంటున్నారు అన్నదానిలో ఎంపిక ఏమీ లేదు. ప్రతీవారూ కూడా సంతోషంగానే ఉండాలనుకుంటున్నారు.

(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో...)

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి