జోకులు - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

అభి భీముడు: మహాకవి వేమన గారు, తన యావదాస్తిని సాని కొంపకి తగలబెట్టారటగా?
అభి సోముడు: సాని, ఆయన కొంపని తగలబెట్టి ముంచింది.
అభి భీముడు: మంచికే జరిగింది... లేకపోతే, వేమన, కవిగా మారుండేవారు కాదేమో?! మనకి శతకం దక్కేది కాదు!!

 

చిన్నరాజు గారి  చిన్నమంత్రి:  రాజా, ఈ ఏడు ఉల్లి పంట, మన చిన్న రాజ్యం లోనే గాక, పక్కన పెద్ద రాజ్యం లో కూడా ఘనం గా దెబ్బతిన్నది.
చిన్న రాజు: శభాష్... పెద్ద రాజుకి తగిన శాస్తి జరిగింది!
చిన్నమంత్రి: మనం ఈ ఏడు కట్టవలసిన పన్ను, ఉల్లిపాయల రూపం లో చెల్లించమని, పెద్దరాజు కబురు పంపించారు ప్రభో!



ప్రియుడు: ప్రేయసీ, నీ ముఖము చంద్రబింబము వలె వున్నది!
ఇక్కడ, "వలె" అనునది ఉపమావాచకం. "ముఖము", ఉపమేయం. "చంద్రబింబము", ఉపమానము!! తిరిగీ మన కలయిక ఎప్పుడు ప్రేయసీ?

ప్రేయసి: పై , అమావాశ్యకి కనిపించు పో!!  


 


కిన్నెరుడు కిం పురుషుడితో: నారదుల వారిని, నా చిక్కు ప్రశ్నలతో తికమక పెడతాను చూడు!
కింపురుషుడు: చూద్దాం.. అదుగో నారదులవారొస్తున్నారు!
కిన్నెరుడు: స్వామీ... తమరు త్రిలోక సంచారి గదా? తిరగని  ప్రదేశం వుండదు. మరి తమరికి కాళ్ళనొప్పులుండవా?
నారదులు: నారాయణ మంత్రం జపిస్తాను తెలుసుగా.. శ్రీమన్నారాయణుడు నా నొప్పులు  భరిస్తాడు. మహాలక్ష్మి , స్వామి కాళ్ళొలొత్తి నొప్పులు తొలగిస్తుంది!
కింపురుషుడు: నారదులా..మజాకా?      

శిష్య పరమాణువు: గురోత్తమా... మీ వద్ద, నా విద్య పూర్తయింది! ఐతే పరీక్ష పెట్టకుండా వదిలేశారే? నేను ఉత్తీర్ణుడయ్యానా కాదా? నాకెలా తెలిసేది?
గురోత్తముడు: ఈ ఆశ్రమం వదిలి, ఊళ్ళొకెళ్ళు! ఉద్యోగం వెతుక్కో! ఉద్యోగం సంపాదించుకుటే, నువ్వు ఉత్తీర్ణుడివి ఐనట్లే.. పో!

 

 

 

 

 

భార్యామణి: నాథా.. హస్తసాముద్రికులు, పురుషుల కుడి చేతినీ, స్త్రీల ఎడమ చేతినీ పరీక్షిస్తారెందుకు?
భర్తాగ్రేసరుడు: ఎడమ చేయి గతాన్ని, కుడి చేయి భవిష్యత్తును సూచిస్తాయి.
భార్యామణి: అంటే?
భర్తాగ్రేసరుడు: (కొంటెగా) స్త్రీల గతం , పురుషుడి భవిష్యత్తులో గోచరిస్తుంది!! అని అర్ధం!!

 

జోష్యశిఖామణి: మహా ప్రభూ, మన యువరాజుకి, వింతల దేశపు యువరాణినే ఖాయం చేద్దాం!
మహారాజు: మన అంతస్తుకు తగిన మనువేనా?
జోష్యశిఖామణి: చిత్తం ప్రభూ! యువరాజు గారి మూడు తరాల జాతకాలను నిశితంగా పరిశీలించి, అమ్మాయి జాతకం తో పోల్చి చూశాము! వంశపారంపర్య రోగాలు ఇద్దరివీ సమానంగా వున్నాయి ప్రభూ!!

 

ఒక పౌరుడు: శతృ దుర్భేద్యమైన ఈ బురుజును అన్నేళ్ళుగా నిర్మించి, నేల కూల్చారే వృధాగా?
రెండో పౌరుడు: బురుజు నిర్మాణం లో   వాస్తు దోషముందని చెప్పగా, బురుజుని కొట్టి నేలమట్టం చేశారు!
మూడో పౌరుడు: వాస్తుదోషమని చెప్పిందెవరు?
నాలుగోపౌరుడు: శత్రు రాజు, వేగుల వాళ్ళ చేత అలా చెప్పించి నమ్మించాడు!
ఐదో పౌరుడు: ఆ తర్వాత?
ఆరో పౌరుడు: తెలిసిందేగా, శతృ రాజు దండెత్తి వచ్చి, కోటలో ప్రవేశించాడు!!

యువరాజు: రాజ గురువా... నేను కాననాలకి వెళ్ళి, కందమూలాలు తిని జీవనం సాగించాలనుకుటున్నాను.. నాకు సన్యాసం ప్రసాదించండి!
రాజగురువు: రాజా.. నిన్నగాక మొన్న పట్టాభిషిక్తుడివి. ఇంకా వివాహమైనా కాలేదు. బిడ్డలను కనలేదు, రాజ్యపాలన చేయలేదు. శతృ రాజులను యుద్ధం లో ఓడించలేదు... అప్పుడే సన్యాసమా?
యువరాజు: ఆ చివరిది తప్ప, తక్కినవన్నీ చేయగలను గురువా... అందుచేత!!

 

 

 

 

రాజు: మంత్రీ... అంతా కటిక చీకటిగా వుందే?
మంత్రి: మనం చీకటి కొట్లో వున్నాం ప్రభో!
రాజు: చీకటి కొట్లో వున్నామా... ఏం ఖర్మ?
మంత్రి: శతృ రాజు మన మీద దండెత్తి వచ్చి , చెరపట్టి, లోపల తోయించాడు ప్రభూ?
రాజు: నాకు తెలియదే?
మంత్రి: తమరు గాడ నిద్రలో వున్నారు ప్రభూ?

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు