ఫిట్‌ అండ్‌ పర్‌ఫెక్ట్‌: యూత్‌ నయా మంత్ర - ..

fit and perfect

యూత్‌లో ఫిట్‌నెస్‌ గురించి ఆశక్తి బాగా పెరిగిపోయింది. జిమ్‌ల చుట్టూ అమ్మాయిలూ, అబ్బాయిలూ తెగ తిరుగుతున్నారు. డైట్స్‌ గురించి ఎవరు చెప్పినా ముందూ వెనకా ఆలోచించకుండా పాఠించేస్తున్నారు. మారిన జీవన శైలి యువతకు శాపంగా మారుతున్న తరుణంలో ఫిట్‌నెస్‌ పట్ల అవగాహన పెరగడం మంచిదే కానీ, అయితే అందులోని మంచి చెడులను బేరీజు వేసుకోవాలన్న ముఖ్య విషయాన్ని యువత గమనించాల్సి ఆవశ్యకత ఉందని గుర్తుంచుకోవాలి. యువతకు ఫిట్‌నెస్‌ పట్ల పెరిగిన ఆశక్తితో దాన్ని క్యాష్‌ చేసుకోవడానికి పలు ఫిట్‌నెస్‌ సెంటర్లు రెడీ అయిపోతున్నాయి. రోజుకొకటి చొప్పున పుట్ట గొడుగుల్లా ఫిట్‌నెస్‌ సెంటర్లు పుట్టుకొచ్చేస్తున్నాయి. వీటిలో ఫేక్‌ ట్రైనర్లు, ఫేక్‌ డైటీషియన్లు కూడా ఉండడం బాధ కలిగించే అంశం. ఈ విషయాన్ని గమనించకుండానే యువత తొందరపాటు ఆలోనతో ఫిట్‌నెస్‌ సెంటర్స్‌లో మెంబర్స్‌ కావడం, వేలు ఖర్చు పెట్టి, గుడ్డిగా ప్రాణాపాయ పరిస్థితుల్లో పడడం జరుగుతోంది.

ఓ సర్వే ప్రకారం ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌ మీద యువత చేస్తున్న ఖర్చు చాలా ఎక్కువగా ఉంటోందట. కష్టపడి సంపాదించిన తమ సంపాదనలో అత్యధిక భాగం ఫిట్‌నెస్‌ కోసం వ్యత్యించేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఫిట్‌గా ఉండాలనుకోవడం మంచిదే. అయితే అలా ఉండేందుకు సరైన మార్గాన్ని అన్వయించాలి. డబ్బు ఖర్చుపెట్టేయడం ఒక్కటే మార్గం కాదు. వాస్తవానికి ఫిట్‌గా ఉండడం అంటే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతత లేనిదే ఏదీ సాధ్యం కాదు. శరీర సౌష్టవం బావుండాలని కోరుకోవడం తప్పు కాదు. అదే సమయంలో ఆ శరీర తత్వాన్ని కూడా అర్ధం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అన్ని రకాల డైట్స్‌ అన్ని శరీర తత్త్వాలకూ సరిపడవు. సరైన వైద్య నిపుణుని సలహా మేరకు డైట్‌ ఫాలో చేయాలనే కనీస జాగ్రత్తను యువత గుర్తుంచుకోవాలి.

వారమంతా కఠోరమైన కసరత్తులు చేసేసి, కఠినమైన డైట్‌ పాటించేసి, వీకెండ్స్‌లో హద్దు అదుపు లేకుండా నాన్‌వెజ్‌ తీసుకోవడం అత్యంత ప్రమాదరకం. అలాగే వ్యాయాయం చేసేటప్పుడు కూడా అతి ఉండకూడదు. ఇది కూడా ప్రాణాపాయం. కొత్తగా వ్యాయామం స్టార్‌ట చేసే యువత మొదట మెల్లగా స్టార్ట్‌ చేసి, గ్రాడ్యుయల్‌గా పెంచుకుంటూ పోవాలి. అలా కాక ఒకే రోజు శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టేయడం, రెండో రోజు రెస్ట్‌ తీసుకుని మళ్లీ స్టార్ట్‌ చేయడం అంత మంచిది కాదు. ఇవి చాలా సులువైన సలహాలే కానీ, వీటిని యువత అంతగా పట్టించుకోవడం లేదు. లైట్‌ తీసుకుంటున్నారంతే. సో ప్రియమైన యువతా.! డైట్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు తస్మాత్‌ జాగ్రత్త.!

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి