మతులు పోగొడుతున్న శ్రీమతులు.! - ..

woman is tied to freedom.

పెళ్లియితే ఇక వంటింటికే అంకితమైపోవాలి. బయటి ప్రపంచంతో సంబంధం ఉండకూడదనే నిబద్ధత ఇప్పటికీ చాలా మంది పెళ్లయిన ఆడవాళ్లలో ఉంది. ఓ పక్క అన్ని రంగాల్లోనూ మహిళలు తమ సత్తా చాటుతుండగా, మరోవైపు అక్కడక్కడా ఏదో మూల ఇలాంటి నిబద్ధతలు మహిళ స్వాతంత్య్రాన్ని కట్టిపడేస్తున్నాయి. ఏదేమైనా ఇదొకప్పటి మాటే అని చెప్పాలి. ఇప్పుడిప్పుడే మహిళలు బయటికి వస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా మహిళలు తామేంటో ప్రూవ్‌ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్యాషన్‌ తదితర రంగాలకు పెళ్లైన ఆడవారు చాలా దూరంగా ఉంటారు. మాకెందుకులే మేకప్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్స్‌.. మాకు భర్తే లోకం. పిల్లలే ప్రపంచం అనుకుంటారు. ఆ ఆలోచనలో చాలా వరకూ మార్పులొచ్చాయి. ఫ్యాషన్‌ తదితర రంగాల్లో మహిళలు ముందుకొస్తున్నారు. టీవీ షోలు ఇతరత్రా గ్రూప్‌ పార్టీల్లో సందడి చేస్తున్నారు.

సినిమాల విషయమే తీసుకుంటే, ఇదివరకటి రోజుల్లో పెళ్లయిన హీరోయిన్లు తదుపరి హీరోయిన్లుగా పనికొచ్చే వారు కాదు. అంతవరకూ స్టార్‌ హీరోయిన్లుగా వెలుగొందినా, పెళ్లయితే ఏ అక్క పాత్రలోనో, వదిన పాత్రలోనో, లేకుంటే తల్లి పాత్రలకే పరిమితం. అలా ఇష్టం లేనివారు వారి కెరీర్‌ని బ్రేక్‌ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. సమంత తదితర హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా మునుపటిలాగే అవకాశాలు దక్కిరంచుకుంటున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే రియల్‌ లైఫ్‌ మ్యారీడ్‌ లేడీస్‌ కూడా తమ లైఫ్‌ని మరింత అందంగా, విభిన్నంగా, కొత్తగా మలచుకుంటున్నారు. కిట్టీ పార్టీలు, ఫ్యాషన్‌ షోల పేరు చెప్పి తమలోని గ్లామర్‌ టాలెంట్‌నీ, ఇతరత్రా టాలెంట్స్‌నీ బయటికి తీస్తున్నారు. ఈ సాంప్రదాయం ఇప్పుడు ఓ మోస్తరు పట్టణాల్లో కూడా బాగా స్ప్రెడ్‌ అయ్యింది. ఇందులో భాగంగానే పెళ్లి తర్వాత మహిళలు ఫిట్‌నెస్‌పై ఎక్కువగా కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నారు. పెళ్లయిపోయిందిలే ఇప్పుడేం అందంగా కనిపించాలి అనుకోకుండా, వయసుతో సంబంధం లేకుండా, శరీర ధారుడ్యాన్ని పెంచుకుంటున్నారు.

అలాగే కిట్టీ పార్టీలు, ఫ్యాషన్‌ షోలే కాకుండా, పలు సేవాకార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. కొంతమంది లేడీస్‌ గ్రూపులుగా ఫామ్‌ అయ్యి అనాధ పిల్లలకు, వృద్ధులకు తమ వంతు సేవలందిస్తున్నారు. ఆధ్యాత్మ్రిక చింతనలోనూ లేడీస్‌ ఉత్సుకత చూపిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ లైవ్స్‌ వీటికి బాగా తోడ్పడుతున్నాయి. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఆడవారంతా కలిసికట్టుగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడంలో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ సంస్కృతి వారిలో ఐకమత్యంతో పాటు, ఆత్మ స్థైర్యాన్ని కూడా నింపేందుకు తోడ్పడుతోంది. అంతేకాదు, ఈ మధ్య అడ్వెంచర్‌ టూర్స్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నారు మన శ్రీమతులు. ఈ రకంగా అన్ని విషయాల్లోనూ పెళ్లి తర్వాత శ్రీమతులు టీజనేజర్స్‌కి తామేమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. 

మరిన్ని వ్యాసాలు