వర్షాకాలం - అమ్మాయిల సిగపట్లు.! - ..

rainy season

వానాకాలం వచ్చేసింది. తొలకరి జల్లులు, నల్లని మబ్బులు, చల్లని గాలులు ప్రకృతి ప్రియులకు ఈ వాతావరణం ఎంతో మెచ్చుకోలైనది. తొలకరి జల్లులు పడుతుంటే వచ్చే మట్టి సువాసనలు నల్లని మబ్బుల చాటున చల్లని గాలికి హాయిగా ఊయలూగే చెట్లూ తొలికరి జల్లులకు భూమి నుండి పెళ్లుబికి వచ్చే పచ్చ పచ్చని మొక్కలు.. ఏమని వర్ణించేది వీటి అందం. ఇక వానంటే గుర్తొచ్చేది అందమైన అమ్మాయిలు. వానాకాలాన్ని, అందమైన అమ్మాయిల్ని పోలుస్తూ ఏనాడో మన కవులు తెగ కవిత్వాలు అల్లేశారు. తొలకరి చినుకులకు తడిసి ముద్దైన ముద్ద మందారాల్లాంటి అమ్మాయిల అందాలు వర్ణించ తరమా.! అందుకే తమకు తోచిన విధంగా వర్ణించేశారు మన కవులు. వర్షం, అమ్మాయిలు, కవులు, వర్ణన ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలింతకీ వానాకాలంలో అమ్మాయిలు తమ అందాన్ని కాపాడుకోవడానికి, అదే మేకప్‌ని కాపాడుకోవడానికి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావండోయ్‌.

చినుకులకు ముఖం తడిస్తే ముఖానికి వేసుకున్న మేకప్‌ చెడిపోతే ఎలా ఉంటుంది.? చెప్పండి. పాపం కదా.. అందుకే ఈ కాలంలో అమ్మాయిలు మేకప్‌ వేసుకోవాలంటే భయపడతారు. మేకప్‌ లేకుండా బయటికి రావడానికి భయపడతారు. అందుకే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి భయం లేకుండా అమ్మాయిలు ధైర్యంగా వర్షాకాలం బయటికి రావచ్చు. అవేంటో చూసేద్దాం పదండి. ముఖ్యంగా ముఖానికి సంబంధించి కళ్లు మఖ్యమైనవి. కళ్లకు వేసే ఐ షేడ్స్‌, ఐ లైనర్స్‌, మస్కారా వంటివి ఈ కాలానికి తగ్గట్లుగా ఉండాలంటే, వాటర్‌ ప్రూఫ్స్‌వే ఎంచుకోవడం తప్పనిసరి.

అలాగే తక్కువ క్వాలిటీవి కాకుండా, కాస్త నాణ్యత కలిగిన ఐటెమ్స్‌ని ఎంచుకోవడం గమనించాల్సిన అంశం. తర్వాత ఫేస్‌కి వేసే ఫౌండేషన్‌ క్రీములు కూడా వాటర్‌ ప్రూఫ్‌వే ఎంచుకుంటే మంచిది. అంతేకాదు, ఈ కాలంలోనూ చర్మం డ్రై అయిపోయే సమస్య ఉంటుంది కొంతమందికి. అలాంటి వారు ముందుగా ముఖానికి మాయిశ్చరైజర్‌ రాసి, తర్వాత ఫౌండేషన్‌ క్రీమ్‌ వాడాలి.

ఇకపోతే లిప్స్‌కి వేసే లిప్‌స్టిక్‌ని ఈ కాలంలో దూరంగా ఉంచడం మంచిది. దాని ప్లేస్‌లో లిప్‌ గ్లాస్‌ వాడితే డిఫరెన్స్‌ పెద్దగా తెలీదు. ముఖ్యంగా అమ్మాయిలు టెన్షన్‌ పడేది కేశాల కోసమే. వర్షానికి తడిసిన జుట్టు జిడ్డుగా, నిర్జీవంగా మారుతుంది. అందుకే వీలైనంత వరకూ తడవకుండా ఉండేలా చూసుకోవాలి. తప్పని పరిస్థితిలో తడవాల్సి వస్తే, ఇంటికి వెళ్లాక శుభ్రమైన షాంపూతో తలస్నానం చేయడం మర్చిపోకూడదు. తడిసిన జుట్టే కదా అని టవల్‌తో తుడిచేసుకుంటాం. కానీ అలా చేయడం మంచిది కాదనీ, వర్షపు నీటిలో తడిచిన జుట్టును అలాగే వదిలేయకుండా, మంచి నీటితో తలస్నానం చేయడం వల్ల ఇతర జుట్టు సమస్యల బారి నుండి తప్పించుకునే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాగే ఈ కాలంలో ఇతరత్రా స్కిన్‌ ఎలర్జీలు కూడా ఎక్కువే. వాటి నుండి తప్పించుకోవాలన్న ఇదే మార్గం. వర్షంలో తడిసి అలాగే వుండిపోకుండా, మంచి నీటితో స్నానం చేసి, ఏదో ఒకె మాయిశ్చరైజర్‌ని అప్లై చేసుకోవాలి. వర్షాన్ని ఎంజాయ్‌ చేస్తూనే చిన్న చిన్న జాగ్రత్తలు పాఠిస్తే, తర్వాత ఎదుర్కొనే స్కిన్‌ ఎలర్జీల నుండి దూరంగా ఉండొచ్చునన్న మాట. 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి