గాడ్జెట్‌ మేనియా దార్లో పెట్టేదిలాగయా.! - ..

gadget menia

మనం స్మార్ట్‌ ప్రపంచంలో ఉన్నాం. మొబైల్‌ ఫోన్‌, కొత్త పుంతలు తొక్కింది. స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే ప్రపంచమంతా మనకందుబాటులో ఉన్నట్లే. స్మార్ట్‌ ఫోన్‌, దాంతో పాటు స్మార్ట్‌ గాడ్జెట్స్‌ కుప్పలు తెప్పలుగా మనిషి జీవితంలోకి వచ్చేసి, మన అవసరాలు తీర్చేస్తున్నాయి. మనిషితో సంబంధం లేకపోయినా ఫర్వాలేదు. స్మార్ట్‌ ఫోన్‌ లేకుండా బతకలేని పరిస్థితి. అందుకే పిల్లలు కూడా వాటికే అడిక్ట్‌ అయిపోతున్నారు. కాదు కాదు మనమే వారిని అలా అడిక్ట్‌ అయ్యేలా చేసేస్తున్నాం. స్మార్ట్‌ ఫోన్‌ ఒక్కటే కాదు, అలాంటి గాడ్జెట్స్‌లోనే కొత్తదనం పుట్టి పెరుగుతోంది. మరి వాళ్లని మన లోకంలోకి తెచ్చేదెలా?

ఈ సమస్య చాలా మంది తల్లితండ్రులది. ఎందుకంటే, తమ పిల్లల్ని వాస్తవ ప్రపంచానికి దూరంగా మానవ సంబంధాలకు ఇంకా దూరంగా గాడ్జెట్స్‌ లోకంలోనే పెంచుతున్నాం. ఆ ప్రమాద తీవ్రత ఇప్పుడిప్పుడే తెలిసొచ్చి వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు. డాక్టర్లు మాత్రం ఏం చేయగలరు.? మనిషికి మందు వెయ్యచ్చు కానీ మనసుకు మందు వెయ్యలేం కదా. మనసంతా గాడ్జెట్స్‌తో నిండిపోయింది. అందుకే అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నారు. మరి ఈ అతి నుండి బయటపడ్డానికి మర్గాలున్నాయా? అంటే.. ఎందుకు లేవు ఉన్నాయి. కానీ కాస్త కాలంలోకి కూడా తొంగి చూడాలి. గాడ్జెట్స్‌లోనే ఉంచేయడం కాకుండా, పిల్లల్ని సమాజంలోనూ మనుషుల్లోనూ తిప్పాలి. కంప్యూటర్‌ చేతికిచ్చేయడమే కాదు, ఏం చేస్తున్నాడు. ఏం సెర్స్‌ చేస్తున్నాడు అనేది గమనించాలి. స్మార్ట్‌ ఫోన్‌ చేతికిచ్చేటప్పుడు కూడా ఇదే జాగ్రత్తలు తీసుకోవాలి. గాడ్జెట్స్‌ని చేతికివ్వడం తగ్గించి, తోటి పిల్లలతో కలిసేలా చేయాలి. మానవ సంబంధాలు తెలిసేలా చేయాలి. వీటిన్నింటి కంటే ముందు గాడ్జెట్స్‌ మాయలోంచి తల్లితండ్రులే బయటికి రావాలి.

మెడికేషన్‌ విషయానికి వస్తే ఏ వైద్యుడూ ఈ సమస్యకి మందులు సూచించడు. ఇది పూర్తిగా వ్యక్తిగత శ్రద్ధతోనే నయమయ్యే మానసిక సమస్య. కాబట్టి తమ బిజీ లైఫ్‌ని పక్కన పెట్టి పిల్లల కోసం సమయం కేటాయించి, గాడ్జెట్స్‌ అవసరం గురించి చెబుతూనే పూర్తిగా వాటిని ఎలా సద్వినియోగం చేయాలో తెలపాలి. వారంలో ఒకరోజో, రెండు రోజులో పూర్తిగా పిల్లల్ని గాడ్జెట్స్‌కి దూరంగా ఉంచడమనేది మంచి ఫలితాన్నిస్తుంది. తద్వారా పిల్లల్లోనే కాదు, పిల్లల తల్లితండ్రుల్లో కూడా మార్పు కనిపిస్తుంది. అనవసర ఆందోళనలు, అర్ధం పర్ధం లేని చికాకులు ఇవన్నీ దూరమవుతాయి కాబట్టి, కష్టమైనా గాడ్జెట్స్‌ని అదుపులో పెట్టాల్సిందే. లేకపోతే వేలు ఖర్చు చేసి కొనుక్కున్న గాడ్జెట్స్‌ కారణంగా మానసిక వైద్యుని వద్ద ఆ వేలాది రూపాయలు కౌన్సిలింగ్‌ కోసం సమర్పించుకోవల్సి ఉంటుంది. 

మరిన్ని వ్యాసాలు