'యూ ట్యూబ్‌' నాట్‌ ఎట్‌ ఆల్‌ ఏ గ్రేట్‌ జాబ్‌.! - ..

yu tube not at a great job

కూరలో తాలింపు దగ్గర నుండి, అతి క్లిష్టమైన మెకానిజం వరకూ దేని గురించి తెలుసుకోవాలన్నా యూట్యూబ్‌ని ఆశ్రయిస్తున్నాం. యూట్యూబ్‌ అంతలా మన జీవితంలో ఓ భాగమైపోయింది. వెరైటీ వంటకాలు, అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతాలు, వాట్‌ నాట్‌ యూ ట్యూబ్‌లో దొరకని సమాచారం లేదంటే అతిశయోక్తి కాదేమో. యూట్యూబ్‌లో విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని వెతుక్కుంటున్నారు చాలా మంది. పలానా కోర్సుకి సంబంధించిన వివరాలు కావచ్చు. పలానా వంటకి సంబంధించిన సమాచారం కావచ్చు. పలానా ఊరికి సంబంధించిన వివరాలు ఇలా దేనికి సంబంధించిన సమాచారమైనా యూట్యూబ్‌లో తెలుసుకోవడం ఆహ్వానించదగ్గ విషయమే. వ్యవసాయం, వ్యాపారం తదితర రంగాల్లో కొత్త మార్పుల గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్‌ ఎంతగానో ఉపయోగపడుతోంది.

ప్రపంచంలో ఎక్కడా ఏ మూల ఎలాంటి అద్భుతాలు జరిగినా తెలుసుకోగలుగుతున్నాం. ఆ రకంగా యూ ట్యూబ్‌ మనిషి జీవితంలో పెను సంచలనానికి కారణమైంది. అభివృద్ధిలో దూసుకెళ్లడానికి ఎంతో ఉపయోగపడుతోంది. కానీ మంచి వెనక చెడు, ఎలా ఉంటుందో యూ ట్యూబ్‌ విషయంలోనూ, ఆ చెడు ఆలాగే ఉంటుంది. అశ్లీల వీడియోలు, ఫేక్‌ వీడియోలు, కల్పిత సమాచారం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మానవ జీవితంలో అలజడులు సృష్టిస్తున్నాయి. ఎక్కడో జరిగిన ఓ దురదృష్ట సంఘటన, ఇంకెక్కడో జరిగిందని చూపించే ప్రయత్నం సమాజాన్ని భగ్గున మండేలా చేస్తోంది. దీన్ని నియంత్రించడం సాధ్యమయ్యే పని కాదు.

యూ ట్యూబ్‌లో చూసి గుత్తి వంకాయ కూర ఎలా వండాలో తెలుసుకోవడం మంచిదే. కానీ ఈ భూమ్మీదకు రావల్సిన ఓ పసిగుడ్డును యూట్యూబ్‌ ఉందిలే అని చంపేస్తే.? ఆలోచనే అతి భయంకరంగా ఉంది కదూ. ఎక్కడో కాదు మన ఇండియాలోనే అదీ మన పొరుగు రాష్ట్రం చెన్నైలో జరిగింది ఈ ఘటన. నెలలు నిండి పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను స్నేహితుడి సలహాతో యూట్యూబ్‌ సమాచారంతో చంపేశాడో చదువుకున్న మూర్ఖుడు. తల్లి, తల్లి కడుపులో బిడ్డ ఈ యూ ట్యూబ్‌ పైత్యానికి బలైపోయారు. యూ ట్యూబ్‌లో వైద్యుల సలహాలు, వైద్యానికి సంబంధించి వీడియోలు మనకి సమాచారాన్ని మాత్రమే ఇస్తాయి. ఆయా సమస్యల పట్ల అవగాహన పెంచుకోవడానికి వాటిని చూస్తే తప్పు లేదు. కుక్క చేయాల్సిన పని గాడిద, గాడిద చేయాల్సిన పని కుక్క చేస్తే ఏమవుద్దో తెలుసు కదా.! కత్తిని కూరలు తరగడానికీ వాడొచ్చు. మనుషుల్ని చంపడానికి వాడొచ్చు. దాన్ని ఎలా వాడుతున్నాం అనేదే ముఖ్యం. యూట్యూబ్‌ని విజ్ఞతతో వాడండి. మూర్ఖత్వాన్ని జత చేయకండి.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు