మేష రాశి : ఈవారంలో ముఖ్యమైన పనులకు సమయం కేటాయించుట వలన మేలుజరుగుతుంది. చిన్న చిన్న విషయాలను పట్టించుకోక పోవడం మేలు. కుటుంబవిషయాల్లో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. జీవితభాగస్వామితో చిన్న చిన్న విభేదాలకు ఆస్కారం ఉంది, కాబట్టి సర్దుబాటు విధానము మేలుచేస్తుంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగంలో కాస్త పనిఒత్తిడి పెరుగుటకు ఆస్కారం ఉంది, స్పష్టంగా ఉండుట అలాగే ప్రణాళిక అవసరం. రావాల్సిన ధనం విషయంలో కొద్దిగా వేగంగా పనిచేయుట మంచిది. దైవపరమైన విషయాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి : ఈవారంలో ఆత్మీయులను కలుస్తారు, వారినుండి ముఖ్యమైన సమాచారం పొందుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలకు ఆస్కారం కలదు. కుటుంబంలో సోదరుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి, వాటిని పాటించుట మంచిది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు సూచితం. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే ఆస్కారం ఉంది. జీవితభాగస్వామితో మీకున్న విభేదాలు మరింతగా పెరుగుటకు ఆస్కారం ఉంది. చర్చల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, నిదానంగా ఉండుట సూచన.
మిథున రాశి :ఈవారంలో ప్రతిపనిలో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. రుణపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. కుటుంబంలో పెద్దలతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సంతానం విషయాల్లో ఒత్తిడి తప్పక పోవచ్చును.
కర్కాటక రాశి : ఈవారంలో నూతన పరిచయాలకు అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. పెద్దల నుండి వచ్చిన సూచనల విషయంలో తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. జీవితభాగస్వమితో ఊహించని విధంగా మనస్పర్థలు వచ్చే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులు అనగా వాహనం లేక స్థిరాస్తి కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. తల్లితరుపు బంధువులతో కలిసి నూతన పనులు మొదలు పెడతారు.
సింహ రాశి : ఈవారంలో ఆరంభంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సంతానపరమైన విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు ఆస్కారం కలదు. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో మాత్రం తప్పక జాగ్రత్తలు పాటించుట మంచిది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. తండ్రి తరుపు బంధువులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు అవసరం. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకపోవడం సూచన.
కన్యా రాశి :ఈవారంలో సంతానం విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే ఆస్కారం ఉంది. కుటుంబంలో జరిగే శుభకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఆస్కారం ఉంది. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి. స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట వలన తప్పక మేలుజరుగుతుంది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది.
తులా రాశి : ఈవారంలో వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞులను కలుసుకునే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు పెద్దగా అయ్యే ఆస్కారం ఉంది, కాస్త నిదానంగా వ్యవహరించుట మంచిది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు సూచితం, పనిఒత్తిడి తప్పక పోవచ్చును. సంతానం విషయంలో ఒకింత ఆందోళనకు గురయ్యే ఆస్కారం ఉంది. చర్చాపరమైన విషయంలో స్పష్టత లేకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. నూతన పరిచయాలకు అవకాశం ఉంది.
వృశ్చిక రాశి : ఈవారంలో ఉద్యోగంలో అధికారులకు మీ ఆలోచనలను తెలియజేస్తారు. నూతన ఉద్యోగాలకు ఆస్కారం ఉంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన మిశ్రమ ఫలితాలు పొందుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును. ఆరోగ్యపరమైన సమస్యల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు, జాగ్రత్త తీసుకోండి. మీ మాటతీరు కొంతమందికి ఇబ్బందిని కలుగజేసేదిగా ఉంటుంది. సోదరులతో చేపట్టిన చర్చలు మద్యలో ఆగిపోయే ఆస్కారం ఉంది. చర్చలకు దూరంగా ఉండుట సూచన.
ధనస్సు రాశి : ఈవారంలో చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. తలపెట్టిన పనుల్లో స్పష్టత ఉండుట మరింతగా లాభం. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న విషయాలను సైతం పరిగణలోకి తీసుకోవడం వలన తప్పక మేలుజరుగుతుంది. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట మేలు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. రుణపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట సూచన. మానసికంగా దృడంగా ఉండుట వలన సమస్యలు తగ్గుతాయి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన.
మకర రాశి : ఈవారంలో పెద్దలతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. సామాజిక పరమైన విషయాల్లో చురుగ్గా పాల్గొనే ఆస్కారం ఉంది. చిన్న చిన్న విషయాలకే కోపాన్ని కలిగి ఉంటారు, వివాదాలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. బంధువుల నుండి కీలకమైన విషయాలు తెలుసుకుంటారు , వారితో కలిసి నూతన పనులను చేపడుతారు.
కుంభ రాశి : ఈవారంలో ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. మిత్రులతో కలిసే చేసే పనులను నిదానంగా ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేయుట సూచన. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. దైవపరమైన విషయాల్లో సమయం గడుపుతారు. విలువైన వస్తువులను నష్టపోయే ఆస్కారం ఉంది, జాగ్రత్త. తండ్రితరుపు బంధువులను కలుస్తారు. వారితో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది, సర్దుబాటు అవసరం. ఉద్యోగంలో మార్పుకు ఆస్కారం ఉంది, నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన.
మీన రాశి : ఈవారంలో మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు ఆస్కారం ఉంది. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. స్థిరాస్తిపరమైన విషయాల్లో కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. పెద్దలతో మీకున్న పెరిచయాలు మీకు ఉపయోగపడుతాయి.