విష సంస్కృతి: ఛాలెంజ్‌ టు కిల్‌.! - ..

kik challenge

పూట గడవక అర్ధాకలితో ఎన్నో ప్రాణాలు నిత్యం గాలిలో కలిసిపోతున్నాయి. అలాంటిది. కడుపు నిండి, ఒళ్లు కొవ్వెక్కి కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులో, జీవితంలో ఏమీ సాధించలేకపోయామనో, లేక ఇంకో సమస్యో వీరి మరణాలకు కారణం అంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఇవి కొవ్వు బలిసిన ఆత్మహత్యలు. ఆత్మహత్యలే కాదు, హత్యలు కూడా. అసలు విషయం ఏంటంటారా? ఇదే 'ఛాలెంజ్‌ టు కిల్‌'. చిన్నప్పుడు సరదాగా నీకు దమ్ముంటే ఆ చెట్టెక్కగలవా.? అని సవాల్‌ విసురుకునేవారు. అది సరదా వ్యవహారం. కొవ్వు బలిసిన పైత్యం సరికొత్త సవాళ్లను విసురుతోంది. నిన్ను నువ్వు గాయపరచుకోగలవా? నీ ప్రాణం నువ్వు తీసుకోగలవా? ఇంకొకర్ని చంపగలవా? ఇదీ కథ. నిన్న మొన్నటిదాకా 'బ్లూవేల్‌' ప్రకంపనలు సృష్టించింది. భారతదేశంలో పదుల సంఖ్యలో యువత ఈ బ్లూవేల్‌ ఛాలెంజ్‌కి బలైపోయారు. ప్రభుత్వాలు కఠిన చర్చలు తీసుకోవడంతో ఆ పైత్యం పూర్తిగా తగ్గలేదు కానీ, కొంతవరకూ అదుపులోకి వచ్చింది.

తాజాగా మరో మహమ్మారి తీయగా, 'కికి ఛాలెంజ్‌' పేరుతో జనం ప్రాణాల్ని తీసేస్తోంది. వెళుతున్న కార్లోంచి డోర్‌ తీసుకుని కిందికి దిగి ఓ పాటకు డాన్స్‌ చేయాలి. ఇదీ కొత్తగా పుట్టుకొచ్చిన దిక్కుమాలిన ఛాలెంజ్‌. వేపకాయంత వెర్రి జనాన్ని మింగేయడమంటే ఇదే మరి. హీరోయిన్లు ఆదాశర్మ, రెజీనా ఆల్రెడీ ఈ ఛాలెంజ్‌ని స్వీకరించేశారు. వేదికలెక్కి, నీతులు చెప్పే సెలబ్రిటీలు ముందు, వెనకా ఆలోచించకుండా ఇలాంటి వాటికి ప్రాచుర్యం కల్పించడం ఎంతవరకూ సబబు? వెళ్తున్న వాహనంలోంచి హఠాత్తుగా కిందికి దిగి డాన్సు చేయడమంటే ఎంత ప్రమాదరకం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రమాద తీవ్రతను ముందుగానే గుర్తించి, ఈ మహామ్మారిని, ముందుగానే అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. పిచ్చి వేషాలేస్తే బొక్కలో వేస్తాం అంటూ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఎవడికైనా కొవ్వెక్కి ప్రాణం మీద ఆశ లేకపోతే, హ్యాపీగా చచ్చిపోవచ్చుననుకోవచ్చేమో. కానీ ఇతర వ్యక్తి చనిపోవాలి అనే ఆలోచనతో ఎవ్వరూ ఇలాంటి పిచ్చి పనుల్ని ప్రోత్సహించకూడదు. 
ఈ కికి ఛాలెంజ్‌ కారణంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు తక్కువేం కాదు. ఛాలెంజ్‌ తీసుకున్న వాళ్లు రోడ్డు మీద డాన్సులేస్తూ వారి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడంతో పాటు, ఇతరుల ప్రాణాల్ని కూడా తోడేస్తున్నారు. 'బ్లూవేల్‌', కికి' పేరేదైతేనేం పైత్యం ఒకటే. ఒకడేమో ఒళ్లు కోసుకోమంటాడు. ఇంకొకడేమో ఊపిరి బిగబెట్టమంటాడు. మరొకడేమో వేగంగా దూసుకొస్తున్న రైలుకు అడ్డంగా నిల్చొని సెల్ఫీ వీడియో తీసుకోమంటాడు. చచ్చిపోవడానికి ఇన్ని మార్గాలున్నాయా..? అని జనం ఆశ్చర్యపోవడమే కాదు, సాటి మనిషిని తనంతట తానే ప్రాణం తీసుకునేలా ప్రోత్సహిస్తున్న ఈ పైశాచికత్వానికి ఏం పేరు పెట్టాలో కూడా ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. ప్రధానంగా ఇలాంటి పైత్యాలకు యువత బలైపోతోంది. వారినే లక్ష్యంగా చేసుకుని ఎవరు? ఎందుకిలా కుట్రలు పన్నుతున్నారో అర్ధం కాని పరిస్థితి. ఒక దేశానికి సంబంధించింది కాదిది. యావత్‌ ప్రపంచానికే ఇదొక మహా ప్రళయంగా భావించాలేమో.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు