బేతాళప్రశ్న - ..

betala prashna

1)వర్షాలు ప్రతి సంవత్సరం వస్తాయి...వాటితోబాటే వచ్చేవి ముంపు ప్రాంతాల కష్టాలు...కొట్టుకుపోయే రోడ్లు...రోడ్లమీద గుంతలూ...ట్రాఫిక్ జాంలూ...ఇవీ క్రమం తప్పకుండా వస్తాయి...ఆలోచిస్తే, పరిష్కారాలు ప్రజల చేతిలోనే ఉన్నాయి....సహనంతో సరైన దారిలో వాహనాలు నడిపితే ట్రాఫిక్ జాంలు ఉండవు....ఇక స్థలాలు కొనేప్పుడే వాటి పూర్వాపరాలు విచారిస్తే అవి ఎలాంటి ప్రాంతాలో తెలుసుకొనే అవకాశం ఉంటుంది...అలాగే, రోడ్లు వేసేప్పుడే బాధ్యతగల పౌరులుగా కాంట్రాక్టర్లను నిలదీస్తే రోడ్ల నాణ్యత మెరుగయ్యే అవకాశం ఉంటుంది....

2)ఇది పూర్తిగా కరెక్ట్ కాదు....ఇవన్నీ పూర్తిగా ప్రభుత్వాల చేతిలో పరిష్కరించబడవలసిన అంశాలు.ఉదాహరణకు రోడ్ల నాణ్యత...అవినీతికి తావులేకుండా కాంట్రాక్టర్లను కట్టడి చేయడం...చెరువుల్లో వేసిన లే అవుట్లకు అనుమతులివ్వకపోవడం....నిపుణులైన ఇంజనీర్లచేత ప్లాన్ చేయించి నీటి ప్రవాహాన్ని దారి మళ్ళించి ముంపు ప్రాంతాలను రక్షించవచ్చు....రోడ్లను విస్తరించడం, ట్రాఫిక్ నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడం, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ఇవన్నీ సక్రమంగా నిర్వంతించాలి...


పై రెండింట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

శ్రీరామ నవమి విశిష్టత
శ్రీరామ నవమి విశిష్టత
- సి.హెచ్.ప్రతాప్
Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్