జయజయదేవం జోకులు - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

నష్టాలయ్య: నక్షత్రకుల వారూ, అప్పులు వసూళ్ళు చేసే నిఖార్సయిన మార్గం చెప్పండి స్వామీ!
నక్షత్రకుడు: అబద్ధాలు పలికే వాళ్ళకి అప్పులివ్వకు, డబ్బులు తిరిగిరావు!

 

 

 

రాజు తప్పులయ్య: మహారాణీ... నువ్వు వంద తప్పులు చేసిన నేరానికి శిక్ష విధించ దలిచాను!
రాణి ఓపికమ్మ: అలాగే నాథా... ఏమి శిక్ష విధిస్తారో తెలియజేయండి.
రాజు తప్పులయ్య: నేనూ ఒక తప్పు చేయబోతున్నాను. చిన్న రాణీని పట్టమహిషిగా ప్రకటించబోతున్నాను.
రాణి ఓపికమ్మ: పప్పులో ఉప్పుక్కెవేయడం లాంటి, నేను చేసిన చిన్న చిన్న తప్పుల పట్టిక తయారుచేశారు. వంద తప్పులకి , శిక్షగా నన్ను తిరస్కరించారు. జనం మెచ్చుకోరూ?
రాణి తప్పులయ్య: ఎందుకుమెచ్చుకోరూ?
రాణి ఓపికమ్మ: మీరే చెప్పారుగా... తప్పు చేయబోతున్నారని.. అందుకూ!!


భటుడు, సోమరెడ్డి: శమంతక మణి, మణుగులు మణుగుల బంగారం ఇస్తుందటగా? అంత బంగారం ఏం చేసుకుంటారో?
భటుడు, నిజం నాయుడు: బలరామ దేవులు, మనకి నెల నెలా, దానంగా, చేతి నిండా డబ్బులిస్తున్నారుగా?
భటుడు సోమరెడ్డి: ఊరికే ఇవ్వలేదుగా...? మనం చేసే ఉద్యోగానికి జీతం కాదా?
భటుడు నిజం నాయుడు: ఇలా సొల్లు కబుర్లాడుకుంటూ కూచోని పడి వుండడం, ఉద్యోగమా?

 

సేవకుడు సోముడు: కొత్తగా నియమించిన మల్ల యుద్ధ వీరుడు, రోజుకు వంద కోడి గుడ్లు, మూడు వీశల గొర్రె మాంసం, అర పీపాయి సారా ఆరగించి గొడ్డు నిద్ర పోతున్నాడు దండనాయకా!
దండనాయకుడు: మంచిదే కదా, ఒళ్ళు బలిసి దృఢ కాయుడౌతాడు!
సేవకుడు సోముడు: కదల్లేకపోతున్నాడు... అతడ్ని మంచం నుంచి దించడానికి, నడిపించడానికి పది మంది సేవకులు కావలసి వస్తోంది నాయకా!!

 

పౌరుడు పప్పుస్వామీ: పంతాల రాజ్యం లో పరుగు పందాల పోటీలు జరుపుతున్నారట కదా?
పౌరుడు మెప్పు స్వామీ: ఔను... ఐతే పందెం లో పాల్గొనాలంటే కొన్ని అర్హతలుండాలి.
పౌరుడు పప్పు స్వామి: ఏమా అర్హతలు?
పౌరుడు మెప్పు స్వామీ: యుద్ధ భూమిలో పారిపోయొచ్చుండాలి! దానికి సంబంధించిన ప్రశంసాపత్రం  పొంది వుండాలి!!


భటుడు బసవరాజు: పరిచారికల ఎంపికలో , రాజు గారూ, రాణి గారూ కలిసి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారే...?
భటుడు సోమరాజు: పరిచారిక పుష్టిగా బొద్దుగా వుంటే దండనాయకుడు కన్ను వేస్తాడు, మామిడి రంగు , పెద్ద కళ్ళున్న అమ్మాయిలంటే, మహా మంత్రి కన్ను గీటుతాడు. పొడుగ్గా, సన్నగా వుండే కన్యలని చూస్తే యువరాజు జొల్లుకారుస్తాడు! అందుకని అలాంటి అమ్మాయిలని ఉద్యోగానికి తీసుకోటం లేదు!!

 


 

సేవకుడు సేతుపతి: మన రాజావారు రెండు కత్తులొదిగే వొర చేయించుకుంటున్నారే?
సేవకుడు లఘుపతి: ఔను, అందులో ఒకటి రాజావారి కత్తి, రెండో సేనాధిపతి కత్తి పెట్టుకునేందుకు!

సేవకుడు సేతుపతి: సేనాధిపతి కత్తి ఎందుకూ?
సేవకుడు లఘుపతి: సేనాధిపతి బహు కోపిష్టి. ప్రతి చిన్న విషయానికి, కత్తి దూస్తాడు!!

 

 

 


పరిచారిక ఏమ్ములమ్మ: మన యువరాజు గారు, పంతాల దేశపు యువరాణిని ప్రేమిస్తున్నారు తెలుసుగా
కొత్తగా వచ్చిన కోమలమ్మ: యువరాజుగారికి తమ్ముడున్నారా?
పరిచారిక ఏమ్ములమ్మ: వున్నారుగా!
కొత్తగా వచ్చిన కోమలమ్మ: ఆయన కూడా, ఆ యువరాణినే ప్రేమిస్తున్నారా?
పరిచారిక ఏమ్ములమ్మ: ఔను! నీకెలా తెలుసు?
కొత్తగా వచ్చిన కోమలమ్మ: ఇది మామూలేగా?

సుబ్బన్న: మన రాజుగారు, తన కొడుకును గాక, మనవడ్ని పట్టాభిషిక్తుడ్ని చేయబోతున్నారటగా?
మల్లన్న: ఔను!మనవడు తాగుబోతు, స్త్రీ లోలుడు, జూదరి.
సుబ్బన్న: అలాంటి వాడికా పట్టాభిషేకం?
మల్లన్న: అంతా తన పోలికేనట! అందుచేత!!

 

భటుడు భల్లాల: మన రాజుగారు, యుద్ధ భూమిలో కొత్త ప్రయోగం చేయబోతున్నారటగా?
భటుడు బిజ్జల: తేనటీగలని పెంచుతున్నారు... ఎందుకనుకున్నావ్?

 

          

 

..

మరిన్ని వ్యాసాలు