కుర్రాళ్లోయ్‌ కుర్రాళ్లూ పాక శాస్త్ర ప్రావీణ్యులు.! - ..

gents

'కొత్త ఒక వింత పాత ఒక రోత' అన్నారు మన పెద్దలు. బుద్దిగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుందామంటే, ఏ క్షణాన గెట్‌ అవుట్‌ అనే మాట పిడుగులా వచ్చి పడుతుందో అనే భయం ఇప్పుడు యువతను వెంటాడుతోంది. దాంతో యువత ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే ఫుడ్‌ మీద కుర్రోళ్లు ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. ఫుడ్‌ మీద ఫోకస్‌ అంటే ఎక్కువగా తినేయడం కాదండోయ్‌. పది మందికి వండి పెట్టడం. ఇదివరకట్లో వంటోడు అనే మాట చాలా చిన్నతనం. కానీ ఇప్పుడలా కాదు. పేరులో కాస్త మార్పు వచ్చిందంతే. ఇప్పుడు ఛెఫ్‌ అంటున్నారు. చాలా తక్కువ కాస్ట్‌తో చాలా ఎక్కువ డబ్బులు తెచ్చి పెట్టే 'ఫుడ్‌ ఆన్‌ వీల్‌ ' ఇప్పుడు అందరి నోటా నానుతోంది.

స్టార్‌ హోటల్స్‌కి వెళ్లి వేలు ఖర్చు చేసి, వెరైటీ డిష్‌లను ఆస్వాదించడం ఒకప్పటి ట్రెండ్‌. ఇప్పుడు వందల్లో ఖర్చు చేస్తే అంతకు మించిన టేస్ట్‌, వెరైటీస్‌ భోజన ప్రియుల్ని చవులూరించేస్తున్నాయి. భారతదేశంలో దాదాపుగా అన్ని ప్రముఖ డిష్‌లు ఈ ఫుడ్‌ ఆన్‌ వీల్స్‌లో దొరుకుతున్నాయ్‌.  శుభ్రత విషయంలో అస్సలేమాత్రం రాజీ పడడం లేదు. రుచి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆర్డర్‌ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ సమయంలో ఫుడ్‌ చేతికందుతోంది. పైగా ఇదంతా మన కళ్ల ముందే తయారవుతోంది. ఇలాంటి ప్లస్‌ పాయింట్స్‌ ఆహార ప్రియుల్ని ఆకట్టుకకోకుండా ఎలా ఉంటాయ్‌. అందుకే రోజు రోజుకీ ఫుడ్‌ ఆన్‌ వీల్స్‌ పట్టణాల నుండి ఓ మోస్తరు టౌన్స్‌కి కూడా వ్యాపించేస్తోంది. 
ఈ ఫుడ్‌ ఆన్‌ వీల్స్‌లో కుర్రాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. 3 లక్షల నుండి 15 లక్షల వరకూ పెట్టుబడి అవుతోంది. టూ వీలర్స్‌ని బేస్‌ చేసుకుని కూడా కొన్ని ఫుడ్‌ ఆన్‌ వీల్స్‌ రూపొందుతున్నాయి.

ఆటోలు, మినీ వ్యాన్‌లు ఇలా ప్రతీ వాహనాన్ని తమ అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దడంలో యువత చూపిస్తున్న శ్రద్దని ప్రత్యేకంగా అభినందించి తీరాలి. ఉదయాన్నే టిఫిన్స్‌, మద్యాహ్నం లంచ్‌, సాయంత్రం డిన్నర్‌.. కొంతమంది ఈ మూడు రకాల్ని ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఒక సెక్షన్‌కే పరిమితమవుతున్నారు. ఎక్కువ మంది ఫోకస్‌ మాత్రం నైట్‌ డిన్నర్‌కే. సాయంత్రం 5 గంటల నుండి, రాత్రి 12 గంటల వరకూ అందుబాటులో ఉంటున్నాయివి. ఆదాయం పరంగా చూసుకుంటే రోజుకు 5000 నుండి 25000 వరకూ, అంతకు మించి కూడా చిన్న చిన్న ఫుడ్‌ ఆన్‌ వీల్స్‌ ద్వారా ఆర్జిస్తున్నారు. అందుకే వీటికింత క్రేజ్‌. ఉద్యోగం మానేయాల్సిన పని లేకుండా ఈవెనింగ్‌ ఓ నాలుగైదు గంటలు కేటాయించి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్ని ఈ ఫుడ్‌ ఆన్‌ వీల్స్‌పై చూస్తే ఎవరైనా షాక్‌ అవ్వాల్సిందే.!

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి