మేష రాశి : ఈవారంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, కాస్ట్ ఊహలో సమయాన్ని గడుపుటకు ఆస్కారం ఉంది. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు పొందుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో మీ ఆలోచనలను తెలియజేసే ప్రయత్నం చేస్తారు, సభ్యుల నుండి మిశ్రమ ఫలితాలు పొందుతారు. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి లేక విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి సంతోషకరమైన వార్తను వినే ఆస్కారం ఉంది. నూతన కార్యక్రమాల పట్ల మక్కువను చూపిస్తారు. మిత్రులతో సర్దుబాటు విధానం మంచిది.
వృషభ రాశి :ఈవారంలో ముఖ్యమైన నిర్ణయాల్లో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. చేపట్టిన పనులను ముందుకు తీసుకువెళ్ళుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. అధికారుల సూచనల మేర మీ ప్రయత్నాలు ఉండుట వలన మరింత లబ్దిని పొందుతారు. సంతాన పరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం కలదు. రావాల్సిన రుణాలు సమయానికి చేతికి అందే ఆస్కారం కలదు.
మిథున రాశి :ఈవారంలో బంధువులను కలుస్తారు, బంధువులతో కలిసి సమాలోచనలు అలాగే విందులల్లో పాల్గొనే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెద్దలతో మీకున్న అనుభందం బలపడేలా మీ ఆలోచనలు , నిర్ణయాలు ఉండుట సూచన. కుటుంబంలో సభ్యులతో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు లేక విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. స్త్రీ పరమైన విషయాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట అనేది సూచన. చర్చలకు దూరంగా ఉండండి.
కర్కాటక రాశి : ఈవారంలో ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టత ఉండుట వలన మేలుజరుగుతుంది. చర్చాపరమైన విషయాల్లో మీ ఆలోచనలు స్పష్టంగా తెలియజేయుట సూచన. కుటుంబసభ్యులతో సర్దుబాటు విధానం మంచిది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. బంధువులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశమా ఉంది, మీ ఆలోచనలు వారితో పంచుకొనే ప్రయత్నం మంచిది.
సింహ రాశి : ఈవారంలో ప్రతివిషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అధికారులతో అనుకోకుండా మనస్పర్థలు ఏర్పడే ఆస్కారం ఉంది, జాగ్రత్త. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం విషయాల్లో స్పష్టత వస్తుంది, కొంతమేర చేతికి అందుటకు ఆస్కారం ఉంది. వాహనాల వలన ఖర్చులు పెరుగుతాయి. మీ కోపం వలన మిత్రులను కోల్పోయే ప్రమాదం ఉంది కావున కాస్త సర్దుబాటు విధానం అలిగి ఉండుట సూచన. సోదరుల నుండి వచ్చిన విషయాల్లో ఆచితూచి వ్యవహరించుట మేలు.
కన్యా రాశి : ఈవారంలో విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, సమయాన్ని కుటుంబసభ్యులతో సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట సూచన. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి, నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. సంతాన పరమైన విషయాల్లో ఆందోళన తొలగుటకు ఆస్కారం ఉంది , సంతోషంగా ఉంటారు.
తులా రాశి : ఈవారంలో పెద్దలను కలుస్తారు. మానసికంగా ఆదోళన ఉండుటకు ఆస్కారం ఉంది, మీరు తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత ఉండకపోవచ్చును. విలువైన వస్తువులను కోల్పోయే ఆస్కారం ఉంది, జాగ్రత్త అవసరం. సోదరులతో మీకున్న విభేదాలు మరింతగా పెరుగుటుకు ఆస్కారం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు పెరుగుతాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. చర్చల్లో కాస్త నిదానం అవసరం.
వృశ్చిక రాశి : ఈవారంలో పెద్దలనుండి నూతన విషయాలను పొందుతారు. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. చిన్న చిన్న విషయాల వలన సంతోషమును పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో ఊరట చెందుతారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. మీ మాటతీరు మూలన చాల పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పనిఒత్తిడి ఆస్కారం ఉంది కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నం విఫలం అవుతుంది. వ్యాపారపరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు.
ధనస్సు రాశి : ఈవారంలో సంతాన పరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును. శుభకార్యక్రమాల విషయంలో పెద్దలతో కలిసి నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. పనులు అనుకున్న అంతగా వేగంగా ముందుకు వెళ్లకపోవచ్చును. ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. చర్చల్లో మధ్యలో వెళ్లిపోయే ఆస్కారం ఉంది, చర్చలను పూర్తిచేసే ప్రయత్నం మంచిది. మిత్రులతో ఆలోచనలు పంచుకుంటారు.
మకర రాశి : ఈవారంలో కుటుంబంలో చర్చలకు ఆస్కారం ఉంది, అందరిని కలుపుకొని వెళ్ళుట సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయాలు బలపడుతాయి. పెద్దలనుండి వచ్చిన సూచనల విషయంలో అభిప్రాయ బేధాలు ఉండే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు.
కుంభ రాశి : ఈవారంలో సోదరులతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆత్మీయులను కలుస్తారు , వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. స్థిరాస్ధి కొనుగులు విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. కుటంబంలో చిన్న చిన్న సర్దుబాట్లు మేలుచేస్తాయి. పెద్దలతో ఊహించని విధంగా విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కోల్పోతారు. అనుకోకుండా ప్రయాణాలు రద్దు అయ్యే ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును.
మీన రాశి :
ఈవారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట ఉత్తమం . ఆత్మీయుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు చేయుటకు ఆవకాశం ఉంది. జీవిత భాగస్వామితో గతంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గుటకు ఆస్కారం ఉంది. బంధువులతో సర్దుబాటు విధానం మంచిది. సంతానపరంగా నలుగురిలో మంచి పేరు లభిస్తుంది. చర్చల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.