ప్రజలు దీనిని ఎందుకు ఇష్టపడ్డారంటే, రెండు వేరువేరు ప్రాణాలు ఒక్కటిగా చెయ్యబడుతున్నాయి కాబట్టి. భారతదేశంలో, వివాహం ఎలా చెయ్యాలన్న దాని వెనుక ఒక పెద్ద శాస్త్రం ఉంది. ఇద్దరికి వివాహం చేసేటప్పుడు, వారికుటుంబాల మధ్య సయోధ్యత, వారి శరీరాల మధ్య సయోధ్యత చూసేవారు కాదు. వారి శక్తి ఒకరికొకరికి అనుకూలంగా ఉందా? లేదా? అనేది చూసేవారు.
ఎన్నో సందర్భాల్లో, వారిద్దరూ ఒకరినొకరు చూసుకునేవారు కూడా కాదు. అది అసలు అవసరం అయ్యేదే కాదు. ఎందుకంటే; వీరిద్దరూ ఒకరికి ఒకరు జత కూడతారా.? లేదా అన్న విషయం ఎవరైతే వీరికంటే బాగా తెలుసుకోగలరో, చెప్ప్పగలరో, అటువంటివారు చూసి, చెప్పేవారు. ఒకవేళ వారికిగా వారు ఎంపిక చేసుకున్నట్లయితే, వారు కన్ను-ముక్కు తీరుని బట్టో, మరోదానిని బట్టో, చేసుకోవచ్చు. వివాహం అయిన మూడు రోజుల తరువాత, అవేవీ లెక్కలోనికే రావు. ఒకవేళ మీ భార్యకి అందమైన కళ్ళు ఉన్నప్పటికీ ఆవిడ ఊరికే అలా మిమ్మల్ని తేరిపారా చూసిందనుకోండి అందులో ఉపయోగం ఏమి ఉంది ?
మంగళసూత్రం అంటే ఒక పవిత్రమైన సూత్రం. మంగళసూత్రాన్ని తయారు చెయ్యడం అనేది ఒక పెద్ద శాస్త్రం.
మంగళసూత్రాన్ని తయారు చేసే విధానం తెలిసిన వారు వివాహాలు నిశ్చయించేవారు. మంగళసూత్రం అంటే ఒక పవిత్రమైన సూత్రం. మంగళసూత్రాన్ని తయారు చెయ్యడం అనేది ఒక పెద్ద శాస్త్రం. నూలుపోగుకు కొంత పసుపుని పోసి, శక్తివంతం చేసి, ఒక విధానంలో తయారు చేసేవారు. ఒకసారి దీనిని కట్టిన తరువాత, అది ఈ జీవితానికీ తదనంతరము కూడా..!
ఎన్నో సందర్భాల్లో; దంపతులు ఎన్నో జన్మలపాటూ దంపతులుగా ఉన్న దాఖలాలూ ఉన్నాయి. మీరిది ఎరుకతో చేసుకున్న ఎంపిక. ఎందుకంటే; ఇందులో ఉపయోగించే విధానాలు ఎటువంటివంటే, ఇక్కడ కేవలం భౌతికంగానూ భావపరంగానూ ఇద్దరు వ్యక్తులను ఒక్కటిగా చెయ్యడం మాత్రమే కాదు..! మీరు శరీరంతో, మనసుతో, భావంతో చేసినది మరణంతో పోతుంది. కానీ మీరు ఏదైతే శక్తిపరంగా చేస్తారో, అది అలా నిలిచి ఉంటుంది. మీరు ఇద్దరు వ్యక్తుల నాడులను ఒక్కటిగా చెయ్యవచ్చు. అందుకే, ఒకసారి ఇలా చేస్తే అది జీవితాంతం ఉండే సంబంధంగా భావించేవారు. ఇక మళ్ళీ తిరిగి చూసుకునే అవసరమే లేదు. ఎందుకంటే ఇలా ఇద్దరు వ్యక్తులను ఒక్కటిగా చేయడం అన్నది మీ అవగాహనకు మించింది.
మీరు శరీరంతో, మనసుతో, భావంతో చేసినది మరణంతో పోతుంది. కానీ మీరు ఏదైతే శక్తిపరంగా చేస్తారో, అది అలా నిలిచి ఉంటుంది. ఇప్పుడు కూడా అదే పద్ధతిని ఉపయోగిస్తున్నారు. కానీ, ప్రజలకు ఇది ఎలా చెయ్యాలో తెలియదు. అందుకని; సహజంగానే ప్రజలు ఈ పసుపు త్రాడుని వేసుకోము అని అంటున్నారు. మీరు వేసుకున్నా, వేసుకోకపోయినా ఇప్పుడు దానికేమీ పెద్ద అర్ధం లేదు. ఎందుకంటే; దాని వెనకాల ఉన్న శాస్త్రం అంతా మరుగున పడిపోయింది.
ఎవరికైతే ఇది చెయ్యడం తెలుసో; అటువంటివారు చేసినప్పుడు, ఆ దంపతులలో - “ఈవిడ నా భార్య అవ్వాలా? వద్దా?” “ఈయన ఎప్పటికీ నా భార్తగానే ఉంటాడా?” - వంటి ఆలోచనలే వచ్చేవి కాదు. మరణం కూడా వీరిని విడదీయలేకపోయేది.
ఇటువంటి దంపతులు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ఒకరు మరణించగానే మరొకరు ఎంతో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొన్ని నెలల్లో మరణిస్తారు. ఎందుకంటే; శక్తిపరంగా వీరు ఈ విధంగా ఒక్కటి చెయ్యబడ్డారు. మీరు కనుక ఈ విధంగా మరొక వ్యక్తితో ఒక్కటి చెయ్యబడితే; రెండు జీవాలూ ఒక్క ప్రాణంగా ఉన్నట్లయితే, అది జీవించడానికి ఎంతో అద్భుతమైన విధానం. అది ముక్తి కాదు. అయినప్పటికీ, అది జీవించడానికి ఎంతో అందమైన విధానం.
ప్రేమే గమ్యం కాదు
ఈ రోజుల్లో, ప్రజలు ప్రేమగురించి మాట్లాడినప్పుడు; వాళ్ళు కేవలం భావపరమైనదాని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మీ భావాలు ఈరోజున ఒక విధంగా ఉంటే రేపు మరొక విధంగా ఉంటాయి. మీరు, మొట్టమొదట ఈ అనుబంధం ఏర్పరచుకున్నప్పుడు; ఇది ఎప్పటికీ అని అనుకున్నారు. కానీ, మరొక మూడు నెలల్లో “అసలు ఇలాంటి వ్యక్తితో నేనెందుకు ఉన్నాను?” అని అనుకుంటారు. మీ ఇష్టాయిష్టాలు ఈవిధంగా నడుస్తున్నాయి కాబట్టి; ఇలాంటి స్థితిలో, మీ అనుబంధాలు కేవలం మిమల్ని బాధ మాత్రమే పెడతాయి. ఒక అనుబంధంలో స్థిరత్వం లేనప్పుడు, అది వచ్చి-పోతూ ఉన్నట్లయితే, అది ఎంతో బాధని కలిగిస్తుంది. ఇదంతా పూర్తిగా అనవసరం.
మీరు ప్రేమలో పడడానికి కారణం, అది మీకు పారవశ్యాన్ని తెచ్చిపెట్టాలని. ప్రేమే మీ లక్ష్యం కాదు. పారవశ్యం అన్నది మీ లక్ష్యం. గాయపడినా సరే.. ఎన్నోసార్లు బాధపడ్డా సరే..ఎవరితోనో ప్రేమలో పడడం అన్నదానిగురించి, ప్రజలు పిచ్చెక్కిపోతున్నారు. ఎందుకంటే; వారు ప్రేమ అంటే, అందులో కొంత పారవశ్యం ఉందని అనుకున్నారు. ప్రేమ అనేది, పారవశ్యానికి ఒక కరెన్సీ లాంటిది. కానీ ప్రస్తుతం ప్రజలకు ఈవిధంగా మాత్రమే ఆనందంగా ఉండడం తెలుసు.
కానీ, మీ సహజ తత్వంలోనే మీరు ఆనందంగా ఉండడానికి ఒక మార్గం ఉంది. మీరు ఎంతో పారవశ్యంలో ఉండే వ్యక్తి అయితే; ప్రేమగా ఉండడం అన్నది అసలు ఒక సమస్యే కాదు. ఎలా అయినా మీరు ప్రేమగానే ఉంటారు. కానీ మీరు ప్రేమ ద్వారా పారవశ్యాన్ని కోరుకున్నప్పుడు మాత్రమే; ఎవరితో ప్రేమగా ఉండాలి? అన్న ప్రశ్న ఎదురౌతుంది. కానీ మీరు సహజంగానే పారవశ్యంలో ఉన్నప్పుడు; మీరు ఏది చూసినా సరే, మీరు దానిని ప్రేమగానే చూస్తారు. ఎందుకంటే; దానితో చిక్కుకుపోతామేమో అన్న భయం మీకు ఉండదు. చిక్కుకుపోతామేమో అన్న భయం ఇంక ఉండనప్పుడు మాత్రమే; మీకు జీవితంలో పూర్తిగా నిమగ్నమవ్వడం అంటే ఏమిటో తెలుస్తుంది.
(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో...)