ప్రతాప భావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

భద్రత భారత్

రిపెయిర్ అనగానే మనకు వాచ్, వాషింగ్ మెషిన్, ఏ సీ, కంప్యూటర్ లాంటి వస్తువులు పని చేయకపోతే వాటిని మరమ్మత్తు (రిపెయిర్) చేసి ఉపయోగించుకోవడమే గుర్తుకొస్తుంది. అయితే రిపెయిర్ అనేది మన శరీరానికి, మనసుకూ జరుగుతుందంటే విచిత్రం అనిపించడమే కాకుండా అస్సలు నమ్మం కూడా!

కళ్లకు సైట్ వస్తే కళ్లజోడు పెట్టుకోవడం, కాళ్లు, చేతులూ విరిగిపోతే రాడ్లు వేయించుకుని స్వాధీనంలోకి తెచ్చుకోవడం, గుండెకి సమస్య వస్తే స్టంట్ లు వేయించుకోవడం, కిడ్నీ ప్రాబ్లం వస్తే డయాలసిస్ చేయించుకోవడం, మానసిక సమస్యలకు కౌన్సిలింగ్ ఇవన్నీ రిపెయిర్ లు కాదా చెప్పండి.

సమస్యలు వచ్చి బాధపడే వాళ్ల కన్నా శారీరక, మానసిక ఆరోగ్యవంతులు ఎంత అదృష్టవంతులో కదా!

ఇప్పటికే అనేకరకాల కాలుష్యాలు మనిషి జీవితాన్ని కాటేస్తున్నాయి. స్వయంకృతాపరాధాలు, పరాయి పాపాలు కూడా కారణమైతే మనిషి ఏమై పోవాలి?

మనిషి చాలా తెలివైన వాడు. ముఖ్యంగా తన అవయవాల విలువ బాగా తెలిసినవాడు. ఆలోచించే మెదడుతో బాటూ, అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తేనే మనిషి తననుకున్న గమ్యం చేరగలుగుతాడు. అవయవాలకి సమస్య వస్తే కొంతలో కొంత నయం. కృత్రిమ అవయవాలతో పనిచేసుకోవచ్చు. అదే గుండె, కిడ్నీ లాంటి వాటికి సమస్య వస్తే పనులు చేయడానికి శరీరం సహకరించినంత వరకే చేసుకుంటాడు. అది జీవితానికో పెద్ద లోటు.

ఇవన్నీ మనకు తెలిసినవే! అయితే నేనివన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మనలో కొంతమందికి జీవితం అంటే నిర్లక్ష్యం. పరిగెడుతూ బస్సులెక్కేస్తారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్ల మీద అలవోకగా నడుచుకుంటూ వెళ్లిపోతుంటా్రు. కంపెనీల్లో పనిచేసేప్పుడు భద్రతా పరమైన జాగ్రత్తలు అస్సలు తీసుకో్రు!

స్వచ్ఛ భారత్ సంగతి సరే భద్రతా భారత్ చాలా ముఖ్యం. మన దేశంలో గట్టిగా గాలి వీస్తే నడి రోడ్డు మీద అల్లల్లాడే హోర్డింగ్స్, రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు బైక్ లు నడిపేవాళ్లు, మూ(తు)తలు తెరచి వెక్కిరించే మ్యాన్ హోల్స్ ఇలా ప్రమాద హేతువులను ఎన్నైనా చెప్పుకోవచ్చు. నిజానికి మన చుట్టూ ప్రమాదకరమైన వాతావరణమే! కొన్ని సంస్థల్లో భద్రతా ప్రమాణాలు అసలు పాటించారు. దాంట్లో ఉద్యోగుల అవగాహనారాహిత్యంతో పాటు యాజమాన్యాల  నిర్లక్ష్యమూ కారణమే! దురదృష్టం కొద్దీ ప్రాకృతికంగా వ్యాధులు, రోగాలూ వస్తే అదివేరే విషయం గాని, మన నిర్లక్ష్యం తో గాని, ఇతరుల నిర్లక్ష్యంతో కాని మనకి అనారోగ్యం వస్తే, లేదా అంగవైకల్యం కలిగితే ఆ బాధ వర్ణనాతీతమే కదా!

ప్రతి మనిషికీ జీవితం ఓ వరం. జీవితం అంటే ఆలోచనలకు శరీర సహకారం. దాన్నే అశ్రద్ధ చేయడం తగునా?

అందరూ బాగుండాలి. అందులో మనముండాలి అనేది ఇటీవల సర్వత్రా వ్యాపించిన వ్యాక్య. వ్యక్తి/ సమాజ నిర్లక్ష్యాన్ని మనం చూస్తూ ఉండకూడదు. అవగాహన కలిగించాలి. ప్రమాదాలు జరిగాక విచారించడం కాదు వాటిని నివారించాలి. రక్తదానం, అవయవదానం కన్నా ప్రమాద నివారణ అతి ముఖ్యమైనది. అందరు పాటించవసింది!

లోకాస్సమస్తా సుఖినోభవన్తు!

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి