1. తమ భావాలను స్వేచ్ఛగా ప్రకటించే హక్కు, ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరునికీ ఇచ్చింది, మత విశ్వాసాలూ, పురాణేతిహాసాలూ ఇలా వేటి పైన అయినా ప్రశ్నించవచ్చు, వ్యాఖ్యానించవచ్చు. ప్రశ్నించిన వారిపై కోపంతో రగిలిపోవడం కన్నా, వారి ప్రశ్నలకు సహేతుకంగా ఆలోచించి సమాధానాలివ్వడం కరెక్ట్.
2. వార్తల్లో నిలవడం కోసం ఈ మధ్య సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం కొంతమందికి బాగా అలవాటైపోయింది. వారిని పిలిచి కూర్చోబెట్టి టీఆర్పీ పెంచుకోవడం చానెల్స్ కి వ్యాపారమైపోయింది. ఎంత హక్కు అయినా ప్రతి 'త్తిక ' వ్యాఖ్యలకూ స్పందించడం అనవసరం ' పిచ్చివాగుడు ' అనుకుని వదిలేయడం శ్రేయస్కరం. ఎవరూ పట్టించుకోనప్పుడు వాగుడు కట్టిపెట్టి వాళ్ళే బుద్ధిగా వుంటారు.
పైరెండిట్లో ఏది కరెక్ట్?